Breaking News: పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళికి నోటీసులు
ABN , First Publish Date - Aug 19 , 2025 | 08:46 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 19, 2025 21:35 IST
గుంటూరు: పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళికి నోటీసులు
అంబటి మురళికి 41ఏ నోటీసులు ఇచ్చిన తాడేపల్లి పోలీసులు
ఈనెల 21 లేదా 22న విచారణకు రావాలని పేర్కొన్న పోలీసులు
అమరావతి వరదను మళ్లించారని అంబటి మురళి ఆరోపణలు
నీటి పారుదలశాఖ అధికారుల ఫిర్యాదుతో మురళిపై కేసు నమోదు
-
Aug 19, 2025 18:50 IST
శ్రీశైలం ఘాట్ రోడ్‌లో తప్పిన పెను ప్రమాదం..
నాగర్ కర్నూల్: అమ్రాబాద్ మండలం హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై పాతళ గంగ సమీపంలోని ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి.
యాత్రికులకు తప్పిన పెను ప్రమాదం.
భారీగా ట్రాఫిక్ జామ్.
రోడ్డుపై పడ్డ రాళ్ళను తోలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పోలీసులు.
-
Aug 19, 2025 17:33 IST
కేసీఆర్ సంచలన నిర్ణయం..
జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
మాజీ మంత్రి హరీష్ రావు కూడా హైకోర్టును ఆశ్రయించిన వైనం.
వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లు దాఖలు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని వెల్లడి.
ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా సమర్పించిందని ఆరోపణ.
కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి.
-
Aug 19, 2025 17:30 IST
ఐటీ సోదాల్లో మరోక కీలక మలుపు
శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సోదాలు చేస్తున్న ఐటీ బృందాలు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలు.
DSR కంపనీలో పార్ట్‌నర్‌గా ఉన్న వెంకట కృష్ణా రెడ్డి.
భారీగా ప్రాజెక్ట్ నిర్మాణ పత్రాలను, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న ఐటీ.
మరో రెండు రోజులపాటు కొనసాగునున్న ఐటీ సోదాలు.
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధాలు ఉండడంతో ఐటీ శాఖ సోదాలు నిఘా పెట్టినట్లు సమాచారం.
రాజ్ కేసి రెడ్డికి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కి మధ్య లావాదేవీలు ఉన్నట్లు అనుమానం.
-
Aug 19, 2025 15:04 IST
ఆసియా కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
టీమిండియా: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్)
-
Aug 19, 2025 14:31 IST
అమరావతిపై ఏడుపులు ఇకనైనా ఆపండి: మంత్రి నారాయణ
అమరావతిపై ఏడుపులు ఇకనైనా ఆపండి.
లేదంటే మీకు ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు.
నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా..?
గుంతల్లోకి నీరు వస్తె ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా?
పశ్చిమ బైపాస్‌పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయింది.
అది కూడా కేవలం రెండు గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచింది.
మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటకు వెళ్ళిపోయింది.
కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తున్నాం.
NH, ADC అధికారులు, ఇంజనీర్లు కలిసి కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగించే పనుల్లో ఉన్నారు.
ఈ రాత్రికి మొత్తం నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకున్నాం.
రాజధాని మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడండి.
కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు.
-
Aug 19, 2025 13:03 IST
ఇండియా కూటమి అభ్యర్థి ఖరారు..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు చేసిన ఇండియా కూటమి
జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేరు ఖరారు చేసిన ఇండియా కూటమి
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి. సుదర్శన్‌రెడ్డి
-
Aug 19, 2025 13:02 IST
యూరియా సరఫరాపై సీఎం..
తెలంగాణకు అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా..
నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరిని కేంద్రం ప్రదర్శిస్తోంది: Xలో సీఎం రేవంత్‌రెడ్డి
మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ..
కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ వేదికగా రైతుల పక్షాన నిలిచిన..
ప్రియాంక గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు: Xలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 19, 2025 13:02 IST
ఏపీలో నేటి నుంచి P4 పథకం క్షేత్రస్థాయి అమలు ప్రారంభం
P4 స్కీమ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తొలిదశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపిక
మార్గదర్శిల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి
-
Aug 19, 2025 12:20 IST
వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
వివేకా కుమార్తె సునీతపై పెట్టిన కేసు క్వాష్ చేసిన సుప్రీం ధర్మాసనం
వివేకా కుమార్తె, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేసిన ధర్మాసనం
చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే కేసు పెట్టారన్న ధర్మాసనం
తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసిన ధర్మాసనం
తదుపరి దర్యాప్తు అవసరమా లేదో చెప్పాలని సీబీఐని నిర్దేశించిన ధర్మాసనం
దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో చెప్పాలన్న ధర్మాసనం
ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు
మీ మీద ఉన్న గౌరవంతోనే జరిమానా విధించడం లేదని నిందితుల తరపు న్యాయవాదిని హెచ్చరించిన ధర్మాసనం
-
Aug 19, 2025 12:20 IST
వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ
జస్టిస్ M.M సుందరేశ్, జస్టిస్ N.K సింగ్ ధర్మాసనం విచారణ
అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరపు లాయర్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు
సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోంది
వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది: సిద్ధార్ధ లూథ్రా
సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది: సిద్ధార్ధ లూథ్రా
నిందితులు సాక్ష్యులను బెదిరించడమే కాకుండా..
సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు: సిద్ధార్ధ లూథ్రా
సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్‌పైనా కేసు పెట్టారు: లూథ్రా
అవినాశ్‌రెడ్డే వివేకా హత్య కేసులో మాస్టర్‌మైండ్: సిద్ధార్ధ లూథ్రా
సునీత తరపున వాదనలు ముగించిన లాయర్ సిద్ధార్ధ లూథ్రా
నిందితుల బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ
-
Aug 19, 2025 11:18 IST
ఉభయ సభలు ప్రారంభం
పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం
రాజ్యసభ మ. 2 గంటల వరకు వాయిదా
-
Aug 19, 2025 11:18 IST
నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సమావేశానికి హాజరుకానున్న ఎన్డీఏ పార్టీల ఎంపీలు
సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
-
Aug 19, 2025 11:18 IST
నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత
దగ్గుబాటి వెంకటేశ్వరావు చెల్లెలు పద్మజ కన్నుమూత
పద్మజ మృతికి పలువురు ప్రముఖుల సంతాపం
కాసేపట్లో హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
-
Aug 19, 2025 08:46 IST
విమానంలో సాంకేతికలోపం..
హైదరాబాద్-తిరుపతి అలియన్స్ విమానంలో సాంకేతిక లోపం
టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్
తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్
విమానంలో 67 మంది ప్రయాణికులు
-
Aug 19, 2025 08:46 IST
నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సమావేశానికి హాజరుకానున్న ఎన్డీఏ పార్టీల ఎంపీలు
సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ