Breaking News: మరికాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
ABN , First Publish Date - Apr 21 , 2025 | 08:08 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-04-21T16:55:01+05:30
మరికాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్ష సూచన
ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్,..
సిద్దిపేట, మెదక్, ఆసిఫాబాద్ జిల్లాలకు వర్ష సూచన
-
2025-04-21T15:34:57+05:30
పోప్ ప్రాన్సిస్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు..
-
2025-04-21T15:34:00+05:30
పోప్ మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్..
-
2025-04-21T15:24:42+05:30
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం.
మావోయిస్టులు అమర్చిన IED బాంబు పేలి జవాన్ మృతి.
మృతుడు CAF జవాన్ మనోజ్ పూజారి(26)గా గుర్తింపు.
టోయ్నార్-ఫర్సేగఢ్ ప్రధాన రహదారిపై ఘటన.
-
2025-04-21T14:56:18+05:30
పోప్ మృతికి ప్రధాని మోదీ సంతాపం..
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మరణ వార్త తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు ప్రధాని. ‘ఈ దుఃఖ సమయంలో ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ ఆయన ప్రభువైన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన పేదలు, అణగారిన వారికి సేవ చేశారు. ఆయనను కలిసిన క్షణం ఎప్పటికీ నా హృదయంలో ఉంటుంది. సమగ్ర అభివృద్ధికి ఆయన నిబద్ధతను చూసి ఎంతో ప్రేరణ పొందాను. భారత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మ దేవుని కౌగిలిలో శాశ్వత శాంతిని పొందుగాక.’ అంటూ ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
-
2025-04-21T13:33:59+05:30
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీలో కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్
-
2025-04-21T13:33:06+05:30
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు
అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంఝీ, వివేక్ మృతి
మృతిచెందిన ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్‌పై రూ. కోటి రివార్డు
ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం
బొకారో జిల్లా లాల్‌పానియా దగ్గర ఎన్‌కౌంటర్
-
2025-04-21T13:31:21+05:30
మాజీ డీజీపీ హత్య.. సంచలన విషయాలు..
కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ మృతదేహాంకు పోస్టుమార్టం
ఓంప్రకాశ్‌ను భార్య పల్లవి హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ
ఓంప్రకాశ్ ఒంటిపై పది చోట్ల కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తింపు
మొహంపై కారం, వేడి నూనె మీద పోసిన భార్య పల్లవి
తర్వాత కత్తితో 10 సార్లు పొడిచి చంపిన భార్య పల్లవి
హత్యలో కుమార్తె ప్రమేయం లేదని తేల్చిన పోలీసులు
కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ఉన్నట్టు గుర్తింపు
-
2025-04-21T13:30:03+05:30
సుప్రీంకోర్టు ఆగ్రహం..
పూజాఖేద్కర్ కేసు విచారణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మే 2లోగా ఢిల్లీ పోలీసుల ఎదుట పూజాఖేద్కర్ హాజరుకావాలన్న ధర్మాసనం
పూజాఖేద్కర్ కేసులో విచారణ సరిగ్గా జరగట్లేదని కోర్టు అసహనం
విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
తప్పుడు సర్టిఫికెట్లతో IASకు ఎంపికైన పూజాఖేద్కర్
IAS శిక్షణలోనే పూజాఖేద్కర్‌ను తొలగించిన UPPSC
-
2025-04-21T13:27:57+05:30
చెక్‌డ్యామ్‌లోకి దూకిన తల్లి, పిల్లలు..
మెదక్: ఇద్దరు పిల్లలు సహా చెక్‌డ్యామ్‌లోకి దూకిన తల్లి
మెదక్: తూప్రాన్ మండలం నాగులపల్లిలో ఘటన
తల్లిని కాపాడిన స్థానికులు, ఇద్దరు పిల్లలు గల్లంతు
పిల్లల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు
-
2025-04-21T13:26:42+05:30
నాంపల్లి కోర్టుకు కేంద్రమంత్రి
హైదరాబాద్: నాంపల్లి కోర్టుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బెదిరింపు కాల్స్
బెదిరింపు కాల్స్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసిన కిషన్ రెడ్డి
నాంపల్లి కోర్టులో విట్నెస్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన న్యాయస్థానం
-
2025-04-21T13:23:31+05:30
అక్షరధామ్ ఆలయానికి యూఎస్ వైస్ ప్రెసిడెంట్..
అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్
కుటుంబసమేతంగా అక్షరధామ్ ఆలయాన్ని దర్శించిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్
-
2025-04-21T12:46:26+05:30
ఇప్పటి నిర్ణయాలే వెయ్యేళ్ల భవిష్యత్తుకు నాంది: ప్రధాని మోదీ..
ఢిల్లీ: సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, విధానాలే రాబోయే వెయ్యి సంవత్సరాల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి: మోదీ
యువత, రైతులు, మహిళల కలలు నిజమవుతున్నాయి: మోదీ
కలలు నెరవేర్చడానికి అసాధారణ వేగం అవసరం: మోదీ
పథకాల అమలుతోనే పాలనలో నాణ్యత తెలుస్తుంది: మోదీ
పదేళ్లలో దేశం ఎంతో మార్పు చెందింది: మోదీ
-
2025-04-21T10:29:24+05:30
దారుణ హత్య.. కత్తులతో వెంటపడి మరీ..
జనగామ: కొడకండ్ల మండలం రేగులతండాలో దారుణ హత్య
గుగులోతు శ్రీనును కత్తితో పొడిచి చంపిన గుర్తుతెలియని దుండగులు
గ్రామానికి చెందిన వ్యక్తే హత్య చేశాడని కుటుంబసభ్యుల ఆరోపణ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
2025-04-21T09:56:01+05:30
భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు..
భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు
అమెరికా ఉపాధ్యక్షుడిగా తొలిసారి భారత్‌కు జేడీ వాన్స్
పాలం ఎయిర్‌పోర్టులో జేడీవాన్స్‌కు స్వాగతం పలికిన అధికారులు
దేశంలోని చారిత్రక ప్రదేశాలు సందర్శించనున్న జేడీవాన్స్
సాయంత్రం 6:30కి ప్రధాని మోదీతో జేడీవాన్స్ సమావేశం
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో చర్చ
-
2025-04-21T09:54:33+05:30
విశాఖ శారదాపీఠానికి నోటీసులు..
తిరుమల: విశాఖ శారదాపీఠం అప్పగింతపై TTD నోటీస్
గోగర్భం డ్యామ్ సమీపంలో శారదాపీఠం భవన నిర్మాణం
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు గుర్తించిన TTD
మఠం నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చిన కోర్టు
15 రోజుల్లోగా మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని నోటీస్
-
2025-04-21T08:54:12+05:30
ఘోర అగ్నిప్రమాదం
పల్నాడు: చిలకలూరిపేట సుభాని నగర్‌లో అగ్ని ప్రమాదం
ప్లాస్టిక్ సామాన్లు విక్రయించే దుకాణంలో చెలరేగిన మంటలు
దుకాణంలో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
-
2025-04-21T08:08:08+05:30
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
రెండు కార్లు ఢీ, ముగ్గురు అక్కడికక్కడే మృతి
మరో ఆరుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు ఆలీ(45), అజీం బేగం(40), ఏడాది బాబు గౌస్
కౌడిపల్లి మం. వెంకట్రావుపేట గేట్ దగ్గర ఘటన