Sikkim Sundari mystery: ఆనంద్ మహీంద్రా ఫిదా.. ఈ సిక్కిం సుందరి విశేషాలు తెలుసా..
ABN , Publish Date - Dec 23 , 2025 | 06:41 PM
తూర్పు హిమాలయాలలో కనిపించే అరుదైన, అందమైన మొక్క 'సిక్కిం సుందరి'ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్స్ ద్వారా ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. చాలా మందిని ఆకట్టుకుంటోంది.
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు ఫన్నీగా అనిపించిన, ఆసక్తికరంగా కనిపించిన వింతలు, విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా ఆయన తూర్పు హిమాలయాలలో కనిపించే అరుదైన, అందమైన మొక్క 'సిక్కిం సుందరి'ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఎక్స్ ద్వారా ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. చాలా మందిని ఆకట్టుకుంటోంది (Anand Mahindra Himalayas).
స్థానికులు సిక్కిం సుందరి అని పిలుచుకునే ఈ మొక్కను శాస్త్రీయంగా రూమ్ నోబైల్ అని పిలుస్తారు. ఈ మొక్క సముద్ర మట్టానికి సుమారు 4,000 నుంచి 4,800 మీటర్ల ఎత్తులో మాత్రమే పెరుగుతుంది. అంత ఎత్తులో మనుగడ అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఈ మొక్కలు పర్వతాలపై దీప స్థంభాల్లా మెరుస్తుంటాయి. ఈ మొక్క జీవిత చక్రాన్ని పరిశీలిస్తే చాలా వింతగా ఉంటుంది. ఈ మొక్క కొన్ని దశాబ్దాల పాటు కేవలం చిన్న ఆకుల సమూహంగా కనిపిస్తుంది. అయితే ఉన్నట్టుండి ఒక్క రోజులో అకస్మాత్తుగా దాదాపు రెండు మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది (hidden heritage of Himalayas).
రెండు మీటర్ల ఎత్తుకు పెరిగిన తర్వాత ఈ మొక్క విత్తనాలను వెదజల్లుతుంది (unexplored Himalayan secrets). ఆ తర్వాత దాని జీవితాన్ని పూర్తి చేస్తుంది. ఈ ప్రక్రియను సైన్స్‌లో మోనోకార్పీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అద్భుత, అపూర్వమైన వృక్షజాలన్ని ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదని ఆనంద్ మహీంద్రా ప్రశ్నించారు. ఈ మొక్క ఔషధ పరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుందట. జీర్ణక్రియ, వాపు, కాలేయం, నొప్పి సంబంధిత సమస్యలకు ఈ మొక్క చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు. స్థానికులు దీని కాండాలను ఆహారంగా తింటారు. దీని వేర్లను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.. కారు వెనుక స్టిక్కర్ మీద ఏం రాసి ఉందో చదివితే..
ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. ఈ అమ్మాయి ప్రమాదకర స్టంట్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..