Breaking News: జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి రామానాయుడు
ABN , First Publish Date - May 20 , 2025 | 09:40 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 20, 2025 21:53 IST
జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి రామానాయుడు
మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్.
మంగళవారం నాడు జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
జగన్ మరోసారి గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒంటిపై గోచి కూడా ఉండేది కాదు.
రాజకీయాల ముసుగులో నేరస్తుడైన జగన్‌కు నా పేరు ఎత్తే అర్హత లేదు.
నాకు జగన్‌కి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.
తన తండ్రి పేరు అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల అక్రమార్జన చేసి, 11 ఛార్జ్ షీట్లలో నిందితుడై 16 నెలల జైలు శిక్ష అనుభవించాడు.
నేను నా తండ్రి పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాను.
జగన్ అధికారంలోకి వచ్చాక సొంత మాఫియా పెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేశారు.
నీ అవినీతి పాపానికి మీ ఓఎస్‌డి, ధనుంజయ రెడ్డి ఇవాళ జైల్లో ఉన్నారు.
జేపీ వెంచర్స్ పేరిట సంవత్సరానికి ఇసుకలో నాలుగు వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల పాటు అడ్డంగా దోచుకున్నాడు.
జగన్ అవినీతికి రాష్ట్రం నుంచి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీ కూడా పారిపోయింది.
-
May 20, 2025 21:03 IST
ఐఏఎస్‌లకు సీఎస్ సీరియస్ వార్నింగ్..
సభలు, సమావేశాల్లో కొందరు ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్న తీరు, వారి ప్రవర్తనపై సీఎస్ రామకృష్ణా రావు సీరియస్.
ఐఏఎస్ అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసిన సీఎస్.
ఇటీవల ఓ సమావేశంలో ఐఏఎస్ అధికారి శరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన నేపథ్యంలో కీలక సూచనలతో ఉత్తర్వులు ఇచ్చిన సీఎస్.
ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల అనుచిత ప్రవర్తన వల్ల ఐఏఎస్‌ల ప్రతిష్టకు దెబ్బతీస్తుంది.
ఐఏఎస్‌ల పట్ల ప్రజల విశ్వాసం తగ్గుతుంది.
ఐఏఎస్ 1968లోని 3(1) నియమావళి ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలి.
సర్వీస్ హోదాకు తగనిది ఏది చేయొద్దు.
నిబంధనలు ఉల్లంఘించే ఐఏఎస్ లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన సీఎస్.
-
May 20, 2025 16:31 IST
మహా నగరంలో మాయ లేడీలు..
వృద్దులకు పెళ్లి చెస్తామంటూ మోసం చెస్తున్న ఇద్దరు కిలేడీలు.
సంపన్నులు, రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న ఇద్దరు మహిళలు.
మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలు ఇచ్చి.. వృద్దులను టార్గెట్ చెస్తున్న మహిళలు.
ఓ వృద్దుడికి రేపే పెళ్ళి నిశ్చయం.
పెళ్లి షాపింగ్ పేరుతో రెండు లక్షలు కాజేసిన మహిళలు.
పెళ్లి బట్టలు వేసుకుని.. పెళ్లి కోసం సిద్ధంగా ఉన్న వృద్ధుడు.
సమయనికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు.
మహాంకాళి పోలీసులకు ఫిర్యాదు.
కేసు నమోదు.. పరారీలో ఇద్దరు మహిళలు.
-
May 20, 2025 15:33 IST
చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం.
రెండో అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు.
అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందించిన స్థానికులు.
రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.
ఇంట్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన స్థానికులు.
షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం.
-
May 20, 2025 13:31 IST
జీవన్‌రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్..
జగిత్యాల: జీవన్‌రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శలు
జీవన్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే సంజయ్
గతంలో బీజేపీ ఎంపీకి ఓటు వేయాలని జీవన్‌రెడ్డి చెప్పలేదా?: ఎమ్మెల్యే సంజయ్
కాంగ్రెస్‌లో అత్యధికంగా ఓటమిపాలైంది జీవన్‌రెడ్డే: ఎమ్మెల్యే సంజయ్
-
May 20, 2025 13:30 IST
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు
జూన్ 5న కేసీఆర్, 6న హరీష్‌రావు, 9న ఈటలను విచారణకు హాజరుకావాలని ఆదేశం
BRS హయాంలో నీటిపారుదల మంత్రిగా ఉన్న హరీష్‌రావు
BRS హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల
నిన్న కాళేశ్వరం కమిషన్ గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
-
May 20, 2025 12:24 IST
హైడ్రా డ్రైవర్ ఉద్యోగాలు..
హైదరాబాద్: రెండో రోజు హైడ్రా డ్రైవర్ ఉద్యోగాలకు భారీగా యువత
హైడ్రా పార్కింగ్ కార్యాలయం దగ్గర బారులు తీరిన నిరుద్యోగులు
కానిస్టేబుల్ పరీక్షల్లో స్వల్ప మార్కులతో దూరమైనవారికి ప్రాధాన్యత
అవుట్ సోర్సింగ్ పద్దతిలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ
రెండు రోజులపాటు దరఖాస్తులు స్వీకరించనున్న హైడ్రా
-
May 20, 2025 12:24 IST
దర్యాప్తు ముమ్మరం..
విజయనగరం: ఉగ్ర కుట్ర భగ్నం కేసులో దర్యాప్తు ముమ్మరం
11 బ్యాంకుల్లో సిరాజ్‌కు ఖాతాలు ఉన్నట్టు గుర్తింపు
సిరాజ్ బ్యాంక్ ఖాతాల లావాదేవీలపై NIA ఆరా
ఉగ్రలింకులపై నగరంలో జల్లెడ పడుతున్న NIA
-
May 20, 2025 12:23 IST
సజ్జల శ్రీధర్‌రెడ్డి లేఖ
విజయవాడ: ఏసీబీ కోర్టు న్యాయాధికారికి సజ్జల శ్రీధర్‌రెడ్డి లేఖ
లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం లేదని, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ 10 పేజీల లేఖను న్యాయధికారికి అందజేసిన సజ్జల శ్రీధర్‌రెడ్డి
-
May 20, 2025 12:23 IST
ఉత్కంఠ..
ఎన్టీఆర్: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
మున్సిపల్ ఆపీస్‌కు 8 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కొలికపూడి
మొత్తం 11 మంది కోరం ఉంటే సభ నిర్వహణ
మరో ఇద్దరు కౌన్సిలర్లు హాజరుకాకుంటే వాయిదా పడే అవకాశం
-
May 20, 2025 12:22 IST
మహానాడు కమిటీలు
అమరావతి: మహానాడు నిర్వహణకు 19 కమిటీలు ఏర్పాటు
ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఏపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు
లోకేష్-సమన్వయ కమిటీ, యనమల-తీర్మానాల కమిటీ
అచ్చెన్న-వసతి ఏర్పాట్ల కమిటీ, రామ్మోహన్-సభ నిర్వహణ కమిటీ
ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది సభ్యులు
కడపలో ఈనెల 27 నుంచి మహానాడు, 29న బహిరంగ సభ
-
May 20, 2025 12:22 IST
సిట్ కస్టడీ పిటిషన్..
విజయవాడ: ఏసీబీ కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని వారం రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్
సిట్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం
-
May 20, 2025 11:29 IST
సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ
మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని లేఖలో కోరిన హరీష్‌రావు
అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ సర్కార్ పెరిగిన జీతం ఇవ్వడం లేదు: హరీష్‌రావు
మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గతేడాదిగా పాత జీతానికి పని చేయించుకుంటున్నారు: హరీష్‌రావు
జీతాన్ని రూ.13,650 నుంచి రూ.7,800కు తగ్గించడం దారుణం
మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగిలిన జిల్లాల్లో ఎందుకు ఇవ్వడం లేదు?: హరీష్‌రావు
-
May 20, 2025 11:29 IST
ఏపీ కేబినెట్ భేటీ..
కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ భేటీ
25 అంశాలు ఎజెండాగా కేబినెట్ సమావేశం
-
May 20, 2025 11:29 IST
వీడిన ఉత్కంఠ..
విశాఖ: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక
డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ గోవింద రెడ్డి
-
May 20, 2025 11:27 IST
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు ముమ్మరం
పాక్‌కు గూఢచర్యం ఆరోపణలతో జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసు దర్యాప్తును అప్పగించే యోచనలో కేంద్ర హోంశాఖ
భారీ కుట్రను ఛేదించేందుకే దర్యాప్తు అంటున్న నిఘావర్గాలు
కుట్రలో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారులు, పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పాత్ర ఉందని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు
ఇప్పటికే జ్యోతి మల్హోత్రాను ప్రశ్నిస్తోన్న NIA, ఐబీ అధికారులు
పలు దేశాల్లో జ్యోతి మల్హోత్రా విస్తృతంగా పర్యటించనట్టు సమాచారం
పాక్ భద్రతాధికారులతో జ్యోతి సమావేశమయ్యారన్న దర్యాప్తు సంస్థలు
పాక్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్ పర్యటనలపై వివరాలు సేకరిస్తున్న అధికారులు
పీఐవోకు జ్యోతి పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయన్న అధికారులు
పాక్ గూఢచర్యం కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్ట్
-
May 20, 2025 10:29 IST
ఫైల్స్ మాయంపై పంజాగుట్ట ఏసీపీ వివరణ..
తెలంగాణ రాజ్‌భవన్‌లో ఫైల్స్ మాయంపై పంజాగుట్ట ఏసీపీ వివరణ
రాజ్‌భవన్‌లో ఎలాంటి డాక్యుమెంట్స్ చోరీ అవ్వలేదు: ఏసీపీ
రాజ్‌భవన్‌లో పనిచేసే మహిళ ఫొటోలను ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ మార్ఫింగ్ చేశాడు: పంజాగుట్ట ఏసీపీ మోహన్
మహిళ ఫిర్యాదుతో ఈనెల 12న శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశాం: ఏసీపీ
శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు: ఏసీపీ మోహన్
మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ల కోసం శ్రీనివాస్ ఈనెల 14న మళ్లీ రాజ్‌భవన్‌కు వచ్చాడు: ఏసీపీ
హెల్మెట్ ధరించి మార్ఫింగ్ చేసిన హార్డ్‌డిస్క్‌లు దొంగలించాడు
దర్యాప్తు చేసి శ్రీనివాస్‌పై మరో కేసు నమోదు చేశాం: ఏసీపీ
15న శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం: పంజాగుట్ట ఏసీపీ
-
May 20, 2025 10:29 IST
భారీ వర్షాలు..
బెంగళూరులో మూడు రోజులుగా భారీ వర్షాలు
బెంగళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షాలతో ఇప్పటివరకు ముగ్గురు మృతి
-
May 20, 2025 09:55 IST
ఆర్మీ జవాన్ ఆత్మహత్య
జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ జవాన్ నాగరాజు ఆత్మహత్య
మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం
జవాన్ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట
భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించిన ఆర్మీ
జవాన్ మృతికి కుటుంబ సమస్యలే కారణమన్న బంధువులు
-
May 20, 2025 09:55 IST
భారీ వర్షం..
విజయవాడలో పలుచోట్ల భారీ వర్షం
ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
-
May 20, 2025 09:41 IST
నేడు వక్ఫ్ చట్టం.. సుప్రీంకోర్టు విచారణ..
నేడు వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ
వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ 100 పిటిషన్లు దాఖలు
మధ్యంతర ఉపశమనం అవసరమా? కాదా? అనేది పరిశీలించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం
-
May 20, 2025 09:40 IST
వైసీపీ అరాచకం..
కడప: ముద్దనూరు మండలం చిన్నదుద్యాలలో వైసీపీ అరాచకం
కూటమి నాయకులపై కత్తితో దాడి చేసిన వైసీపీ వర్గీయులు
నీటి బోర్లు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేస్తున్న కూటమి నాయకులపై దాడికి యత్నించిన వైసీపీ వర్గీయులు
వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డ టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి