Bear sees mirror: అడవిలో అద్దాన్ని చూసిన ఎలుగుబంటి.. దాని రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:30 PM
ఇటీవలి కాలంలో వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు, వాటి విచిత్రమైన ప్రవర్తన తీరులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవలి కాలంలో వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు, వాటి విచిత్రమైన ప్రవర్తన తీరులు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలా మంది ఇటీవలి కాలంలో నేరుగా జంగిల్ సఫారీ టూర్‌లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటోంది (bear reaction).
@Earth_Seeker1 ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ అడవిలో చిత్రీకరించారు. అక్కడ ఓ స్తంభానికి ఓ అద్దాన్ని అమర్చారు. అక్కడకు ఓ ఎలుగు బంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడగానే షాక్ అయిపోయింది. తన ముందు మరొక ఎలుగుబంటి నిలబడి ఉన్నట్లు భావించి దాడికి దిగింది. అద్దం వెనక్కి వెళ్లి మరో ఎలుగు బంటి ఎక్కడి నుంచి వచ్చిందో వెతికింది. చివరకు ఆ అద్దాన్ని తీసి కింద పడేసింది. ఈ మొత్తం దృశ్యం చాలా ఫన్నీగా ఉండి చూసిన వారందరినీ నవ్విస్తోంది (animal mirror reaction).
ఈ వీడియోను (funny bear video) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను 73 లక్షల మంది వీక్షించారు. 30 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఎలుగుబంటి రియాక్షన్ చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోయామని చాలా మంది కామెంట్లు చేశారు. తన సామ్రాజ్యంలోకి మరో వింత జంతువు వచ్చినట్టు ఆ ఎలుగుబంటి భావించిందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..