Share News

'మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం

ABN , First Publish Date - Nov 29 , 2025 | 07:26 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

'మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం
Breaking News

Live News & Update

  • Nov 29, 2025 21:18 IST

    అల్లూరి: రేపటి మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో పోలీసులు అలర్ట్‌

    • భద్రాచలం, పాడేరు, గుత్తేడు, వై.రామవరం ఏరియాలకు...

    • ఇవాళ రాత్రి నుంచే ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేసిన అధికారులు

    • ప్రజాప్రతినిధులు, అధికారులు ఏజెన్సీలో పర్యటించవద్దని హెచ్చరిక

  • Nov 29, 2025 20:15 IST

    కమ్యూనికేషన్ యాప్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

    • డివైజ్‌లో సిమ్ ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని ఆదేశం

    • వెబ్ బ్రౌజర్‌లో 6గంటల తర్వాత లాగౌట్ అయ్యేలా చూడాలని సూచన

  • Nov 29, 2025 18:09 IST

    తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

    • తొలి విడతలో 4,236 పంచాయతీలు, 37,440 వార్డల్లో ఎన్నికలు

  • Nov 29, 2025 18:08 IST

    పైరసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించిన రవి

    • తాను నిర్వహించిన వెబ్‌సైట్లపై క్లారిటీ ఇచ్చిన ఐబొమ్మ రవి

    • ఐబొమ్మ పూర్తిపేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించిన రవి

    • విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లం: ఐబొమ్మ రవి

    • బొమ్మను ఇంటర్నెట్‌లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా

    • మరో వెబ్‌సైట్‌కు బలపం పేరు పెట్టాలని భావించా: ఐబొమ్మ రవి

    • డొమైన్‌లో సాంకేతిక సమస్యతో L అక్షరం తీసి బప్పంగా మార్చాం

    • నేను అప్‌లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్‌ నుంచి తీసుకున్నవే: రవి

  • Nov 29, 2025 16:56 IST

    2026 మార్చి 1 నుంచి ఏపీ సీఎస్‌గా జి.సాయిప్రసాద్

    • అప్పటివరకు చీఫ్ సెక్రటరీగా కొనసాగనున్న విజయానంద్‌

    • విజయానంద్‌ పదవీకాలం మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

  • Nov 29, 2025 15:35 IST

    పాకిస్థాన్‌లో భారతీయుడు అరెస్ట్‌

    • అసోంకు చెందిన బీజే సింగ్‌గా గుర్తింపు

    • ఆగస్టులో పాక్‌ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు

  • Nov 29, 2025 14:47 IST

    ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీకాలం పొడిగింపు

    • మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

    • విజయానంద్ పదవీకాలం పొడిగించాలని ఇటీవల కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

    • ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తితో విజయానంద్ పదవీకాలం 3 నెలలు పొడిగింపు

  • Nov 29, 2025 13:15 IST

    నాపై సాక్షి మీడియా ద్వారా జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు: సంధ్యారాణి

    • నీతి, నిజాయితీ, ధర్మం వంటి పదాలు సాక్షి డిక్షనరీలో లేవు: మంత్రి సంధ్యారాణి

    • రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను బద్నాం చేస్తున్నారు: మంత్రి సంధ్యారాణి

    • నా బిడ్డపై అసత్య ఆరోపణలు చేసిన ఏ ఒక్కరిని వదలను: సంధ్యారాణి

    • తప్పుడు ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరపాలని నేనే కోరా: సంధ్యారాణి

  • Nov 29, 2025 13:15 IST

    అమరావతి: దిత్వా తుఫాన్‌పై హోంమంత్రి అనిత సమీక్ష

    • తుఫాన్ ప్రభావిత జిల్లాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలి

    • సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలను పంపాలి: అనిత

    • ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలి: అనిత

    • కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలి: హోంమంత్రి అనిత

    • కంట్రోల్ రూం నెంబర్లు 112, 1070, 1800 425 0101: అనిత

  • Nov 29, 2025 13:11 IST

    హైదరాబాద్‌: 'మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం

    • నాలుగేళ్ల నుంచి 'మా' అధ్యక్షుడు గా కొనసాగుతోన్న మంచు విష్ణు..

    • 'మా' భవనం నిర్మించేవరకు అధ్యక్షుడిగా విష్ణు ఉంటారని గతేడాది తీర్మానం

    • 'మా' భవనం నిర్మాణం ఎక్కడిదాకా వచ్చిందన్న దానిపై ఇప్పటికీ లేని అప్‌డేట్‌

    • తాజా మీటింగ్‌లో "మా" ఎన్నికలు జరపాలంటూ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ

    • రెండేళ్లకొసారి జరగాల్సిన "మా" ఎన్నికలు

  • Nov 29, 2025 11:16 IST

    తెలంగాణలో భారీ మోసం

    • పెట్టుబడుల పేరుతో రూ.14 కోట్లు స్వాహా

    • హైదరాబాద్ డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు

    • సోషల్ మీడియాలో డాక్టర్‌ను సంప్రదించిన నేరగాళ్లు

    • మోనిక మాధవన్ పేరుతో ఫేస్‌బుక్‌లో మెసేజ్‌

    • నకిలీ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ లింక్ పంపిన నేరగాళ్లు

    • లాభాలు వచ్చాయంటూ మెసేజ్ పంపించిన కేటుగాళ్లు

    • డబ్బు విత్‌డ్రా చేయాలంటే ట్యాక్స్‌ కట్టాలని ఒత్తిడి

    • సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బాధితుడు ఫిర్యాదు

  • Nov 29, 2025 10:17 IST

    బెంగళూరు: సీఎం సిద్దరామయ్య నివాసంలో కీలక భేటీ

    • బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు డిప్యూటీ సీఎం డీకేకు ఆహ్వానం

    • కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశంతో డీకేతో సీఎం సిద్దూ సమావేశం

    • నేటి మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం సిద్దరామయ్య

  • Nov 29, 2025 07:28 IST

    నేడు BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్‌

    • తెలంగాణ భవన్‌తో పాటు జిల్లాల్లో BRS ఆఫీసుల్లో దీక్షా దివస్‌

    • తెలంగాణ భవన్‌లో జరిగే దీక్షా దివస్‌లో పాల్గొననున్న కేటీఆర్‌

    • 2009 నవంబర్‌ 29న కేసీఆర్ దీక్ష చేసిన రోజును దీక్షా దివస్‌గా పాటిస్తున్న BRS

  • Nov 29, 2025 07:28 IST

    హైదరాబాద్‌: నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల స్వీకరణ

    • డిసెంబర్‌ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు

    • రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపటనుంచి ప్రారంభం

    • డిసెంబర్‌ 2వరకు నామినేషన్ల స్వీకరణ

    • డిసెంబర్‌ 6న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు

  • Nov 29, 2025 07:28 IST

    ఘోరం.. బస్సు బోల్తా పడి..

    • కర్నూలు: తుగ్గలి-రాతన మధ్య కర్ణాటక బస్సు బోల్తా

    • బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న బస్సు

    • ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రమాణికులు

  • Nov 29, 2025 07:26 IST

    కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

    • ఎమ్మిగనూర్ మం. కోటేకల్ దగ్గర 2 కార్లు ఢీ, ఐదుగురు మృతి

    • మరికొందరికి తీవ్ర గాయాలు, మృతుల్లో చిన్నారులు

    • మృతులంతా కర్ణాటక కోలార్‌ జిల్లా చిక్కహోసల్లి గ్రామస్తులు

    • మృతులు వెంకటేశప్ప (60), సతీష్‌ (36), మీనాక్షి (32), రుత్విక్‌, బన్నీ గౌడ్‌

    • కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఘటన