
Breaking News: ఏపీ పోలీసుల అదుపులో వైసీపీ మాజీమంత్రి కాకాణి
ABN , First Publish Date - May 25 , 2025 | 08:12 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
May 25, 2025 20:28 IST
ఏపీ పోలీసుల అదుపులో వైసీపీ మాజీమంత్రి కాకాణి
కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాకాణిని రేపు ఉదయం నెల్లూరు తీసుకురానున్న పోలీసులు
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఇటీవల కాకాణి ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
May 25, 2025 17:56 IST
పవన్ కల్యాణ్ పేషీ నుంచి వచ్చిన కామెంట్స్‌పై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు.
ఆ నలుగురు అంటూ వార్తలు రాయడం సరికాదు: అల్లు అరవింద్
ఆ నలుగురి నుంచి నేను బయటకు వచ్చేశా.
నా దగ్గర చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.
నా దగ్గర కేవలం 15లోపు థియేటర్లే ఉన్నాయి.
మిగిలిన థియేటర్లు వదిలేశా.
తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు.
థియేటర్లకు సంబంధించి 3 మీటింగ్స్‌కూ నేను వెళ్లలేదు.
ఆ నలుగురు అంటూ నన్ను కలపొద్దు.
ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్.
పవన్ సినిమా వస్తుండగా థియేటర్ల మూత అనేది దుస్సాహసం.
గతంలో కలిసినప్పుడు సీఎంను కలవాలని పవన్ చెప్పారు.
సినిమా రంగాన్ని ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు.
ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడటం సరికాదు.
గత సీఎంను మా సినిమా పెద్దలు ఎందుకు కలిశారు.
ఈ ప్రభుత్వం వచ్చాక సీఎంను ఎందుకు కలవలేదు.
కొంతమంది మాకు సీఎం, డిప్యూటీ సీఎం తెలుసు అన్నారే తప్ప.. ఇండస్ట్రీ నుంచి ఏ సంఘం వెళ్లి కలవలేదు.
కష్టం వచ్చినప్పుడు వెళ్లి కలవడం కాదు.
ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లి కలవడం ఆనవాయితీ.
ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది.. ప్రభుత్వ సహకారం అవసరం.
ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు.
పవన్ పేషీ లేఖ సమర్థనీయం.
సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయి.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య.. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి.
ఏం కావాలనేది డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఆలోచించుకోవాలి.
ఏమీ మాట్లాడకుండా థియేటర్లు మూస్తామంటే ఎలా?
సమస్యపై చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు.
ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పవన్ కృషి చేస్తున్నారు.
థియేటర్లు మూస్తామని చెప్పి పవన్‌ను బెదిరిస్తున్నారా? అంటూ అల్లు అరవింద్ తీవ్రంగా స్పందించారు.
-
May 25, 2025 15:07 IST
కవిత లేఖపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
డిప్రెషన్‌లో కవిత తొందరపడి లేఖ విడుదల చేశారు.
కేసీఆర్‌ను దేవుడు అంటూనే కొంప ముంచుతున్నారు.
తండ్రిపై కవిత దండయాత్ర చేస్తున్నారు.
కేసీఆర్ ఇంట్లో పంచాయితీ బీజేపీకి బలం చేకూరుస్తోంది.
కాంగ్రెస్ వెంటనే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది.
కవిత స్వతహాగా ఎదిగిన లీడర్ కాదు.
ఏ చరిత్ర చూసినా కొడుకే రాజకీయ వారసుడు.
-
May 25, 2025 13:16 IST
ఆస్తిత్వం కోసమే..
ఢిల్లీ: ఆస్తిత్వం కోసమే కవిత ఆరాటం: ఎంపీ లక్ష్మణ్
కవిత బయటకు వచ్చి BRSకు వ్యతిరేకంగా పోరాడుతుందా అనే అంశంపై స్పష్టత రావాలి: లక్ష్మణ్
కవిత చేసే ప్రకటన ఆమెకే సంచలనం... ప్రజలకు కాదు: ఎంపీ లక్ష్మణ్
ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీదకే తిరగబడుతున్నాయి: లక్ష్మణ్
ఏపీలో షర్మిల జగన్‌పై ఎక్కుపెడితే, తెలంగాణలో కేటీఆర్ మీద కవిత బాణాలు సంధిస్తోంది: లక్ష్మణ్
ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరాలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయి: ఎంపీ లక్ష్మణ్
అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్‌ది కీలక పాత్ర: ఎంపీ లక్ష్మణ్
కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించనని కవిత చెప్పకనే చెప్పారు: ఎంపీ లక్ష్మణ్
కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలి: ఎంపీ లక్ష్మణ్
మూడో వ్యక్తి ప్రమేయంలేని లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలి: ఎంపీ లక్ష్మణ్
కవిత కాంగ్రెస్‌పై ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తోంది: ఎంపీ లక్ష్మణ్
సామాజిక తెలంగాణ అని కవిత అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : ఎంపీ లక్ష్మణ్
అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు?: ఎంపీ లక్ష్మణ్
-
May 25, 2025 13:11 IST
కవిత లేఖ.. జగ్గారెడ్డి ఏమన్నారంటే..
హైదరాబాద్: కవిత లేఖపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కవిత డిప్రెషన్‌లో లేఖలు విడుదల చేస్తోంది: జగ్గారెడ్డి
కవిత లేఖలతో కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు: జగ్గారెడ్డి
కవిత చర్యలు బీజేపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి: జగ్గారెడ్డి
BRSను చంపడం, బతికించుకోవడం వాళ్ళ వ్యక్తిగతం: జగ్గారెడ్డి
కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయింది: జగ్గారెడ్డి
కవిత వల్ల ఆ పార్టీ క్యాడర్ లీడర్స్ బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది: జగ్గారెడ్డి
కవిత తండ్రి చాటు బిడ్డగా లీడర్ అయింది: జగ్గారెడ్డి
కవిత డైరెక్ట్ లీడర్ కాదు... రాజకీయంగా బలవంతురాలు కాదు: జగ్గారెడ్డి
కేసీఆర్ కుటుంబంలో పార్టీలో లేఖల కలకలం రేగింది: జగ్గారెడ్డి
ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత అంశాలు ఉంటాయి: జగ్గారెడ్డి
కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన్ని జీవ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు: జగ్గారెడ్డి
రాష్ట్ర విభజన కోణంలోనే కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారు: జగ్గారెడ్డి
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు: జగ్గారెడ్డి
ఏ చరిత్ర చూసుకున్నా కొడుకే వారసుడు: జగ్గారెడ్డి
BRS కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలం పెంచుతున్నారు: జగ్గారెడ్డి
కవిత రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించదు: జగ్గారెడ్డి
కేసీఆర్ కూతురు కాబట్టే కవిత ఎపిసోడ్‌పై మీడియాకి ఆసక్తి: జగ్గారెడ్డి
కవిత లేఖలు లీకులతో బీజేపీకే లాభం: జగ్గారెడ్డి
-
May 25, 2025 12:07 IST
BRS శ్రేణుల ఆందోళన..
వనపర్తి: పెద్దమందడి పీఎస్ ఎదుట BRS శ్రేణుల ఆందోళన
ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు BRS కార్యకర్తలు కొండయ్య, సురేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
BRS కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
-
May 25, 2025 12:07 IST
వీధికుక్క స్వైరవిహారం..
జయశంకర్: భూపాలపల్లి మండలం కొంపల్లిలో వీధికుక్క స్వైరవిహారం
వీధికుక్క దాడిలో 15 మందికి తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
గాయపడిన బాధితులకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స
-
May 25, 2025 12:07 IST
అవన్నీ ఉహాగానాలే: గంగుల కమలాకర్
కరీంనగర్: కవిత పార్టీ అనేది ఊహాగానమే: గంగుల కమలాకర్
కేసీఆర్ కూతురిగా కవిత పార్టీ పెడితే ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి: ఎమ్మెల్యే గంగుల
పార్టీ పెడితే అప్పుడు చూద్దాం... మా బాస్ కేసీఆరే: గంగుల కమలాకర్
పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దన్న కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం: గంగుల కమలాకర్
-
May 25, 2025 12:06 IST
పుష్కర స్నానం ఆచరించిన గవర్నర్ జిష్ణుదేవ్
జయశంకర్: కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన గవర్నర్ జిష్ణుదేవ్
-
May 25, 2025 12:06 IST
సీఎం చంద్రబాబుకు ఏపీ పౌరహక్కుల సంఘం లేఖ..
సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు ఏపీ పౌరహక్కుల సంఘం లేఖ
నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావు అంతిమ సంస్కారాలపై వినతి లేఖ
ఇరువురి డెడ్‌బాడీలు స్వస్థలాలకు తరలించేందుకు బంధువుల ప్రయత్నాలు
కేశవరావు బంధువులకు శ్రీకాకుళం ఎస్పీ ఆటంకాలు సృష్టిస్తున్నారని లేఖ
అధికారులు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరిన నేతలు
పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్ పేరిట లేఖ
-
May 25, 2025 12:06 IST
కార్యకర్తల హత్య కలిచివేసింది: పల్లా శ్రీనివాస యాదవ్
అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్
పల్నాడులో టీడీపీ కార్యకర్తల హత్య కలిచివేసింది: పల్లా శ్రీనివాస యాదవ్
పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజేసేలా పిన్నెల్లి చేష్టలు: పల్లా శ్రీనివాస యాదవ్
బాధిత టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస యాదవ్
-
May 25, 2025 11:26 IST
'మన్ కీ బాత్'.. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..
122వ 'మన్ కీ బాత్'లో ప్రసంగించిన ప్రధాని మోదీ
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది: మోదీ
ఆపరేషన్ సిందూర్ చేపట్టిన మన సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉంది: మోదీ
సైన్యానికి యావత్ దేశం అభివందనం చేస్తోంది: మోదీ
సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీక
నక్సలిజంకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోంది: మోదీ
నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించాం: మోదీ
మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయి: మోదీ
దేశంలో పులుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరుగుతోంది: మోదీ
-
May 25, 2025 11:26 IST
ఆకస్మిక వరదలు..
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు
భారీ వర్షాలతో కులులో వరద బీభత్సం
పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం
ఐదో నెంబర్ హైవేపై విరిగిపడిన కొండచరియలు
రాంపూర్-కిన్నూర్ మధ్య హైవే బ్లాక్
-
May 25, 2025 11:26 IST
అయ్యో.. పాపం..
తమిళనాడులో రోడ్డుప్రమాదం
మధురైలో రోడ్డు దాటుతున్నవారిని ఢీకొట్టిన కారు
నలుగురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
-
May 25, 2025 10:32 IST
పోటెత్తిన భక్తులు..
భూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
కాళేశ్వరానికి 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
కాళేశ్వరం సమీపంలో ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు
వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు వాహనాలు
పలువురికి స్వల్పగాయాలు, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు
-
May 25, 2025 10:23 IST
అగ్నిప్రమాదం..
ఢిల్లీ: ఉద్యోగ్‌నగర్‌లో అగ్నిప్రమాదం
దుస్తుల పరిశ్రమలో భారీగా ఎగిసిపడిన మంటలు
10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
-
May 25, 2025 10:23 IST
జీవీ బాబు కన్నుమూత..
వరంగల్: ప్రముఖ రంగస్థల కళాకారుడు జీవీ బాబు కన్నుమూత
'బలగం' చిత్రంలో కొమురయ్యకు తమ్ముడిగా నటించిన జీవీ బాబు
అనారోగ్యంతో వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
-
May 25, 2025 10:23 IST
విజయనగరం: పేలుళ్ల కుట్ర కేసు..
మూడో రోజు పోలీస్ కస్టడీకి సిరాజ్, సమీర్
విజయనగరంలో మకాం వేసిన ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దర్యాప్తు బృందాలు
2రోజుల కస్టడీలో పొంతన లేని సమాధానాలు ఇచ్చిన నిందితులు
నిందితుల మాటలను విశ్లేషిస్తున్న దర్యాప్తు బృందాలు
దేశంలోని పలు ప్రాంతాల్లో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ ఏర్పాటు చేసిన 10 మందిని అదుపులోకి తీసుకునే పనిలో దర్యాప్తు బృందాలు
విశాఖలోని ఓ రెవెన్యూ అధికారి తమను ప్రోత్సహించారని సిరాజ్ ఇచ్చిన సమాచారంతో ఆరా తీస్తున్న పోలీసులు
సిరాజ్, సమీర్ నెట్‌వర్క్‌పై దృష్టిపెట్టిన దర్యాప్తు బృందాలు
-
May 25, 2025 10:21 IST
ఫేక్ పోలీస్ అరెస్ట్..
హైదరాబాద్: యూసుఫ్‌గూడలో ఫేక్ పోలీస్ అరెస్ట్
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటూ కిరణ్‌కుమార్ మోసాలు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.20లక్షలు వసూలు
మోసపోయానని గ్రహించి పోలీసులకు ఐదుగురు యువకులు ఫిర్యాదు
కిరణ్‌ను అరెస్ట్ చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు
రూ.5.45 లక్షలు సీజ్, నకిలీ ఐడీ కార్డ్స్, బైకులు స్వాధీనం
-
May 25, 2025 10:20 IST
బెట్టింగ్‌కు యువకుడు బలి..
వికారాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి
రైలు కిందపడి కోటమర్పపల్లికి చెందిన విజయ్ ఆత్మహత్య
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.3లక్షలు పోగొట్టుకున్న విజయ్‌కుమార్
అప్పులు ఇచ్చినవారు తిరిగి అడగడంతో బలవన్మరణం
-
May 25, 2025 08:22 IST
సన్నబియ్యం పంపిణీ
తెలంగాణలో మూడునెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ
జూన్, జులై, ఆగస్టు నెలల కోటా పంపిణీ
గోధుమలు, చక్కెర కూడా పంపిణీ చేయాలని నిర్ణయం
జూన్ 1 నుంచి పంపిణీ చేయనున్న పౌరసరఫరాలశాఖ
-
May 25, 2025 08:22 IST
భారీగా నిధులు
ఏపీలో అమృత్ పథకానికి భారీగా నిధులు
రూ.397 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-
May 25, 2025 08:20 IST
భాగస్వామ్య పక్షాల సమావేశం..
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు భాగస్వామ్య పక్షాల సమావేశం
భేటీలో పాల్గొననున్న ఎన్డీఏ పక్షాల ముఖ్యనేతలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు
కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి
ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీఏ పక్షాల సమావేశం
ఆపరేషన్ సిందూర్, కులగణన అంశాలపై సమావేశంలో చర్చ
మోదీ సర్కార్ మూడో పదవీకాలంలో మొదటి వార్షికోత్సవం అంశాలపై చర్చ
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై చర్చ
భేటీలో ఉత్తమ విధానాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న పలు రాష్ట్రాల సీఎంలు
ఉ.9 గంటలకు ఢిల్లీలోని అశోకా హోటల్‌లో భేటీ
హాజరుకానున్న ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు
పాల్గొననున్న జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్
సమావేశానికి హాజరుకానున్న పవన్‌కల్యాణ్
ముందస్తు షెడ్యూల్ కారణంగా సమావేశానికి హాజరుకావడం లేదని సమాచారం ఇచ్చిన చంద్రబాబు
-
May 25, 2025 08:19 IST
భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు
తీరం వెంట గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
-
May 25, 2025 08:19 IST
రుతు పవనాలు వచ్చేశాయ్..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
కర్నాటక, కేరళ, గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
రెండు మూడు రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు
-
May 25, 2025 08:19 IST
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ..
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ
మధ్యాహ్నం 2:30 గంటలకు టోర్నీ ప్రారంభం
-
May 25, 2025 08:17 IST
కాళేశ్వరం రానున్న గవర్నర్
జయశంకర్: నేడు కాళేశ్వరం రానున్న గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ
సరస్వతి పుష్కరాల్లో పాల్గొననున్న గవర్నర్
అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకోనున్న గవర్నర్
గవర్నర్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు
మరోవైపు ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ
రేపటితో పుష్కరాలు ముగింపు దృష్ట్యా ఇవాళ భక్తుల రద్దీ
-
May 25, 2025 08:17 IST
నేటి నుంచే కస్టడీ..
APPSC కేసులో PSR ఆంజనేయులు, మధుకు పోలీస్ కస్టడీ
నేటి నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ
PSR, మధును ప్రశ్నించనున్న సూర్యారావుపేట పోలీసులు
గ్రూప్-1 అక్రమాల కేసులో PSR, మధు రిమాండ్ ఖైదీలు
-
May 25, 2025 08:15 IST
వారితో మోదీ భేటీ..
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు భాగస్వామ్య పక్షాల భేటీ
భేటీలో పాల్గొననున్న ఎన్డీఏ ముఖ్యనేతలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు
-
May 25, 2025 08:15 IST
దర్యాప్తు ముమ్మరం..
విజయనగరం: పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం
మూడోరోజు సిరాజ్, సమీర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
-
May 25, 2025 08:15 IST
జీపీవో పరీక్ష
నేడు తెలంగాణలో జీపీవో పరీక్ష
ఉ.10:30 నుంచి మ.1:30 వరకు పరీక్ష
10,954 పోస్టులకు జరగనున్న పరీక్ష
-
May 25, 2025 08:15 IST
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష.. సర్వం సిద్ధం..
నేడు దేశవ్యాప్తంగా UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మొదటి పేపర్ పరీక్ష
మ.2:30 నుంచి సా.4:30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష
తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్న వేల మంది అభ్యర్థులు
-
May 25, 2025 08:12 IST
సీఎం చంద్రబాబు గృహప్రవేశం
చిత్తూరు: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం
శాంతిపురం మండలం శివపురం దగ్గర నూతన గృహ నిర్మాణం
కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు దంపతుల ఆహ్వానం