Breaking News: ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
ABN , First Publish Date - May 26 , 2025 | 08:32 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 26, 2025 20:33 IST
ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న హరీష్‌కుమార్ గుప్తా
రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న హరీష్‌కుమార్ గుప్తా
-
May 26, 2025 20:31 IST
మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి..
ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన.. 27 మంది మావోయిస్టుల మృతదేహాలకు అంత్యక్రియలు.
సామూహిక అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు.
నంబాలతో పాటు 27 మంది అంత్యక్రియలు పూర్తి.
మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని.. కోర్టు ఆదేశాలు జారీ చేసినా అప్పగించని ఛత్తీస్‌గఢ్ పోలీసులు.
-
May 26, 2025 17:56 IST
కోనసీమ జిల్లాలో పెను విషాదం..
గోదావరిలో స్నానానికి దిగి 8 మంది గల్లంతు.
ముమ్మిడివరం మండలం కె.గంగవరం సరిహద్దు సీర్లంక దగ్గర ఘటన.
కాకినాడ నుంచి ఓ శుభకార్యానికి వచ్చి.. గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన 8 మంది.
గల్లంతైన వారు కాకినాడ, రామచంద్రపురం, మండపేట యువకులుగా గుర్తింపు.
గల్లంతైన వారికోసం కొనసాగుతున్న గాలింపు.
గల్లంతైన వారు క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్.
-
May 26, 2025 17:35 IST
నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాణి
నెల్లూరు: కాకణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొచ్చిన పోలీసులు.
నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరుకున్న వైసిపీ కార్యకర్తలు నాయకులు.
ప్రొసీజర్ పూర్తి చేసి జైలు లోపలకు తీసుకెళ్లిన జైలు అధికారులు.
కాకాణి స్పెషల్ కేటగిరి పిటిషన్‌ను హోల్డ్‌లో పెట్టిన వెంకటగిరి కోర్టు.
కాకాణి స్పెషల్ కేటగిరి పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో సాదారణ ఖైదీ గానె జైల్లోకి కాకాణి.
-
May 26, 2025 17:28 IST
మావోయిస్టుల మృతదేహాలు ఇవ్వం: పోలీసులు
ఛత్తీస్ ఘడ్ : మావోయిస్టుల మృతదేహాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు.
మృతదేహాలు ఇవ్వం, మేమే తగులబెడతాం, ఉంటే ఉండండి పోతే పోండి అంటూ.. మృతుల కుటుంబాలకు చెప్పిన నారాయణపూర్ ఎస్పీ.
ఆవేదనలో బంధువులు.
చేసేది లేక ఛత్తీస్ గఢ్ నుంచి వెనుదిరిగిన మృతి చెందిన మావోయిస్టుల బంధువులు.
-
May 26, 2025 16:47 IST
సినిమా ఇండస్ట్రీకి పవన్ ఇచ్చిన సపోర్ట్ అంతాఇంతా కాదు: దిల్‌రాజు
ప్రభుత్వాలను కలుపుకుంటూ ముందుకెళ్తాం.
యూనిటీగా వివాదాలను పరిష్కరించుకోవాలి.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో కలిపి కమిటీ వేస్తాం.
ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్తాం.
పవన్ కల్యాణ్ మాకు పెద్దన్న.. తిట్టినా పడతాం.
పవన్‌కు కోపం వచ్చేలా మొత్తం ఎపిసోడ్ జరిగింది.
-
May 26, 2025 16:47 IST
పవన్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రస్తుతం సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యింది: దిల్‌రాజు
పవన్ సినిమా రిలీజ్‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరు.
మధ్యలో రాంగ్ కమ్యూనికేషన్ జరిగింది.
మంత్రి కందుల దుర్గేష్ నాతో మాట్లాడారు.
థియేటర్ల మూసివేత ఉండదని చెప్పా.
మిస్ కమ్యూనికేషన్ వల్లే ప్రస్తుతం వివాదం నెలకొంది.
జూన్ 11న కమల్‌హాసన్, 12న పవన్.. 20న కుబేరా సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి.
జులై, ఆగస్టులోనూ చాలా సినిమాలు విడుదలకు ఉన్నాయి.
సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాలు ముఖ్యం.
తెలంగాణలో 30, ఉత్తరాంధ్రలో 20 మాత్రమే.. నాకు లీజ్ థియేటర్లు ఉన్నాయి.
-
May 26, 2025 16:47 IST
తూ.గో.జిల్లా నుంచే వివాదం మొదలైంది: దిల్ రాజు
మే 18న ఒక సమావేశం అనుకున్నాం.
ఎగ్జిబిటర్ల సమస్యను నిర్మాతల దృష్టికి తీసుకెళ్లాలని కోరా.
థియేటర్ల మూసివేత అంశాన్ని ప్రతిపాదించొద్దని చెప్పాం.
ఛాంబర్‌కు ఎగ్జిబిటర్లు లేఖ ఇచ్చారు.
అందులో మా సమస్యలు పరిష్కరించకపోతే.. థియేటర్లు మూసివేస్తామని వారు లేఖలో ప్రస్తావించారు.
అప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరిదారి వారిదే.
ఎగ్జిబిటర్లతో డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది.
డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ సమస్యలు చెప్పారు.
సినిమాల విడుదల ఉన్నాయి కాబట్టి.. థియేటర్ల మూసివేత నిర్ణయం వద్దన్నారు.
ఇప్పటి వరకు జరిగింది ఇదే.
-
May 26, 2025 15:49 IST
థియేటర్ల వివాదంపై నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 19న థియేటర్ల గొడవ మొదలైంది.
తూ.గో.జిల్లాలో స్థానిక ఎగ్జిబిటర్లు.. తమ ఇబ్బందులపై సమావేశం పెట్టారు.
పర్సంటేజ్ విధానం కావాలని డిమాండ్ చేశారు.
డిస్ట్రిబ్యూటర్లు-ఎగ్జిబిటర్లు మధ్య తలెత్తిన వివాదం.. ఏప్రిల్ 26న మా దృష్టికి వచ్చింది.
సినిమా రిలీజ్ చేస్తే ఫస్ట్ వీక్ రెంట్.. సెకండ్ వీక్ నుంచి పర్సంటేజ్ అమల్లో ఉంది.
-
May 26, 2025 13:29 IST
కొవిడ్ మార్గదర్శకాలు ఉపసంహరణ..
కొవిడ్ మార్గదర్శకాలు ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం
మే 21న జారీ చేసిన మార్గదర్శకాలు ఉపసంహరణ
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా తదుపరి కార్యాచరణ
స్థానిక పరిస్థితుల ఆధారంగా మార్గదర్శకాల ఖరారుకు నిర్ణయం
-
May 26, 2025 13:29 IST
ఓఎంసీ కేసు.. సీబీఐ కౌంటర్ దాఖలు
ఓఎంసీ కేసులో బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ దాఖలు
గాలి జనార్ధన్‌రెడ్డి, మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్
నలుగురికి బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్‌లో పేర్కొన్న సీబీఐ
ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితులు
-
May 26, 2025 13:29 IST
రాహుల్‌గాంధీకి అభినందన సభ
ఢిల్లీలో రాహుల్‌గాంధీకి బీసీ అభినందన సభ
జనగణనలో కులగణన సాధ్యం చేసేలా చేసిన రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపిన అన్ని రాష్ట్రాల బీసీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ నుంచి పాల్గొన్న పొన్నం, సురేఖ సహా బీసీ నేతలు
-
May 26, 2025 13:22 IST
సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది: మంత్రి దుర్గేష్
టికెట్ ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది: దుర్గేష్
టికెట్ల రేటు పెంచాలని నిర్మాతలు అడిగినప్పుడు పెంచుతున్నాం: దుర్గేష్
టికెట్ రేటు రూపాయి పెంచితే ప్రభుత్వానికి పావలా GST వస్తుంది: దుర్గేష్
మా సమస్య మేమే పరిష్కరించుకుంటామని అహంభావంతో మాట్లాడుతున్నారు: మంత్రి కందుల దుర్గేష్
సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు వాస్తవం: దుర్గేష్
పవన్ సినిమాపై ఓ మాజీ మంత్రి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు: దుర్గేష్
అదొక ప్లాప్ సినిమా అంటూ కామెంట్ చేశారు: మంత్రి దుర్గేష్
అదొక పోరాట యోధుడి సినిమా: మంత్రి కందుల దుర్గేష్
విడుదలకు ముందే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు: దుర్గేష్
థియేటర్ల మూసివేత అంశంపై విచారణ జరపాలని చెప్పాం: దుర్గేష్
ఈ విషయాన్ని రాజకీయం చేసి కొందరు లబ్ధి పొందాలని చూస్తున్నారు: దుర్గేష్
సినిమా రంగాన్ని మేం ఇబ్బంది పెడుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు: దుర్గేష్
తప్పు జరిగితే చట్టపరంగా ముందుకెళ్లాలని చూశాం: దుర్గేష్
హాఫ్ నాలెడ్జీతో మాపై విమర్శలు చేయడం మానుకోవాలి: దుర్గేష్
సినీ రంగానికి వ్యతిరేకంగా మేం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు: దుర్గేష్
కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: దుర్గేష్
గతంలో కూడా ఇదే విషయంపై ఇండస్ట్రీ ప్రతినిధులకు లేఖలు రాశా: దుర్గేష్
కలిసి చర్చించుకుంటారా? లేదా? అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం: దుర్గేష్
-
May 26, 2025 11:54 IST
వైమానిక దాడి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి
పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి
-
May 26, 2025 10:17 IST
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్..
కేరళలో భారీ వర్షాలు, 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో భారీ వర్షాలు
నేలకొరిగిన భారీ వృక్షాలు, కొనసాగుతున్న సహాయకచర్యలు
-
May 26, 2025 10:15 IST
కరోనా కేసులు.. వివరాలివే..
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు
తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు
కేరళలో 273, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56,..
ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర థానేలో కొవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు మృతి
బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి
-
May 26, 2025 10:15 IST
విద్యార్థి ఆత్మహత్య..
రాజస్థాన్ కోటాలో నీట్ విద్యార్థి ఆత్మహత్య
ఉరేసుకుని జమ్మూకశ్మీర్ విద్యార్థి ప్రతాప్ బలవన్మరణం
కోటాలో ఇప్పటివరకు ఈ ఏడాది 15మంది విద్యార్థులు ఆత్మహత్య
-
May 26, 2025 10:15 IST
సీఎం కోసం బారులు తీరిన ప్రజలు..
చిత్తూరు: కుప్పంలోనే సీఎం చంద్రబాబు కుటుంబం
రెండు రోజులుగా సొంతింటిలో సీఎం ఫ్యామిలీ సందడి
కాసేపట్లో అమరావతికి బయల్దేరనున్న చంద్రబాబు కుటుంబం
సీఎం చంద్రబాబును కలిసేందుకు భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు
-
May 26, 2025 10:15 IST
రేవ్ పార్టీ.. 30 మంది అరెస్ట్..
కర్ణాటక దేవనహళ్లిలో రేవ్ పార్టీ
30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కన్నమంగళ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ
-
May 26, 2025 09:06 IST
ఆ ప్రధానిపై తీవ్ర విమర్శలు..
ముహమ్మద్ యూనస్‌పై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర విమర్శలు
బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం: హసీనా
నిషేధం విధించే హక్కు యూనస్‌కు లేదు: హసీనా
రాజ్యాంగాన్ని మార్చే అధికారం యూనస్‌కు ఎవరిచ్చారు?
ఉగ్రవాద సంస్థల సాయంతో పాలన కొనసాగిస్తున్నారు: హసీనా
బంగ్లాను అమెరికాకు అమ్మేసేందుకు కుట్ర జరుగుతోంది: హసీనా
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మిలిటెంట్ల రాజ్యం నడుస్తోంది: హసీనా
-
May 26, 2025 09:06 IST
జాతీయస్థాయి ఓబీసీ సమావేశం..
నేడు ఢిల్లీలో జాతీయస్థాయి ఓబీసీ సమావేశం
పాల్గొననున్న అన్ని రాష్ట్రాల బీసీ ముఖ్యనేతలు
ఇప్పటికే ఢిల్లీకి మంత్రులు పొన్నం, కొండా సురేఖ
బీసీ కులగణన, 42శాతం రిజర్వేషన్ అమలు ఎజెండాగా చర్చ
-
May 26, 2025 09:06 IST
ఐపీఎల్ మ్యాచ్..
నేడు పంజాబ్ వర్సెస్ ముంబై
జైపూర్‌లో రాత్రి 7.30గంటలకు మ్యాచ్
-
May 26, 2025 09:04 IST
నేడు కడపకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
రేపటి నుంచి కడపలో టీడీపీ మహానాడు
ఇప్పటికే టీడీపీ మహానాడుకు పూర్తయిన ఏర్పాట్లు
పబ్బాపురంలో 150ఎకరాల విస్తీర్ణంలో మహానాడు
-
May 26, 2025 09:04 IST
హైదరాబాద్: చివరి దశకు మిస్ వరల్డ్ పోటీలు
నేడు బ్యూటీ విత్ ఎ పర్సన్ పోటీలు
తాము చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి..
జడ్జిలకు వివరించనున్న అందాల భామలు
-
May 26, 2025 08:34 IST
క్యాబినెస్ విస్తరణ.. ఢిల్లీ పెద్దలతో..
ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
నేడు మరోసారి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ
క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ
-
May 26, 2025 08:32 IST
ఏపీపీఎస్సీ కేసు.. రెండో రోజు విచారణ..
విజయవాడ: APPSC కేసుపై పోలీసులు విచారణ
నేడు రెండో రోజు పోలీస్ కస్టడీకి PSR ఆంజనేయులు, మధు
PSR, మధును ప్రశ్నించనున్న సూర్యారావుపేట పోలీసులు