Share News

Stainless steel utensils: స్టెయిన్‌లెన్ స్టీల్ సామాన్లు కొనేవారు తెలియకచేసే పొరపాట్లు ఇవే

ABN , Publish Date - Feb 22 , 2025 | 10:06 PM

స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.

Stainless steel utensils: స్టెయిన్‌లెన్ స్టీల్ సామాన్లు కొనేవారు తెలియకచేసే పొరపాట్లు ఇవే

ఇంటర్న్‌ట్ డెస్క్: స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు లేని భారతీయ వంటగది ఉండనే ఉండదు. స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే స్టీల్‌తో చేసే ఓ మిశ్రమ లోహం. సాధారణ స్టీల్ లేదా ఇనుము లాగా దీనికి మరకలు అంత సులభంగా అంటుకోవు. తుప్పు కూడా పట్టదు. చాలా కాలం మన్నికగా ఉంటుంది. ఇందులోని లోహం ఆహారంతో ఎలాంటి రసాయనిక ప్రక్రియకూ లోను కాదు. అయితే, స్టెయిన్‌లెస్ స్టీల్స్ రకాలు చూడటానికి దాదాపు ఒకేలా ఉన్నా కొన్ని కీలక మార్పులు ఉంటాయి. కాబట్టి, ఈ గిన్నెలను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచి నాణ్యత కలిగిన గిన్నెలను 18/8 లేదా 18/8 రకం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టకుండా చాలా కాలం మన్నికగా ఉంటుంది. ఇంతకంటే తక్కువ రకం స్టీల్ గిన్నెలు కొంటే త్వరగా పాడవుతాయి. తుప్పు పట్టిపోతాయి. కాబట్టి స్టీల్ గిన్నెల అడుగు భాగంలో కనిపించే ముద్రను చూసి స్టీల్ ఏరకానిదో తెలుసుకుని అప్పుడు కొనుగోలు చేయాలి.


City Killer Asteroid: భారీ గ్రహశకలంతో ముంబై, కోల్‌కతాకు ముప్పు ఉందా? నాసా ఏం చెప్పిందంటే..

కొన్ని రకాల పాత్రల్లో ఆహారాలు త్వరగా ఉడకవు. రొట్టెలు లాంటివి పాత్రకు అంటుకుపోతాయి. పెనం అడుగు భాగంలో వేడి అంతటా ఒకేలా వ్యాపించకపోవడమే ఇందుకు కారణం. ప్లేయిన్ స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వేడి అన్నివైపులా సరిగా వ్యాపింపచేయలేవు. కాబట్టి అల్యూమినియం లేదా కాపర్ అడుగుభాగంగా ఉన్న స్టీల్ పాత్రల్ని కొంటే మంచిది.

బరువు తక్కువగా ఉన్న పాత్రల్ని కొంటే వేడి కారణంగా అవి వంగిపోతాయి. ఒక్కోసారి సొట్టలు పడతాయి. కాబట్టి, కాస్త బరువుగా ఉన్న గిన్నెలు కొంటే వాటిలో వేడి అడుగుభాగంలో సమానంగా వ్యాపిస్తోంది. అందులో ఒండిన ఆహారాలు చక్కగా ఉడుకుతాయి. అడుగంటిపోవు.


Viral: విడాకుల తీసుకున్న వెంటనే తోడు కోసం మహిళ ప్రయత్నం! జీవితం తలకిందులు

స్టీల్ గిన్నెలకు ఉన్న హ్యాండిల్స్ మూతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. హ్యాండిల్స్ సన్నగా లేదా చిన్నగా ఉంటే వేడి గిన్నెను ఎత్తే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి, గట్టి, మందపాంటి హ్యాండిల్స్ ఉన్నవి ఎంచుకోవాలి. మూతులు సులువుగా తెరవగలిగేలా ఉండాలి. అదే సమయంలో వేడి, సువాసనలు బయటకు పోకుండా గిన్నెపై చక్కగా పట్టేలా ఉన్నవి ఎంచుకోవాలి.

స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులు తక్కువ ధరకు వస్తు్న్నాయని కొనేస్తే చివరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడే కొద్ద ఖర్చులు తడిసిమోపెడవుతాయి. కాబట్టి, కాస్త ధర ఎక్కువైనా మంచివి కొనుక్కుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

Read Latest and Viral News

Updated Date - Feb 22 , 2025 | 10:42 PM