Man Escapes From Police: పోలీసులకు షాక్ ఇచ్చిన ఖైదీ.. ఆగి ఉన్న జీప్ నుంచి జంప్..
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:56 AM
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీస్ జీప్ నుంచి ఖైదీలు తప్పించుకునే సీన్స్ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హోషంగాబాద్‌కు చెందిన ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జీప్‌లో అతడ్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. కారు హోషంగాబాద్ అవుట్ స్కట్స్‌లో రోడ్డు పక్క ఆగింది.
పోలీసులు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఠక్కున జీప్ డోరు తెరిచి అక్కడినుంచి పరుగులు పెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అతడు జెట్ స్పీడుతో అక్కడినుంచి పరుగులు పెట్టసాగాడు. యువకుడిని పట్టుకోవటం పోలీసుల వల్ల కాలేదు. ఓ పోలీస్ రోడ్డు పక్క కిందపడిపోయాడు. మిగిలిన పోలీసులు అతడ్ని వెంబడించారు. ఎంత ప్రయత్నించినా అతడ్ని పట్టుకోవటం వారి వల్ల కాలేదు. యువకుడు వారికి దొరకకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యువకుడు పోలీసుల నుంచి తప్పించుకున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పోలీసులు ఎంత ఫిట్‌గా ఉన్నారో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఓ పోలీస్ రోడ్డు పక్క బొక్కబోర్లా పడిపోయాడు. అందరూ కలిసినా అతడ్ని పట్టుకోలేకపోయారు’..‘మరీ అంత ఈజీగా అతడు ఎలా తప్పించుకున్నాడు. పోలీసులు అతడి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు’..‘నిజంగా ఆ యువకుడు ప్లాస్ మ్యాన్ తమ్ముడిలా ఉన్నాడు. అందుకే అంత ఈజీగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బాల్య వివాహాల నిర్మూలనకు వంద రోజుల ప్రచారం.
19 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమ.. ఊహించని విషాదం..