Breaking News: 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. అతనిపై కేంద్రం సీరియస్..
ABN , First Publish Date - May 21 , 2025 | 07:40 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 21, 2025 20:33 IST
భారత్ హైకమిషన్‌లోని పాక్ ఉద్యోగిపై కేంద్రం ఆగ్రహం
24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణ
-
May 21, 2025 17:36 IST
మావోల ఎన్‌కౌంటర్‌పై ప్రధాని రియాక్షన్..
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్‌లో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేశారు.
మావోయిస్టులను నిర్మూలించిన భద్రతా దళాలకు ప్రధాని మోదీ ప్రశంసలు తెలిపారు.
అద్భుతమైన విజయానికి కారణమైన దళాలను చూసి గర్విస్తున్నామన్నారు.
మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ.
-
May 21, 2025 16:11 IST
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్రహోంమంత్రి అమిత్ షా ట్వీట్
ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్‌షా ట్వీట్.
మావోలపై మూడు దశాబ్దాల పోరాటంలో.. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమం.
ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల మృతి.
2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతమొందిస్తాం.
-
May 21, 2025 10:57 IST
భారీ ఎన్‌కౌంటర్..
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
ఎన్‌కౌంటర్‌లో 25 మంది మావోయిస్టులు మృతి
ఆపరేషన్‌లో పాల్గొన్న బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు
మరికొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు అనుమానం
-
May 21, 2025 10:42 IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
20 మంది మావోయిస్టులు మృతి
నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
ఆపరేషన్‌లో పాల్గొన్న బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ DRG బలగాలు
-
May 21, 2025 10:08 IST
స్టాలిన్ సర్కార్ ఫిర్యాదు..
కేంద్రంపై సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్ ఫిర్యాదు
జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయకపోవడంతోనే కేంద్రం తమ నిధులని నిలిపివేసిందని సీఎం స్టాలిన్ ఆరోపణ
తీమ హక్కును కేంద్రం హరించడం రాజ్యాంగ విరుద్ధమంటూ తమిళనాడు ప్రభుత్వం విమర్శ
-
May 21, 2025 10:08 IST
విచారణకు హాజరవుతా: ఈటల రాజేందర్
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా: ఈటల రాజేందర్
ఇప్పటివరకు నాకు నోటీసులు అందలేదు: ABNతో ఎంపీ ఈటల
నోటీసులు అందిన తర్వాత తప్పకుండా పార్టీలో చర్చించి మా అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తా: ఈటల
రేవంత్‌రెడ్డి నువ్వు ఎలాంటి విచారణ అయినా చెయ్యి: ఈటల
ఆనాడు దేవరాయాంజాల్ భూముల అంశంలో కేసీఆర్ చేసిన తప్పే ఇవాళ నువ్వు చేస్తున్నావు: ఈటల రాజేందర్
నువ్వు మమ్మల్ని బెదిరిస్తే భయపడం: ఎంపీ ఈటల
కేంద్రంలో మేమే ఉన్నాం: ABNతో ఎంపీ ఈటల
నీ చిట్టా అంత మా చేతిలో ఉంది: ఎంపీ ఈటల
నీ దిక్కుమాలిన చిల్లర గాళ్లతో మాట్లాడిస్తే నేను వెనక్కితగ్గను: ఈటల
-
May 21, 2025 10:08 IST
ప్రధాని పర్యటన.. ఏర్పాట్లు షురూ..
విశాఖ: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తు
అధికారులతో కలిసి బీచ్ రోడ్డును పరిశీలించిన హోం మంత్రి అనిత
జూన్ 21న ప్రధాని విశాఖ పర్యటనతో భద్రతా ఏర్పాట్లపై..
అధికారులకు సూచనలు చేసిన హోం మంత్రి అనిత
యోగ డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో..
తీసుకోవాల్సి జాగ్రత్తలు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన
ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనిత ఆదేశం
-
May 21, 2025 09:03 IST
రాజీవ్ గాంధీకి నివాళి..
ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి
వీర్‌భూమి దగ్గర నివాళులర్పించిన ఖర్గే, రాహుల్‌గాంధీ
-
May 21, 2025 09:03 IST
మరో ప్రమాదం..
యాదాద్రి: చౌటుప్పల్ దగ్గర బొర్రెలగూడెంలో ప్రమాదం
ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ
ప్రమాదానికి గురైన లారీని ఢీకొన్న మరో ట్రావెల్స్ బస్సు
పలువురు ప్రయాణికులకు గాయాలు
-
May 21, 2025 09:01 IST
అణు కేంద్రాలపై దాడి..?
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళిక: అమెరికా
ఇజ్రాయెల్ ప్రణాళికలను పసిగట్టిన అమెరికా ఇంటెలిజెన్స్
ఇరాన్ దాడుల అంశంపై స్పష్టత ఇవ్వని ఇజ్రాయెల్, అమెరికా
ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నం
ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నాలు
ఇటీవల ఒమన్‌లో ఇరాన్-అమెరికా ఉన్నతస్థాయి చర్చలు
న్యూక్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరిక
-
May 21, 2025 08:01 IST
ABN ఆంధ్రజ్యోతి విజయోత్సవ సభ..
నేడు నెల్లూరు రూరల్ సౌత్ మోపూరులో ABN ఆంధ్రజ్యోతి విజయోత్సవ సభ
"అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా..." కార్యక్రమానికి భారీ స్పందన
సౌత్ మోపూరులో సమస్యలని వెలుగులోకి తెచ్చిన ABN ఆంధ్రజ్యోతి
స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
రూ.1.22కోట్లతో అభివృద్ది పనులు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
హాజరుకానున్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య, ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
May 21, 2025 07:59 IST
విశాఖకు షర్మిల..
విశాఖ: నేడు విశాఖకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రాక
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న ఏపీ పిసిసి చీఫ్
కొన్ని రోజుల క్రితమే విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి షర్మిల అల్టిమేటం
మే 20 లోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
లేకుంటే మే 21 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ముందే హెచ్చరించిన ఏపీ పిసిసి చీఫ్
-
May 21, 2025 07:40 IST
ఘోర ప్రమాదం..
రంగారెడ్డి: హయత్‌నగర్ దగ్గర కుంట్లూరులో రోడ్డు ప్రమాదం
ఆగిఉన్న డీసీఎంను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
రంగారెడ్డి: మరో ఇద్దరి పరిస్థితి విషమం
-
May 21, 2025 07:40 IST
విజయవాడ: APPSC అవకతవకల కేసు
PSRను కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
నేటితో రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
ధాత్రి మధు బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం
-
May 21, 2025 07:40 IST
సిట్ కస్టడీ పిటిషన్‌పై విచారణ
నేడు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ కస్టడీ పిటిషన్‌పై విచారణ
వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ నిన్న సిట్ పిటిషన్
నేడు విజయవాడ ACB కోర్టులో విచారణ