Share News

Swati Maliwal: ఢిల్లీలో కేజ్రివాల్ ఓటమి.. ``ద్రౌపది వస్త్రాపహరణం`` పోస్ట్ పెట్టిన ఆప్ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్..

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:10 PM

వరుసగా మరోసారి విజయ కేతనం ఎగరేసి ఢిల్లీలో హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న ఆప్ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్వయంగా తన నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కేజ్రివాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ విజయం సాధించారు.

Swati Maliwal: ఢిల్లీలో కేజ్రివాల్ ఓటమి.. ``ద్రౌపది వస్త్రాపహరణం`` పోస్ట్ పెట్టిన ఆప్ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్..
Swati Maliwal`s social media post goes viral

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Election) ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి దెబ్బ తగిలింది. వరుసగా మరోసారి విజయ కేతనం ఎగరేసి ఢిల్లీలో హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న ఆప్ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal ) స్వయంగా తన నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కేజ్రివాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ విజయం సాధించారు. కేజ్రివాల్ ఓటమి నేపథ్యంలో ఆప్ పార్టీకే చెందిన ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.


కేజ్రివాల్ ఓటమిని ఉద్దేశిస్తూ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఎక్స్‌లో ద్రౌపది (Draupadi) వస్త్రాపహరణం ఫొటోను పోస్ట్ చేశారు. స్వాతి మలాల్ చేసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతేడాది మే నెలలో కేజ్రివాల్ వ్యక్తిగత సహాయకుడైన బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడినట్టు, కేజ్రివాల్ సమక్షంలో తనను విచక్షణా రహితంగా కొట్టినట్టు స్వాతి ఆరోపించారు. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా పెను దుమారం సృష్టించింది. అప్పట్నుంచి స్వాతికి ఆప్ పార్టీతో విభేదాలు తలెత్తాయి. ఒకప్పుడు అరవింద్‌తో సన్నిహితంగా మెలిగిన స్వాతి అప్పట్నుంచి అతడిపై విమర్శలకు దిగారు.


కేజ్రివాల్ ప్రభుత్వంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా కూడా చేసిన స్వాతి స్వాతి మలివాల్.. కొన్ని రోజులుగా కేజ్రివాల్ నాయకత్వంపై, ఆప్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. యుమునా నదిని శుభ్రం చేస్తామని హామి ఇచ్చిన ఆప్ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ కేజ్రివాల్ ఇంటి ఎదుట స్వాతి ధర్నా కూడా చేశారు. తాజా ఓటమి నేపథ్యంలో ద్రౌపది వస్త్రాపహరణం పోస్ట్ పెట్టి సంచలనం రేకెత్తించారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 09:38 PM