Viral Video: పాపం.. రూ.500 కోసం ఐదు వేలు పోగొట్టుకున్నాడు.. మోసగాడికి తగిన రీతిలో గుణపాఠం..
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:20 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో తమను మోసం (Cheating) చేయబోయిన ఓ వ్యక్తికి పెట్రోల్ బంక్ (Petrol Bunk) సిబ్భంది తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).
@VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గరకు కారులో వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నాడు. పెట్రోల్ బంక్‌కు చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ కొడుతుండగా, మరో వ్యక్తి డబ్బులు అడుగుతున్నాడు. అయితే పెట్రోల్ కొట్టడం పూర్తయిన తర్వాత ఆ కారు నడిపే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వ్యక్తి వెంటనే పెద్ద కర్ర తీసుకుని కారు వెనుక అద్దం పగలగొట్టేశాడు. రూ.500 ఎగ్గొట్టాలనుకున్న ఆ కారు డ్రైవర్ ఏకంగా రూ.5 వేల విలువైన అద్దాన్ని కోల్పోయాడు.
ఈ ఘటన మొత్తం పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.4 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.7 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``మంచి గుణపాఠం చెప్పావు బ్రదర్``, ``అతడి రియాక్షన్ చాలా ఫాస్ట్‌గా ఉంది``, ``కర్మ వెంటనే వెంటాడింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Pakistan: సింహంతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. టిక్‌టాక్ వీడియో కోసం బోనులోకి వెళితే..
Viral Video: ఇదెక్కడి వింత.. ఈ పంపు నీటినే కాదు.. నిప్పును కూడా వదులుతోంది.. కారణమేంటి?
Viral Video: వామ్మో.. ఈ కుక్క చాలా డేంజర్.. తన ఢీకొన్న కారుపై ఎలా పగ తీర్చుకుంటోందో చూడండి..
Penguin Love Life: పెంగ్విన్‌లలో కూడా ప్రేమ, మోసం, విడాకులు.. వెలుగులోకి ఆశ్చర్యకర నిజాలు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి