Share News

Fish stealing video: దొంగతనంలో ఇదొక కొత్త ట్రిక్.. చేపను ఎలా దొంగిలించాడో చూడండి..

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:20 PM

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి.

Fish stealing video: దొంగతనంలో ఇదొక కొత్త ట్రిక్.. చేపను ఎలా దొంగిలించాడో చూడండి..
smart theft

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని చేపను దొంగతనం చేసిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (Clever man steals fish).


lovesutta అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చేపల దుకాణం కనబడుతోంది. వివిధ రకాల చేపలను వేర్వేరు పెట్టెల్లో ఉంచారు. అక్కడకు ఒక చేయి లేని వ్యక్తి వచ్చాడు. అతను ఒక చేపను తీసుకొని వాసన చూసి దానిని తిరిగి అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు. అయితే అతడు నిజంగా చేయి లేని వ్యక్తి కాదు. ఒక చేయిని షర్ట్ లోపల దాచుకుని వచ్చాడు. షర్ట్ లోపల ఉన్న చేతితో చేపను తీసుకుని లోపల దాచుకుని వెళ్లిపోయాడు (Fish stealing video).


ఈ వీడియో సోషల్ మీడియా కోసమే తీసిన ఫన్నీ వీడియోలా కనిపిస్తోంది (unbelievable trick). ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు ఏడు లక్షల మంది వీక్షించారు. దాదాపు 55 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ ఫన్నీ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ఈ దొంగ చాలా ప్రతిభావంతుడని ఒకరు కామెంట్ చేశారు. ఈ ట్రిక్ తాను కూడా ఉపయోగిస్తానని ఒకరు సరదాగా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 08 , 2025 | 07:20 PM