Mahindra EVs: మహీంద్రా కార్లతో జపాన్ దేశస్థుల సెల్ఫీలు.. భావోద్వేగానికి లోనైన ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:47 PM
మహీంద్రా కార్లతో జపాన్, కొరియా దేశస్థులు ఫొటోలు దిగడం చూసి ఆనంద్ మహీంద్రా భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు భారతీయులు అంతర్జాతీయ బ్రాండ్స్ చూసి అబ్బురపడేవారని, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని హర్షం వ్యక్తం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్ పో కార్యక్రమంలో మహీంద్రా కార్లపై జపాన్, కొరియా దేశస్థులు ఆసక్తి ప్రదర్శించడం, కార్లతో కలిసి ఫొటోలు దిగడం చూసి ఆనంద్ మహీంద్రా భావోద్వేగానికి గురయ్యారు. భారత్‌లో తయారైన కార్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం చూస్తే తనకు పాత రోజులు గుర్తుస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్ల ప్రదర్శన కార్యక్రమంలో మహీంద్రా బీఈ6 , ఎక్స్ఈవీ 9ఈ వాహనాలను ప్రదర్శనకు పెట్టారు. వీటిపై జపాన్, కొరియా దేశస్తులు అమితాసక్తని ప్రదర్శించడం ఆనంద్ మహీంద్రాను కదిలించింది (Viral).
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! తీవ్ర విమర్శ చేసిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
‘‘కొన్ని దశాబ్దాల క్రితం నా కెరీర్ తొలి నాళ్లల్లో భారతీయ ఆటో రంగానికి చెందిన పలు బృందాలు అంతర్జాతీయ ఆటో షోలకు హాజరవుతుండేవి. అప్పట్లో మేము అంతర్జాతీయ బ్రాండ్ల అత్యాధునిక డిజైన్లు, చూసి ఫొటోలు దిగే వాళ్లం. వాటిని అధ్యయనం చేసే వాళ్లం. కానీ ఈసారి భారత్‌లో జరిగిన ఆటో షోలో జపాన్, కొరియా నుంచి వచ్చిన అతిథులు మన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఫొటోలు తీయడం చూస్తుంటే నేనెంత ఎమోషనల్ అయ్యిందీ మీరు ఊహించుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, వివిధ దేశాల వారు మహీంద్రా కార్లను ఫొటోలు తీసుకుంటున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. దీంతో, అనేక మంది ఆనంద్ మహీంద్రా పోస్టుపై పెద్ద ఎత్తున స్పందించారు.
Viral: ఐన్‌స్టీన్‌ను మించిన ఐక్యూ! యూకేలో సత్తా చాటిన భారత సంతతి బాలుడు
మహీంద్రా సంస్థకు చెందిన బీఈ6, ఎక్స్ఈవీ 9ఈ కార్లు అనేక మందిని ఆకట్టుకుంటున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో, భవిష్యత్తుకు అద్దం పట్టేలా , స్పోర్టీ లుక్స్ ఉన్న డిజైన్లు అనేక మంది ఆకట్టుకున్నాయి. ఇక ఎస్‌యూవీ లుక్స్ ఉన్న ఎక్స్‌ఈవీ 9ఈ పై కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ రెండు మోడల్స్ వివిధ బ్యాటరీ ప్యాక్స్, ఇంజెన్ సామర్థ్యాలున్న వివిధ వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి. బీఈ 6 గరిష్ఠ రేంజ్ 683 కిలోమీటర్లు, ఎక్స్‌జీవీ 9వీ గరిష్ట రేంజ్ 656 కిలోమీటర్లుగా ఉంది. ఈ రెండు మోడల్స్ త్వరలో మార్కెట్లో ఆరంగేట్రం చేయనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్ రవాణా రంగంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. హిరత సాంకేతికతల అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు భారత్ అనుకూలమని వ్యాఖ్యానించారు.