Share News

రాంచీవన్డేలో భారత్ విక్టరీ

ABN , First Publish Date - Nov 30 , 2025 | 07:04 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

రాంచీవన్డేలో భారత్ విక్టరీ
Breaking News

Live News & Update

  • Nov 30, 2025 22:05 IST

    రాంచీవన్డేలో భారత్ విక్టరీ

    • ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలుపు

    • 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలుపు

    • స్కోర్లు: భారత్‌ 349/8, దక్షిణాఫ్రికా 332 ఆలౌట్‌

    • మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌

    • కోహ్లీ 135, రాహుల్‌ 60, రోహిత్‌ 57, జడేజా 32 రన్స్‌

  • Nov 30, 2025 19:34 IST

    డిసెంబర్‌ 1న మక్తల్‌ ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం: భట్టి

    • డిసెంబర్‌ 2న కొత్తగూడెంలో ఉత్సవాలు: భట్టి విక్రమార్క

    • డిసెంబర్‌ 3న హుస్నాబాద్‌, 4న ఆదిలాబాద్‌లో ఉత్సవాలు

    • డిసెంబర్‌ 5న నర్సంపేట, 6న దేవరకొండలో ఉత్సవాలు: భట్టి

    • 7న ఓయూలో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తాం: భట్టి

  • Nov 30, 2025 19:12 IST

    రాజమండ్రి: దిత్వా తుపాన్ ప్రభావంతో రాజమండ్రిలో వర్షాలు

    • ఈదురుగాలులతో వరి రైతుల్లో ఆందోళన

    • తూ.గో., కోనసీమ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కల్లాల్లోనే ధాన్యం

  • Nov 30, 2025 18:11 IST

    ఢిల్లీ: సోనియా నివాసంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ

    • సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఖర్గే, చిదంబరం, గౌరవ్ గొగోయ్

    • పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో చర్చ

    • సభలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలతో సోనియాగాంధీ దిశా నిర్దేశం

  • Nov 30, 2025 17:38 IST

    మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

    • ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు

    • దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట లొంగుబాటు

  • Nov 30, 2025 17:38 IST

    ఏపీ నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు

    • A14 తలారి రంగయ్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు

    • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఇటీవల రంగయ్య పిటిషన్‌

    • కింద కోర్టులో వ్యవహారం తేల్చుకోవాలని సూచించిన హైకోర్టు

    • ఆరో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో రంగయ్య బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

  • Nov 30, 2025 17:08 IST

    హైదరాబాద్‌: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం...

    • ప్రత్యేక MSME పార్కులు ఏర్పాటు: మంత్రి శ్రీధర్‌బాబు

    • మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలి: శ్రీధర్‌బాబు

    • 2017-18 నుంచి 2023-24 వరకు...

    • మహిళా శ్రామికశక్తి 22 నుంచి 40 శాతానికి పెరుగుదల: శ్రీధర్‌బాబు

    • మహిళా స్టార్టప్స్‌ను గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌గా...

    • తీర్చిదిద్దేందుకు ‘వీ హబ్ 2.0’ రూపకల్పన

    • స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్,...

    • మెంటర్షిప్‌-all-in-one ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రణాళికలు

  • Nov 30, 2025 16:22 IST

    రాంచీవన్డేలో విరాట్‌ కోహ్లీ సెంచరీ

    • 5 సిక్స్‌లు, 7 ఫోర్లతో సెంచరీ చేసిన కోహ్లీ

    • 102 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన కోహ్లీ

    • వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన విరాట్‌ కోహ్లీ

  • Nov 30, 2025 14:21 IST

    ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగించిన ఎన్నికల సంఘం

    • డిసెంబర్ 4 వరకు జరగాల్సిన ఓటర్ల సవరణ డిసెంబర్ 11 వరకు పొడిగింపు

    • డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల

    • 12 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన ఈసీ

    • ఉత్తరప్రదేశ్, అండమాన్, నికోబార్, ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షదీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ

  • Nov 30, 2025 14:15 IST

    పల్నాడు: సత్తెనపల్లి మం. ధూళిపాళ్లలో దారుణం

    • తల్లి, కుమారుడిపై అగంతకులు కత్తులతో దాడి

    • ఇద్దరి గొంతు కోసిన అగంతకులు, కుమారుడు సాంబశివరావు మృతి

    • తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమం

  • Nov 30, 2025 12:19 IST

    ప్రధాని మోదీ 'మన్‌కీ బాత్'లో కరీంనగర్ ప్రస్తావన

    • కరీంనగర్‌ సాంప్రదాయ కళాకృతులను..

    • వివిధ దేశాల ప్రధానులకు బహూకరించా: ప్రధాని మోదీ

    • కరీంనగర్‌ సాంప్రదాయ సిల్వర్‌తో తయారైన..

    • బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించా: మోదీ

    • సంప్రదాయపూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను..

    • ఇటలీ ప్రధానికి బహుకరించా: ప్రధాని మోదీ

  • Nov 30, 2025 12:19 IST

    జోగి బ్రదర్స్‌కు నేటితో ముగియనున్న కస్టడీ

    • నకిలీ లిక్కర్ స్కాం కేసులో జోగి బ్రదర్స్‌కు నేటితో ముగియనున్న కస్టడీ

    • ఐదో రోజు జైలు నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించిన అధికారులు

    • నేటి సాయంత్రం విచారణ తర్వాత కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు

  • Nov 30, 2025 12:18 IST

    మరోసారి నోరు జారిన నటుడు రాజేంద్రప్రసాద్

    • ఓ సినీ ఈవెంట్‌లో బ్రహ్మానందంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు

    • నటుడు రాజేంద్రప్రసాద్ తీరుపై ఇటీవల విమర్శలు

    • రాజేంద్రప్రసాద్‌కు నోటి దురుసు అంటూ నెటిజెన్స్ అగ్రహం

  • Nov 30, 2025 08:43 IST

    నల్లగొండ: తిప్పర్తి మండలంలో నామినేషన్లు వేయకుండా కిడ్నాప్

    • ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయింపు

    • ఏకగ్రీవం చేసేందుకు మరో సర్పంచ్ అభ్యర్థి భర్త ప్లాన్

    • సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా మామిడి యాదగిరి కిడ్నాప్

    • యాదగిరి భార్య నాగమ్మ నామినేషన్ వేయడంతో కిడ్నాప్ ప్లాన్‌కు తెర

    • కాంగ్రెస్ నేత సందీప్‌రెడ్డి కిడ్నాప్ చేశారని బాధితుల ఆరోపణ

    • ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యేలు

  • Nov 30, 2025 07:04 IST

    భారీ అగ్నిప్రమాదం

    • ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, నలుగురు మృతి

    • చెప్పుల దుకాణంలో చెలరేగిన మంటలు

    • మంటలు అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది

  • Nov 30, 2025 07:04 IST

    నేడు రెండో విడత TG పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

    • నేటి నుంచి డిసెంబర్‌ 2 వరకు నామినేషన్‌ స్వీకరణ

    • డిసెంబర్‌ 3న నామినేషన్ల పరిశీలన

    • డిసెంబర్‌ 14న 4,333 గ్రామాల్లో ఎన్నికలు

  • Nov 30, 2025 07:04 IST

    తెలంగాణలో ముగిసిన తొలి విడత నామినేషన్ల గడువు

    • అర్థరాత్రివరకు కొనసాగిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

    • నిన్న చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు

    • నేడు నామినేషన్లు పరిశీలించనున్న అధికారులు

    • డిసెంబర్‌ 11న 4,236 గ్రామాల్లో ఎన్నికలు