Share News

Elephant Flips Truck: ఈ ఏనుగుకు ఎంత కోపం వచ్చిందో చూడండి.. మనుషులు ఇప్పటికైనా మారకపోతే..

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:04 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. చాలా మంది వివిధ విచిత్రమైన సంఘటనలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి కోట్ల సంఖ్యలో వ్యూస్ పొందడానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Elephant Flips Truck: ఈ ఏనుగుకు ఎంత కోపం వచ్చిందో చూడండి.. మనుషులు ఇప్పటికైనా మారకపోతే..
elephant flips truck

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. చాలా మంది వివిధ విచిత్రమైన సంఘటనలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి కోట్ల సంఖ్యలో వ్యూస్ పొందడానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. అటవీ జంతువుల ప్రవర్తన చాలా మందిని ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఏనుగు అత్యంత ఆగ్రహంతో చేసిన పని చాలా మందిని ఆలోచింపచేస్తోంది (angry elephant).


ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆగ్రహంగా ఉన్న ఓ ఏనుగు రోడ్డు మీద ఉన్న ఓ మినీ ట్రక్‌‌పై దాడి చేసంది. ఆ ట్రక్‌ను తిరగేసేసింది. దూరంలో ఉన్న కొంతమంది ప్రజలు ఈ ఘటనను చూశారు. కొందరు ఈ ఘటనను తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియోను సుశాంత్ నందా షేర్ చేసి.. 'అడవి నుంచి హెచ్చరిక! ఈ ఏనుగు కేవలం తన శక్తిని మాత్రమే ప్రదర్శించడం లేదు. ఆ ఏనుగు ఎంత ఒత్తిడిలో ఉంతో చెబుతోంద`ని పేర్కొన్నారు (elephant flips truck).


అడవి జీవులు కేవలం వినోదం కోసం కాదని, వాటికి స్థలం, గౌరవం అవసరమని పేర్కొన్నారు (hidden message from elephant). వన్య ప్రాణులకు దూరంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని, వాటిని అడవిలో స్వేచ్ఛగా వదిలెయ్యాలని సుశాంత నంద పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..

ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2025 | 08:04 PM