Viral Video: పిచ్చికి కూడా ఓ హద్దుండాలి భయ్యా.. రీల్ కోసం ఓ జంట ఎలాంటి పిచ్చి పని చేసిందో చూడండి..
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:58 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చూసే వారిని ఆకట్టుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చూసే వారిని ఆకట్టుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు శృతిమించి మరీ విన్యాసాలు (weird stunt) చేసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@OGitala అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు నదిలో నుంచి గట్టు పైకి ఓ వస్త్రాన్ని పట్టుకుని ఎక్కుతున్నాడు. ఎత్తుగా ఉన్న గట్టు పైన ఓ యువతి నిలబడి ఆ వస్త్రాన్ని పట్టుకుంది. ఆ అబ్బాయి పైకి రాగానే, అప్పటివరకు వస్త్రం పట్టుకుని నిలబడి ఉన్న అమ్మాయి అతన్ని కాలితో తన్నింది. దీంతో అతడు మళ్లీ నదిలో పడిపోయాడు. బ్యాగ్రౌండ్‌లో ఓ పాట ప్లే అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఇది పిచ్చికి పరాకాష్ట అని ఒకరు కామెంట్ చేశారు. ఆ రీల్ వెనుకున్న అర్థమేమిటో తనకు అర్థం కావడం లేదని మరొకరు కామెంట్ చేశారు. పాపులర్ కావడం కోసం కొందరు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..