Share News

Father of Ayesha: నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలు ఎలా చెప్పగలం

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:02 AM

మా కుమార్తె హత్య కేసు దర్యాప్తును పూర్తిచేసినట్లు సీబీఐ చెబుతున్నా ఆ నివేదిక మా చేతికి ఇవ్వలేదు. అసలు దర్యాప్తు నివేదికలో ఏముందో తెలియకుండా...

Father of Ayesha: నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలు ఎలా చెప్పగలం

  • సీబీఐ కోర్టులో ఆయేషా తండ్రి పిటిషన్‌

విజయవాడ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘మా కుమార్తె హత్య కేసు దర్యాప్తును పూర్తిచేసినట్లు సీబీఐ చెబుతున్నా ఆ నివేదిక మా చేతికి ఇవ్వలేదు. అసలు దర్యాప్తు నివేదికలో ఏముందో తెలియకుండా అభ్యంతరాలను ఎలా చెప్పగలం’ అంటూ బీఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా తండ్రి ఇక్బాల్‌ బాషా విజయవాడ సీబీఐ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సత్యంబాబుపై నమోదైన ఐపీ సీ 376, 302 సెక్షన్లలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వయంగా కోర్టుకు వచ్చి చెప్పాలని సీబీఐ కోర్టు ఆమె తల్లిదండ్రులకు కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను వారు తిరస్కరించారు. శుక్రవారం ఇక్బాల్‌బాషా తరఫున న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Sep 20 , 2025 | 07:03 AM