నర్సింగ్ విద్యార్థినిపై.. కెమికల్ దాడి..
ABN , First Publish Date - Dec 01 , 2025 | 09:26 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 01, 2025 21:52 IST
నర్సింగ్ విద్యార్థినిపై.. కెమికల్ దాడి..
హనుమకొండ : కాజీపేట మండలం కడిపికొండలో దారుణం..
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తుల కెమికల్ దాడి..
బాధితురాలిని MGM ఆసుపత్రికి తరలించిన స్థానికులు..
విచారణ జరుపుతున్న పోలీసులు.
-
Dec 01, 2025 20:50 IST
చాణక్య బెయిల్ పిటిషన్.. వాయిదా వేసిన కోర్టు
విజయవాడ: చాణక్య బెయిల్ పిటిషన్ డిసెంబర్ 5కు వాయిదా
ఏపీ లిక్కర్ కేసులో A8 నిందితుడిగా ఉన్న బునేటి చాణక్య
విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బూనేటి చాణిక్య
-
Dec 01, 2025 20:48 IST
బెయిల్ పిటిషన్.. డిసెంబర్ 5కు వాయిదా
విజయవాడ: IPS సంజయ్ బెయిల్ పిటిషన్.. డిసెంబర్ 5కు వాయిదా..
అగ్నిమాపక శాఖ పరికరాల కొనుగోలులో అవకతవకల ఆరోపణలు..
రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్.
-
Dec 01, 2025 20:47 IST
మండలాలను వేరు చేయొద్దని కడప కలెక్టర్‌కు వినతి..
కడప : సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో ఉంచాలని కలెక్టర్‌కు మండల వాసులు వినతి..
సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే ఉండాలి..
గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కుట్ర పన్నింది: టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి
-
Dec 01, 2025 20:45 IST
సీతక్కకు ఈశ్వరి భాయి అవార్డు..
రవీంద్ర భారతి: మంత్రి సీతక్కకు ఈశ్వరి భాయి అవార్డు..
అవార్డు అందచేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్, ఈశ్వరి భాయి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు..
-
Dec 01, 2025 20:44 IST
వ్యక్తి దారుణ హత్య.. చెరువు కట్ట పక్కన మృతదేహం..
హైదరాబాద్: ఓయూ పీఎస్ పరిధిలో దారుణ హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి..
ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఆటోలో తీసుకువచ్చి తార్నాకలోని ఎర్రకుంట చెరువు కట్ట పక్కకు పడేసిన దుండగులు..
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..
హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు..
ఆటో ఆధారంగా హత్య చేసిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఓయూ పోలీసులు.
-
Dec 01, 2025 20:41 IST
డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఆరా
అమరావతి: తాళ్లవలసలో డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఆరా
తాళ్లవలసలో పరిస్థితిని సీఎంకు వివరించిన వైద్య అధికారులు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మం. తాళ్లవలసలో
వృద్ధుడి మరణానికి కిడ్నీ సమస్యతో పాటు అవయవాలు దెబ్బతిన్నాయన్న వైద్యులు
-
Dec 01, 2025 20:31 IST
మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు..
నంద్యాల: నవంబర్ 19న నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు..
రిటైర్డ్ ఉద్యోగి పుల్లయ్యను హత్య చేసిన నలుగురు నిందితులు అరెస్ట్..
ఇళ్లను అమ్మిన కమీషన్ విషయంలో పుల్లయ్యను హత్య చేసిన కీలక నిందితుడు ధనుంజయ..
వివరాలు వెల్లడించిన ఎస్పీ సునీల్.
-
Dec 01, 2025 20:28 IST
జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు
విజయవాడ: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ కుమారులు.. జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేష్, జోగి రామ్మోహన్‌కు సిట్ నోటీసులు.
విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఈనెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు..
కల్తీ మద్యం కేసులో ఇప్పటికే జోగి రమేష్, జోగి రాము అరెస్టు..
నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి బ్రదర్స్..
తాజాగా జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్న సెట్.
-
Dec 01, 2025 19:54 IST
ఢిల్లీ చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనిత
రేపు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలవనున్న లోకేష్
మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా...
సమగ్ర నివేదికను కేంద్రమంత్రులకు అందించనున్న నేతలు
-
Dec 01, 2025 19:47 IST
విలీన ముసాయిదా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
GHMCలో మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం..
ప్రభుత్వానికి చేరిన ఫైల్.. మరికాసేపట్లో గెజిట్ విడుదల చేయనున్న ప్రభుత్వం..
ఇటీవల 27మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
-
Dec 01, 2025 19:41 IST
న్యూ ఇయర్ వేడుకలకు దరఖాస్తు చేసుకోండి..
న్యూ ఇయర్ వేడుకలకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసుల పర్మిషన్..
న్యూ ఇయర్ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి..
21-12-2025 లోపు మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తులు..
దరఖాస్తులు cybpms.telangana.gov.in వెబ్సైట్ ద్వార చేసుకోవచ్చు..
టికెట్ ఈవెంట్లకు కమర్షియల్/టికెటెడ్ ఫారం ఎంపిక..
టికెట్ లేకుండా జరిగేవాటికి నాన్ కమర్షియల్ ఫారం..
ఫిజికల్ అప్లికేషన్లకు అంగీకారం లేదు. 21వ తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులు పరిగణలోకి తీసుకోం: సైబరాబాద్ పోలీసులు
-
Dec 01, 2025 19:28 IST
వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు భారీగా రిజిస్ట్రేషన్..
తిరుమల: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు ఆన్‌లైన్‌లో భారీగా రిజిస్ట్రేషన్..
మొదటి 3 రోజుల దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా కేటాయింపు..
3 రోజులకు 2 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని TTD అంచనా..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 23.50 లక్షల మంది భక్తులు..
రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయింపు.
-
Dec 01, 2025 19:23 IST
మరో మూడు కేసులు నమోదు
ఐ బొమ్మ రవిపై మరో మూడు కేసులు నమోదు
ఐ బొమ్మ రవిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఐ బొమ్మ రవి బెయిల్‌పై వాదనలు బుధవారానికి వాయిదా
-
Dec 01, 2025 19:22 IST
మూసాపేటలో రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్: మూసాపేటలో రోడ్డు ప్రమాదం..
అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం...
బైక్ పై ప్రయాణిస్తున్న బాలకిషోర్(14) అనే బాలుడు తీవ్రగాయాలతో మృతి., మరో ప్రయాణికుడి గాయాలు...
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
-
Dec 01, 2025 19:20 IST
లిక్కర్ స్కాం కేసులో తొలిరోజు కస్టడీ పూర్తి..
విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో నిందితుడు అనిల్ చోఖర తొలిరోజు కస్టడీ పూర్తి..
లిక్కర్ కేసులో షెల్ కంపెనీలు ఏర్పాటు, మనీ లాండరింగ్ చేసిన అనిల్ చోఖర..
రేపు, ఎల్లుండి కూడా అనిల్ చోఖరను విచారించనున్న సిట్ అధికారులు..
కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖర..
గతంలో అనిల్ చోఖరపై ఈడీ, EWOలో కూడా పలు కేసులు నమోదు.
-
Dec 01, 2025 18:49 IST
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..
అమరావతి: సీఎం చంద్రబాబుపై నమోదైన ఎక్సైజ్ కేసు మూసివేత..
నిరభ్యంతర పత్రం ఇప్పటికే కోర్టుకు అందజేసిన ఫిర్యాదుదారు..
CID దర్యాప్తునకు అంగీకరించి కేసు క్లోజ్ చేసిన ACB కోర్టు..
-
Dec 01, 2025 17:54 IST
బ్రిడ్జి మీద నుంచి దూకిన ప్రేమజంట
పల్నాడు జిల్లా: మాచర్ల మండలం లింగాపురం కాలనీ బొంబాయి కంపెనీ బ్రిడ్జి మీద నుంచి దూకి ప్రేమ జంట వీర్ల గోవర్ధన్, దాసరి లక్ష్మి ఆత్మహత్య.
పెద్ద కాలువలో దాసరి శ్రీలక్ష్మి మృతదేహం లభ్యం.
వీర్ల గోవర్ధన్ గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, కుటుంబ సభ్యులు.
-
Dec 01, 2025 17:52 IST
చందానగర్‌లో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: చందానగర్ పరిధిలో అగ్నిప్రమాదం..
మంటల్లో భవన నిర్మాణ కార్మికులు వేసుకున్న గుడిసెలు దగ్ధం..
SVS నిర్మాణ సంస్థ దగ్గర 50 గుడిసెలు వేసుకున్న కార్మికులు..
-
Dec 01, 2025 17:38 IST
తెలంగాణకు నిధులపై కేంద్రం వివరణ
తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల కేంద్ర నిధులు..
తెలంగాణ నుంచి పన్నుల ద్వారా రూ.4,35,919 కోట్లు కేంద్రానికి రాబడి ..
ఎంపీ అర్వింద్ ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం.
-
Dec 01, 2025 17:31 IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాల దహనమే కారణమన్న కేంద్రంపై మండిపడ్డ సుప్రీంకోర్టు
రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారింది: సుప్రీంకోర్టు
కరోనా సమయంలో రైతులు తమ పంట వ్యర్థాలను తగలపెట్టారు: సుప్రీంకోర్టు
-
Dec 01, 2025 17:28 IST
అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు
అన్నమయ్య జిల్లా : అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు..
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు అల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్..
సీబీఐ, ఈడీ అధికారులమంటూ 48 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
నిందితుల నుండి 32 లక్షల నగదు 25 ఏటిఎమ్ కార్డులు స్వాధీనం..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.
-
Dec 01, 2025 16:05 IST
డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీం సీరియస్
ఢిల్లీ: డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీం సీరియస్
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి ఆదేశం..
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తుకు సీబీఐ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.
-
Dec 01, 2025 15:51 IST
రాజీనామాను ఉపసంహరించుకున్న జఖీయా ఖానం
అమరావతి: శాసనమండలి చైర్మన్ వద్ద వివరణ ఇచ్చాక రాజీనామ ఉపసంహరించుకున్న జఖీయా ఖానం..
తన రాజీనామాను ఉపసంహరణ చేసుకున్నట్టు చైర్మన్ మోషన్ రాజుకు తెలిపిన జకియా ఖానం.
-
Dec 01, 2025 15:18 IST
మేడారం జాతర నిర్వహణపై సీఎం సమీక్ష..
మేడారం జాతర నిర్వహణపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఉన్నతాధికారులు..
మేడారంలో నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు..
గద్దెల దగ్గరలో ఉన్న చెట్లను తొలగించవద్దు: సీఎం రేవంత్ రెడ్డి
నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు..
నిర్మాణంలో చిన్న విమర్శలు తావు ఇవ్వొద్దు..
గద్దెల సమీపంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి..
గద్దెల దగ్గర నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి..
గ్రాండ్ లుక్ వచ్చేలా లైటింగ్ ఏర్పాటు చేయాలి..
గుడి చుట్టు పచ్చదనం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
-
Dec 01, 2025 14:34 IST
జంట హత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్..
పల్నాడు జిల్లా: వెల్లుల్లి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసు..
కోర్టులో లొంగిపోయిన కండ్లగుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకట రెడ్డి..
జంట హత్యల కేసులో ఏ-8 గా ఉన్న వెంకట రెడ్డి..
14 రోజులు రిమాండ్ విధించిన జడ్జి..
గుంటూరు జిల్లా జైలుకు తరలింపు.
-
Dec 01, 2025 13:25 IST
పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత..!
సినీ డైరెక్టర్ రాజ్‌తో సమంత వివాహం
కోయంబత్తూర్‌లోని ఓ ఆశ్రమంలో స్నేహితుల మధ్య పెళ్లి
సమంత-డైరెక్టర్ రాజ్ నిడిమోరు మధ్య ప్రేమపై ఇటీవల వైరల్
-
Dec 01, 2025 13:20 IST
రేపు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ఎల్లుండి పార్లమెంట్‌లో ప్రధాని మోదీ, ఖర్గే, రాహుల్‌ను కలవనున్న రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మాట్లాడాలని..
ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Dec 01, 2025 13:20 IST
HILT పాలసీ పేరిట భారీ స్కామ్‌కు తెరలేపారు: టీబీజేపీ చీఫ్ రాంచందర్
మార్కెట్ ధరం కంటే తక్కువకే భూములు ధారదత్తం చేస్తున్నారు
ప్రభుత్వం పరిపాలన చేస్తోందా? రియల్ వ్యాపారం చేస్తోందా?: రాంచందర్
HILT పాలసీకి వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా
ప్రభుత్వంతో చర్చిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు: రాంచందర్‌రావు
-
Dec 01, 2025 12:50 IST
రేపు మహేష్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం
హాజరుకానున్న ఇన్‌చార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్, మంత్రులు
కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం
-
Dec 01, 2025 12:50 IST
ఐబొమ్మ రవి కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు
మరో 3 కేసుల్లో రవిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు
పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి రేపు నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఇప్పటివరకు రవిపై 5 కేసులు నమోదు
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి
-
Dec 01, 2025 12:49 IST
హైదరాబాద్: గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతల బృందం
HILT పాలసీపై ఫిర్యాదు చేసిన టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై గవర్నర్‌కు వివరణ
HILT పాలసీ కోసం తీసుకొచ్చిన జీవో 27ను రద్దు చేయాలి: బీజేపీ
-
Dec 01, 2025 11:48 IST
మండలి చైర్మన్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీలు..
అమరావతి: శాసన మండలి చైర్మన్‌ను కలిసిన రాజీనామా చేసిన వైసీపీ MLCలు
రాజీనామా అంశంపై వివరణ ఇచ్చిన ఆరుగురు MLCలు
తమ రాజీనామాలు ఆమోదించాలని చైర్మన్‌కు వినతి
చైర్మన్‌ను కలిసిన MLCలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్,..
జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత
-
Dec 01, 2025 11:30 IST
లోక్ సభ వాయిదా..
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మ.12గంటలకు వాయిదా
విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓంబిర్లా అసహనం
అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం: స్పీకర్
ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలి: స్పీకర్
-
Dec 01, 2025 11:11 IST
ఉభయసభలు ప్రారంభం..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం
-
Dec 01, 2025 09:28 IST
అనంతపురం: కానిస్టేబుల్ ప్రకాష్‌కు మళ్లీ అవకాశం
సేవ్ ఏపీ పోలీస్ అంటూ నాడు గళం విప్పిన..
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌పై జగన్ ప్రభుత్వం వేటు
విధుల్లోకి తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు
మరో ముగ్గురు కానిస్టేబుళ్లకూ పోలీసులు అవకాశం
-
Dec 01, 2025 09:28 IST
అమరావతికి లోకేష్..
అమరావతి: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్
నాయకులకు టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు
శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించనున్న మంత్రి లోకేష్
-
Dec 01, 2025 09:27 IST
తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్
చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
నాగపట్నం, పుదుక్కోట్టైలో లోతట్టు ప్రాంతాలు జలమయం
మెరీనా బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరణ
-
Dec 01, 2025 09:27 IST
విశాఖ: స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ భరత్
కైలాసగిరిలో అందుబాటులోకి స్కైవాక్ బ్రిడ్జి
-
Dec 01, 2025 09:27 IST
జమ్మూకశ్మీర్: షాపియాన్ జిల్లా నదిగాంలో NIA దాడులు
ఢిల్లీ పేలుడు కేసులో అనుమానితుల ఇంట్లో తనిఖీలు
పుల్వామాలో మరో అనుమానితుడి నివాసంలో సోదాలు
ఉగ్ర డాక్టర్ల నివాసాల్లోనూ తనిఖీలు చేస్తున్న NIA
-
Dec 01, 2025 09:26 IST
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
కాసేపట్లో పార్లమెంట్ బయట ప్రధాని మోదీ ప్రసంగం
10 కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానున్న కేంద్రం
SIR, ఢిల్లీ పేలుడు, దేశ భద్రతపై చర్చించాలని విపక్షాల డిమాండ్
రైతుల సమస్యలు, ఢిల్లీ వాయు కాలుష్యంపైనా చర్చించాలని డిమాండ్