Share News

Actor Anuj Sachdeva: ప్రముఖ నటుడిపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టాడు

ABN , Publish Date - Dec 15 , 2025 | 07:59 AM

పెంపుడు కుక్క కారణంగా బాలీవుడ్ నటుడు అనుజ్ సచ్‌దేవ గొడవలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తం వచ్చేలా దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో అనుజ్ గాయాలపాలయ్యాడు.

Actor Anuj Sachdeva: ప్రముఖ నటుడిపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టాడు
Actor Anuj Sachdeva

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుజ్ సచ్‌దేవపై ఓ వ్యక్తి కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తం వచ్చేలా దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో అనుజ్ గాయాలపాలయ్యాడు. నిన్న(ఆదివారం) సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. కుక్క కారణంగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అనుజ్ ముంబై, గోరేగావ్‌లోని ఓ సొసైటీలో ఉంటున్నాడు. అనుజ్ కుక్క ఆ సొసైటీలో ఉంటున్న ఓ వ్యక్తిని కరిచింది. దీంతో గొడవ మొదలైంది. అదికాస్తా చినికి చినికి గాలివానలా మారింది. ఆ వ్యక్తి అనుజ్‌పై దాడి చేసే వరకు వెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించి అనుజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు.


ఆ పోస్టులో దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు ఉన్నాయి. షార్ట్స్, టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి అనుజ్‌ను వెంబడించాడు. ఓ చోట కింద పడ్డ కర్రను తీసుకున్నాడు. ఆ కర్రతో అనుజ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇది గమనించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పరుగున వారి దగ్గరకు వచ్చారు. అనుజ్‌పై దాడి చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నారు. అతడ్ని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లారు. ఆ వ్యక్తి అనుజ్‌పై దాడి చేయటం మాత్రమే కాకుండా దారుణంగా బూతులు కూడా తిట్టాడు. అనుజ్ తలకు బాగా గాయం అయింది. రక్తం కూడా కారసాగింది. ‘ ఆ వ్యక్తి నాకు గానీ, నా ప్రాపర్టీకి గానీ ఎలాంటి డ్యామేజ్ కలిగించేకంటే ముందే ..


నేను ఈ వీడియోను ఓ ఆధారంగా ఇన్‌స్టాలో పోస్టు చేస్తున్నాను. సొసైటీలో పార్కింగ్ విషయంలో అతడు నాపై, నా కుక్కపై దాడి చేయాలని చూస్తున్నాడు. ఇది గోరేగావ్‌లోని హార్మనీ మాల్ రెసిడెన్సీ. అతడు ఏ వింగ్ ప్లాట్ నెంబర్ 602లో ఉంటున్నాడు. అతడిపై చర్యలు తీసుకునే వ్యక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి. నా తల నుంచి రక్తం కారుతూ ఉంది’ అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అనుజ్ ‘ఏ రిస్తా కయా కెహతా హై, సాత్ నిభానా సాథియా, మన్ కే ఆవాజ్ పతిగ్యా’ వంటి సీరియల్స్‌లో నటించాడు. హిందీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఆయనపై దాడి చేయటాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.


ఇవి కూడా చదవండి

నేను ఫామ్ కోల్పోలేదు: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

నేడు 11వ రోజు పార్లమెంట్‌ సమావేశాలు

Updated Date - Dec 15 , 2025 | 12:27 PM