Share News

72 Year Old Marries 27 Year Old: 72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి పెళ్లి.. ఇండియాకు వచ్చి మరీ..

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:34 AM

రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్‌పూర్, జోథ్‌పూర్‌లలో పర్యటించారు. వారికి జోథ్‌పూర్ బాగా నచ్చింది. తాజాగా, అక్కడి మెహ్‌రంగ్‌ఘర్ పోర్టులో హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

72 Year Old Marries 27 Year Old: 72 ఏళ్ల వృద్ధుడితో 27 ఏళ్ల యువతి పెళ్లి.. ఇండియాకు వచ్చి మరీ..
72 Year Old Marries 27 Year Old

ప్రేమ గుడ్డిదని అంటారు. కొన్ని నిజ జీవిత ప్రేమ కథల గురించి విన్నపుడు అది నిజమే అనిపిస్తుంది. వయసు భేదంతో ఆడ,మగ పెళ్లి చేసుకోవటం పెద్ద వింతేమీ కాదు. వృద్ధులను పెళ్లి చేసుకున్న యువతులు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మాత్రం ఇందుకు భిన్నమైంది. ఓ యువతి తన కంటే 40 ఏళ్లు పెద్దవాడైన వృద్ధుడ్ని ప్రేమించింది. దాదాపు మూడేళ్ల పాటు అతడితో సహజీవనం చేసింది. తాజాగా, పెళ్లి బంధంతో ప్రియుడితో కొత్త జీవితాన్ని మొదలెట్టింది.


ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ జంట ఇండియాకు వచ్చి.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన 72 ఏళ్ల స్టానిస్టేవ్, 27 ఏళ్ల అన్‌హెలినాలకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక, అప్పటినుంచి ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే, కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తమ సంప్రదాయం ప్రకారం కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని భావించారు.


తాజాగా, ఇండియాకు వచ్చారు. రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్‌పూర్, జోథ్‌పూర్‌లలో పర్యటించారు. వారికి జోథ్‌పూర్ బాగా నచ్చింది. తాజాగా, అక్కడి మెహ్‌రంగ్‌ఘర్ పోర్టులో హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ..‘ఆ యువతి 72 ఏళ్ల వృద్ధుడ్ని పెళ్లి చేసుకుందా?.. డబ్బు కోసమే చేసుకుని ఉంటుంది. ప్రేమా.. గీమా ఏమీ ఉండదు’..‘భారతీయ దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్నారు. జంటకు శుభాకాంక్షలు’.‘ఆయనకు 72 ఏళ్లు అంటే నమ్మలేకుండా ఉన్నా. చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలు ఎలా చెప్పగలం

శ్రీకాకుళంలో హైస్కూల్‌ను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి

Updated Date - Sep 20 , 2025 | 07:37 AM