Viral Video Wins Hearts: హీరో అజిత్ తిరుమల పర్యటన.. ఫ్యాన్స్‌కు వార్నింగ్..
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:44 PM
అజిత్ స్వయంగా తన చేతులతో సెల్ఫీ తీశారు. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతుండగా కొంతమంది ఫ్యాన్స్ ‘తల, తల, తల’ అంటూ అరవటం మొదలెట్టారు. దీంతో అజిత్ స్వల్ప ఆగ్రహానికి గురయ్యారు.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలు, రేసింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. వరుసగా గుళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. భార్య షాలిని, కొడుకుతో కలిసి కొన్ని రోజుల క్రితం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న శ్రీ ఊటుకులంగర భగవతి అమ్మన్ గుడికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, మంగళవారం ఆయన ఒక్కడే తిరుమలకు వచ్చారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన ఆయన్ని భక్తులు చుట్టు ముట్టేశారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
అజిత్ ఎంతో ఓపిగ్గా కొంతమందికి సెల్ఫీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ బధిర యువకుడు(వినికిడి లోపంతో పాటు మాటలు రాని యువకుడు) అజిత్‌తో సెల్ఫీ దిగడానికి దగ్గరకు వచ్చాడు. తన సమస్యల గురించి సైగల ద్వారా చెప్పి సెల్ఫీ కావాలని అడిగాడు. అజిత్ స్వయంగా తన చేతులతో సెల్ఫీ తీశారు. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతుండగా కొంతమంది ఫ్యాన్స్ ‘తల, తల, తల’ అంటూ అరవటం మొదలెట్టారు. దీంతో అజిత్ స్వల్ప ఆగ్రహానికి గురయ్యారు. సైగలు చేస్తూ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు.
‘ఇది గుడి.. ఇక్కడ అలా అరవకూడదు’ అన్నట్లు సైగలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అజిత్ సార్ మీరు సూపర్. ఫ్యాన్స్‌కు చాలా బాగా బుద్ధి చెప్పారు’.. ‘స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు కొంచెం కూడా బుద్ధి ఉండదు. ఎక్కడ ఉన్నామన్న స్పృహ లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బిల్ ఎగ్గొట్టి పారిపోయేందుకు ప్రయత్నం.. వాళ్లను ఎలా పట్టుకున్నారంటే..
భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే