Desi jugaad: ఈ ఆటో డ్రైవర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. చలికి ఎలా చెక్ పెట్టాడో చూడండి..
ABN , Publish Date - Dec 22 , 2025 | 07:06 PM
ప్రస్తుత చలికాలంలో ఎక్కువ ఓపెన్‌గా ఉండే ఆటోల్లో ప్రయాణం కాస్త కష్టమే. చుట్టు పక్కల నుంచి గాలి వేగంగా తగిలి ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు ఓ ఆటో డ్రైవర్ అద్భుతంగా చెక్ పెట్టాడు. చలి గాలి రాకుండా చక్కటి ఏర్పాటు చేశాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి వణికిస్తోంది. బయటకు వెళ్లాలంటే స్వెట్లర్లు, క్యాప్‌లు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతటి చలి సమయంలో ప్రయాణం చేయాలంటే మరింత ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా ఎక్కువ ఓపెన్‌గా ఉండే ఆటోల్లో ప్రయాణం కాస్త కష్టమే. చుట్టు పక్కల నుంచి గాలి వేగంగా తగిలి ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు ఓ ఆటో డ్రైవర్ అద్భుతంగా చెక్ పెట్టాడు. చలి గాలి రాకుండా చక్కటి ఏర్పాటు చేశాడు (auto rickshaw winter hack).
mukul0112 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఆటో డ్రైవర్ చల్లని గాలి లోపలికి రాకుండా ఆటోకు రెండు వైపులా మందపాటి తెరలను ఏర్పాటు చేశాడు. దీనివల్ల బయటి నుంచి చల్ల గాలి లోపలికి రాదు. అలాగే డ్రైవర్ సీటుకు, ప్రయాణికులు కూర్చునే సీటుకు మధ్య కూడా ఒక ప్లాస్టిక్ షీట్‌ను అమర్చాడు. ప్రయాణికులకు చలి నుంచి పూర్తి రక్షణ కల్పించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఆటోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది (desi jugaad for winter).
ఈ వైరల్ వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు (winter travel hack India). 77 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇది చలి నుంచి జడ్ ప్లస్ సెక్యూరిటీ అని ఒకరు కామెంట్ చేశారు. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ అని మరొకరు ప్రశంసించారు. ఇది ఆటో కాదని, క్యాబ్‌లా మారిపోయిందని మరొకరు అన్నారు. ఇలాంటి సదుపాయాలు అన్ని ఆటోలలో ఉంటే చలికాలంలో క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..
కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..