4 Lions vs Crocodile: షాకింగ్ వీడియో.. నీటి నుంచి బయటకు వచ్చిన మొసలిని సింహాలు ఏం చేశాయో చూడండి..
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:42 PM
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలికి చిక్కిన ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అందుకే నీటిలో ఉన్న మొసలి జోలికి ఎంత పెద్ద క్రూర జంతువైనా వెళ్లదు. అదే మొసలి నీటి నుంచి బయటకు వస్తే మాత్రం దాని బలం ఆవిరైపోతుంది.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలికి చిక్కిన ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అందుకే నీటిలో ఉన్న మొసలి (Crocodile) జోలికి ఎంత పెద్ద క్రూర జంతువైనా వెళ్లదు. అదే మొసలి నీటి నుంచి బయటకు వస్తే మాత్రం దాని బలం ఆవిరైపోతుంది. తాజాగా ఓ జంగిల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మొసలిని నాలుగు సింహాలు చీల్చి చెండాడాయి (Lions attack crocodile).
దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. @Latest Sightings అనే యూటూబ్ ఛానెల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మొసలి ఏదో కారణం చేత భూమిపై ఉన్న నీటి నుండి బయటకు వచ్చింది. ఒక సింహం ఆ మొసలిని గమనించి దానిపై దాడికి దిగింది. ఆ సింహం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మొసలి ఎదురుదాడికి దిగింది. ఆ సమయంలో మరో మూడు సింహాలు అక్కడికి వచ్చి ఆ మొసలిని చుట్టుముట్టాయి. దీంతో ఆ మొసలి నిస్సహాయంగా మారిపోయింది (wild animal fight).
ఆ నాలుగు సింహాలను ఎదుర్కొనే సత్తా ఆ మొసలికి లేకపోయింది (animal kingdom fight). చివరకు ఆ సింహాలు ఆ మొసలిని గాయపరిచి చంపేశాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను 28 లక్షల మందికి పైగా వీక్షించారు. 9.6 వేల మంది లైక్ చేశారు. మొసలి నీటి నుంచి బయటకు రాకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..