Share News

2 Remand Prisoners Escape: సీసీటీవీల్లో భయానక దృశ్యాలు.. జైలు వార్డర్‌పై సుత్తితో దాడి చేసి..

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:43 AM

ఇదే అదునుగా భావించిన రవికుమార్ ఎస్కేప్‌కు ప్లాన్ చేశాడు. వంట పనిలో సాయం చేస్తున్నట్లు నటిస్తూ అక్కడ ఉన్న సుత్తెను తీసుకున్నాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

2 Remand Prisoners Escape: సీసీటీవీల్లో భయానక దృశ్యాలు.. జైలు వార్డర్‌పై సుత్తితో దాడి చేసి..
2 Remand Prisoners Escape

సబ్ జైలులో ఓ రిమాండ్ ఖైదీ దారుణానికి ఒడిగట్టాడు. జైలు వార్డర్‌పై సుత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. మరో రిమాండ్ ఖైదీతో కలిసి జైలు నుంచి పారిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనాకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి చెందిన నక్కా రవికుమార్ టోకూరు పంచాయతీ కార్యదర్శిగా పని చేశాడు. పింఛన్ల సొమ్మును మాయం చేసిన కేసులో అనంతగిరి పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం చోడవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.


మాడుగులకు చెందిన బెజవాడ రాము వివిధ చోరీ కేసుల్లో నిందితుడు. అతడు కూడా రిమాండ్ ఖైదీగా ఇదే జైల్లో ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం వంట పనుల్లో సాయం చేసేందుకు వీరిద్దరినీ సెల్‌ నుంచి బయటకు వదిలారు. ఇదే అదునుగా భావించిన రవికుమార్ ఎస్కేప్‌కు ప్లాన్ చేశాడు. వంట పనిలో సాయం చేస్తున్నట్లు నటిస్తూ అక్కడ ఉన్న సుత్తెను తీసుకున్నాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. డ్యూటీలో ఉన్న జైలు వార్డర్‌ వీర్రాజుపై దాడికి దిగాడు. సుత్తెతో పలుమార్లు విచక్షణా రహితంగా వార్డర్‌పై దాడి చేశాడు.


వీర్రాజు ఎదురు తిరిగి అతడ్ని పట్టేసుకున్నాడు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు తోపులాట జరిగింది. రవికుమార్ సుత్తెతో బలంగా కొట్టి వీర్రాజును కిందపడేశాడు. ఇదే సమయంలో వీర్రాజు దగ్గరినుంచి రాము జైలు గేటు తాళాలు లాక్కున్నాడు. వెంటనే గేటు దగ్గరకు పరిగెత్తి తాళం తెరిచాడు. తర్వాత రిమాండ్ ఖైదీలు ఇద్దరూ అక్కడినుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవికుమార్ వార్డర్ వీర్రాజుపై సుత్తెతో దాడి చేస్తున్న భయానక దృశ్యాలు అందులో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

మళ్లీ.. నేల చూపులు.. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన టమోటా ధరలు

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం

Updated Date - Sep 06 , 2025 | 12:05 PM