Forced To Jump Off Plane: గంటల ఆలస్యం.. విమానంలోనుంచి కిందకు దూకిన ప్రయాణీకులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:00 AM
కాంగోకు చెందిన ఓ విమానం గంటల పాటు డిలే అయింది. అది కూడా ప్రయాణీకులు విమానంలో కూర్చున్న తర్వాత డిలే అయింది. దీంతో నరకం చూసిన ప్రయాణీకులు కొందరు ఊహించని పని చేశారు. విమానంలోనుంచి తలుపు ద్వారా కిందకు దూకేశారు.
ఇండిగో సంక్షోభం దేశీయ విమాన ప్రయాణీకుల్ని ఎంతటి ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. టికెట్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. విమానాలు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరటం వల్ల ప్రయాణీకులు నరకం చూశారు. కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విమానాలు డిలే అవ్వటం అత్యంత తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే, కొన్ని సర్వీసులు ప్రయాణీకులకు నరకం చూపించేలా గంటలు, గంటలు రన్‌వే పైనే ఉండిపోతున్నాయి. తాజాగా, కాంగోకు చెందిన ఓ విమానం గంటల పాటు డిలే అయింది. అది కూడా ప్రయాణీకులు విమానంలో కూర్చున్న తర్వాత డిలే అయింది.
దీంతో నరకం చూసిన ప్రయాణీకులు కొందరు ఊహించని పని చేశారు. విమానంలోనుంచి తలుపు ద్వారా కిందకు దూకేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు చెందిన ఎయిర్ కాంగో విమానం ఒకటి కిందు ఎయిర్‌పోర్టులో ఆగిపోయింది. ప్రయాణీకులు విమానంలోకి ఎక్కిన తర్వాత డిలే మొదలైంది. గంటలు గడిచినా విమానం కదల్లేదు. దీంతో ప్రయాణీకులు అసహనానికి గురయ్యారు. కొంతమంది విమానం మెయిన్ డోర్ నుంచి కిందకు దూకేశారు. దాదాపు 5 నుంచి 6 అడుగుల ఎత్తులోనుంచి తోటి ప్రయాణీకుల సాయంతో బయటకు వచ్చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘విమానం ప్రయాణం అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. పైగా డిలేలతో నరకం చూడాల్సి వస్తోంది’..‘కేవలం ఇండియాలోనే ఇలా ఉంటుందని అనుకున్నా.. వేరే దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్న మాట’.. ‘అది చిన్న విమానంలాం ఉంది. అందుకే కిందకు దూకగలిగారు. పెద్ద విమానం అయితే కాళ్లు, చేతులు విరిగిపోతాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు ఉండిపోయింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
బ్యాంకింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్