NTR Municipal High School: శ్రీకాకుళంలో హైస్కూల్‌ను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:56 AM
శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు శుక్రవారం పరిశీలించారు.
అభినందనలు తెలిపిన మంత్రి లోకేశ్
శ్రీకాకుళం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు శుక్రవారం పరిశీలించారు. చాలా సమయం పాఠశాలలో గడిపిన ఆయన స్పందిస్తూ... ‘నేను ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను దత్తత తీసుకుంటున్నా. హైస్కూల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా’ అని ప్రకటించారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందించారు. హైస్కూల్‌ను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకు అభినందనలు తెలిపారు. ఇదే రీతిన వివిధ వర్గాలు పాఠశాలల అభివృద్ధికి చేయూతనందించాలని కోరారు. అందరం కలసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఆదర్శంగా నిలుపుదామంటూ లోకేశ్ పిలుపునిచ్చారు.