Breaking News: 83 ఎయిరిండియా విమానాలు రద్దు..
ABN , First Publish Date - Jun 17 , 2025 | 07:14 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 17, 2025 21:51 IST
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారులతో DGCA భేటీ
విమానాలు, ప్రయాణికుల భద్రతపై ప్రధానంగా చర్చ.
7 కీలక అంశాలపై అధికారులతో DGCA సమావేశం.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత 83 ఎయిరిండియా విమానాలు రద్దు.
విమానాలు, ప్రయాణికుల భద్రతపై దృష్టిసారించాలని DGCA ఆదేశం.
-
Jun 17, 2025 20:20 IST
అమరావతి: సర్క్యులర్ ఎకానమీ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
అక్టోబర్ 2 నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో ప్లాస్టిక్‌పై నిషేధం
మరో 17 కార్పొరేషన్లలోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అరికట్టాలి: సీఎం
87 పట్టణాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్లు: చంద్రబాబు
-
Jun 17, 2025 19:41 IST
చిత్తూరు: కుప్పం బాధితురాలికి సీఎం చంద్రబాబు ఫోన్
నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామన్న చంద్రబాబు
బాధితురాలి పిల్లల చదువుకి రూ.5లక్షల ఆర్ధిక సాయం: చంద్రబాబు
మరోమారు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు
నిందితులు ఎంతటివారైనా శిక్షిస్తామన్న సీఎం చంద్రబాబు
-
Jun 17, 2025 18:20 IST
అమరావతి: ప్రణాళిక శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష..
ప్రణాళిక శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.
ప్లానింగ్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష.
ఏపీ ఎకానమీ, గ్రోత్ డ్రైవర్స్, జీఎస్డీపీ ప్రొజెక్షన్స్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్లపై సమీక్ష.
2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయికి మించి ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడి.
2024-25కు జాతీయ స్థాయిలో సరాసరి తలసరి ఆదాయం 8.7 శాతంగా ఉంటే.. ఏపీ 11.89 శాతం నమోదు చేసిందని తెలిపిన అధికారులు.
తలసరి ఆదాయం, జీఎస్డీపీ, రాష్ట్రాదాయాలు ఎలా పెరుగుతాయనే అంశంపై అంచనాలు రూపొందించాలన్న సీఎం.
రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలనే దానిపై డేటా అనలిటిక్స్ చేయాలన్న సీఎం చంద్రబాబు.
సేవల రంగం అభివృద్ధి జరిగేలా దృష్టి పెడితే ఆర్థిక సుస్థిరతను సాధించగలమన్న ముఖ్యమంత్రి.
గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్ర స్థాయిలో పోటీ తత్వం పెరుగుతందని చెప్పిన సీఎం చంద్రబాబు.
15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు చేయడంతో పాటు.. పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం ఆదేశం.
-
Jun 17, 2025 17:13 IST
బెంగళూరు పోలీసుల అదుపులోనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఏపీ పోలీసులకు చెవిరెడ్డిని అప్పగించనున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు
ఇంకా బెంగళూరు చేరుకోని ఏపీ పోలీసులు
-
Jun 17, 2025 14:02 IST
పాడి కౌశిక్ రెడ్డి కేసు.. హైకోర్టులో విచారణ..
పాడి కౌశిక్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 23కి వాయిదా
కౌంటర్ దాఖలు చేయాలని పీపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కోరిన కౌశిక్‌రెడ్డి
కౌశిక్‌రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు
-
Jun 17, 2025 14:02 IST
అమెరికా బయల్దేరిన ట్రంప్..
G-7 సదస్సు మధ్య నుంచే అమెరికా బయల్దేరిన ట్రంప్
అమెరికా భద్రతా మండలితో సమావేశం కానున్న ట్రంప్
భేటీకి సిద్ధంగా ఉండాలని భద్రతామండలికి ట్రంప్ ఆదేశం
ఇరాన్‌లో ఏదో జరగబోతోందని భయాందోళనలు
సిట్యుయేషన్ రూమ్ సిద్ధం చేయించిన డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్‌ను వెంటనే వీడాలని భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ
టెహ్రాన్ నుంచి ఆఫ్ఘన్ మీదుగా స్వదేశానికి భారతీయులు
-
Jun 17, 2025 14:00 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సంచలన విషయాలు..
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు
హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్
BRS ప్రత్యర్థి పార్టీలతో పాటు ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు
తెలంగాణ, ఏపీలో 1000 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు
తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్
-
Jun 17, 2025 13:27 IST
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు
అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్
షర్మిల ఫోన్లు ట్యాప్ కోసం కోడ్ భాష వాడినట్లు గుర్తింపు
ఏపీలో వైసీపీ హయాంలోనే షర్మిల ఫోన్లు ట్యాప్
షర్మిల ఫోన్ సంభాషణలు ఎప్పటికప్పుడు జగన్‌కు సమాచారం
గతంలో షర్మిల మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా నిఘా పెట్టినట్లు గుర్తింపు
గతంలో షర్మిల మనుషులను పిలిపించి ఓ పోలీస్ ఉన్నతాధికారి వార్నింగ్
తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గతంలోనే గుర్తించిన షర్మిల
తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల దగ్గర కీలక సమాచారం
-
Jun 17, 2025 12:45 IST
టేకాఫ్‌కు ముందే..
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం
టేకాఫ్‌కు ముందే విమానంలో సాంకేతికలోపం
విమాన సర్వీస్ రద్దు చేసిన ఎయిరిండియా
-
Jun 17, 2025 12:37 IST
రిమాండ్ పొడిగింపు..
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
జులై 1 వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ ఏసీబీ కోర్టు
రాజ్ కసిరెడ్డి, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ పొడిగింపు
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప రిమాండ్ పొడిగింపు
-
Jun 17, 2025 12:37 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ
సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ వాంగ్మూలం నమోదు చేసిన సిట్
గత BRS ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని మహేష్‌గౌడ్ ఆరోపణ
సాక్షిగా గద్వాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత వాంగ్మూలం నమోదు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత
-
Jun 17, 2025 12:14 IST
పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు మూసివేత
సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖతార్ ఎయిర్‌పోర్టులు మూసివేత
కువైట్, ఒమన్, లెబనాన్, యూఏఈలో ఎయిర్‌పోర్టులు మూసివేత
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు
విమానాల నిలిపివేతతో వేలాదిమంది ప్రయాణికుల ఇక్కట్లు
-
Jun 17, 2025 12:14 IST
వైసీపీ నేత చెవిరెడ్డికి ఝలక్..
బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డికి ఝలక్
కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
లుకౌట్ నోటీసుల కింద చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
చెవిరెడ్డిపై కోర్టు నోటీసులు ఉండడంతో అడ్డుకున్న పోలీసులు
-
Jun 17, 2025 12:14 IST
క్కర్ స్కాం కేసు.. ఏసీబీ కోర్టుకు..
విజయవాడ ఏసీబీ కోర్టుకు లిక్కర్ స్కాం కేసు నిందితులు
కోర్టుకు రాజ్ కసిరెడ్డి, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి
కోర్టుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప
-
Jun 17, 2025 12:14 IST
చివరి దశకు చేరిన మృతుల గుర్తింపు..
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ
DNA ద్వారా ఇప్పటివరకు 135 మృతదేహాలు గుర్తింపు
కుటుంబ సభ్యులకు 101 మృతదేహాలు అప్పగింత
-
Jun 17, 2025 12:14 IST
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్‌కు మహేష్‌గౌడ్ వాంగ్మూలం
జూబ్లీహిల్స్ పీఎస్‌లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తల యత్నం
కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు, తోపులాట
-
Jun 17, 2025 10:24 IST
భారీ వర్షాలకు 18 మంది మృతి..
మహారాష్ట్రలో భారీ వర్షాలకు 18 మంది మృతి
ముంబైలో నీటమునిగిన లోతట్టుప్రాంతాలు
ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్
-
Jun 17, 2025 10:23 IST
జూరాలకు వరద నీరు..
జూరాల ఇన్‌ఫ్లో 46,866, అవుట్ ఫ్లో 33,255 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
జూరాల ప్రస్తుత నీటిమట్టం 317.760 మీటర్లు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు
-
Jun 17, 2025 07:18 IST
లిక్కర్ స్కామ్ అప్డేట్..
విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ
లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల రిమాండ్
కోర్టుకు హాజరుకానున్న ఏడుగురు నిందితులు
-
Jun 17, 2025 07:16 IST
మళ్లీనా..!
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై రావాల్సిన విమానం
భద్రత దృష్ట్యా ప్రయాణికులను దించేసిన సిబ్బంది
-
Jun 17, 2025 07:16 IST
ఢిల్లీకి మంత్రి లోకేశ్..
నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేశ్
ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్న లోకేశ్
రేపు ఢిల్లీ నుంచి విశాఖకు మంత్రి లోకేశ్
-
Jun 17, 2025 07:16 IST
వీడిన వలసదారులు..
అమెరికాను వీడిన పదిలక్షల మంది వలసదారులు
వలసదారులపై ట్రంప్ చర్యల సత్ఫలితాలంటున్న US మీడియా
పది లక్షల మంది అమెరికాను వీడినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాలు
-
Jun 17, 2025 07:14 IST
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారత ప్రభుత్వం కీలక చర్యలు
ఇరాన్‌లోని భారతీయ విద్యార్థుల తరలింపునకు భారత్ ఏర్పాట్లు
విద్యార్థుల తరలింపునకు ఇరాన్‌లోని భారత ఎంబసీ సన్నాహాలు
100 మందితో భారత్‌కు బయల్దేరిన విద్యార్థుల ఫస్ట్ బ్యాచ్
ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భారత ఎంబసీ