Share News

Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్.. వీడియో మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:43 AM

ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలిక డ్యాన్స్ ప్రదర్శన సందర్భంగా నెలకొన్న చిన్న సన్నివేశం నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ వీడియోను చిన్నారి తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఏకంగా 5.5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్.. వీడియో మామూలుగా లేదుగా..

ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలిక డ్యాన్స్ ప్రదర్శన సందర్భంగా నెలకొన్న చిన్న సన్నివేశం నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ వీడియోను చిన్నారి తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఏకంగా 5.5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో చిన్నారిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లైకులు, షేర్లతో ఆమెను మరింత వైరల్ చేస్తున్నారు.


పాఠశాలలో ఈవెంట్ సందర్భంగా చిన్నారి డాన్స్ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకు రోజుల తరబడి తోటి విద్యార్థులతో కలిసి ప్రాక్టీస్ చేసింది. ఎంతో శ్రమించి డ్యాన్స్ స్టెప్పులన్నీ నేర్చేసుకుంది. చివరికి తాను డ్యాన్స్ చేయాల్సిన రోజు రానే వచ్చింది. స్టేజీ మీదకు తన టీమ్‌తో కలిసి వెళ్లిన చిన్నారి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పాట మెుదలు కావడానికి ముందు తగిన భంగిమలో నిలుచుంది. అయితే తాను రోజుల తరబడి నేర్చుకుని డ్యాన్స్ చేస్తుండడంతో దాన్ని తల్లిదండ్రులు చూడాలని ఆశపడింది. అప్పటికే చిన్నారి అమ్మ, నాన్న ఈవెంట్‌కు హాజరయ్యారు. కానీ వారు ఎక్కడ ఉన్నారో మాత్రం ఎంత చూసినా బాలికకు కనిపించలేదు. ఎట్టకేలకు వారు కనిపించడంతో ఆ చిన్నారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో గట్టిగా నవ్వుతా కేరింతలు కొట్టింది.


ఈ సందర్భంగా చిన్నారికి సంబంధించిన హావభావాలన్ని బాలిక తల్లి అర్పిత కౌతల్ తన సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. అనంతరం ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే వైరల్ అయ్యింది. చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్, ఆమె ఆనందం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్నారి హావభావాలు చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. లైకులు, కామెంట్లతో దుమ్ము లేపుతున్నారు. "నేను నా తదుపరి వీడియోలో ఆమెలాగానే చేస్తాను" అని కొందరు, "చాలా గ్యాప్ తర్వాత తల్లిదండ్రులను చూసిన ఆనందం ఇలాగే ఉంటుందని" మరికొందరు, "అమ్మ, నాన్నను చూసిన ఆనందంతో బాలిక ముఖం వెయ్యి కాంతివంతమైన బల్బుల్లా వెలిగిపోతోందని" ఇంకొందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. చిన్నారి తల్లి సైతం కుమార్తెకు వస్తున్న కామెంట్లు చూసి తెగ సంబరపడిపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Tiger And Lion Video: సింహంతో పులి భీకర ఫైట్.. చివరకు జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Python Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..

Updated Date - Jan 24 , 2025 | 11:45 AM