Breaking News: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు..
ABN , First Publish Date - Jul 01 , 2025 | 02:46 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jul 01, 2025 18:10 IST
సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు
పాశమైలారం ప్రమాదాన్ని మానవతా దృక్పథంతో చూడాలి: సీఎం
ఇప్పటివరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారు?: సీఎం రేవంత్ రెడ్డి
ప్రమాదం జరిగి 24 గంటలైనా యాజమాన్యం స్పందించలేదు: సీఎం
ఘటనాస్థలంలోకి యాజమాన్యం ఎందుకు రాలేదు?: సీఎం రేవంత్ రెడ్డి
యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 01, 2025 18:10 IST
సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించిన సీఎం
సిగాచి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా?: సీఎం రేవంత్ రెడ్డి
బాయిలర్ల పనితీరును పరిశీలించారా?: సీఎం రేవంత్ రెడ్డి
ప్రమాదానికి కచ్చితమైన కారణాలు నాకు తెలియాలి: రేవంత్ రెడ్డి
ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలి: రేవంత్ రెడ్డి
ప్రమాదంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించండి: సీఎం రేవంత్ రెడ్డి
ఊహాజనిత జవాబులు వద్దు... వాస్తవాలు తెలపండి: రేవంత్ రెడ్డి
-
Jul 01, 2025 18:10 IST
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
సంగారెడ్డి: పాశమైలారం ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రమాద స్థలంలోనే మంత్రులు, అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం
-
Jul 01, 2025 18:05 IST
వంశీకి బెయిల్ మంజూరు..
కృష్ణా: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసిన నూజివీడు కోర్టు
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ
ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ మంజూరు
-
Jul 01, 2025 15:21 IST
ఆ విధ్వంసం ఎప్పుడూ చూడలేదు..
వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు
సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం: సీఎం చంద్రబాబు
విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పాం: చంద్రబాబు
గతంలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: సీఎం
గతంలో వ్యవస్తలన్నీ పడకేశాయి.. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: సీఎం
అభివృద్ధి చేస్తాం.. సంపద సృష్టిస్తాం.. ఆదాయం పెంచుతాం: సీఎం
పెరిగిన ఆదాయం పేదలకు పంచి అభివృద్ధికి ఖర్చు పెడతాం: చంద్రబాబు
-
Jul 01, 2025 15:21 IST
విధ్వంసం నుంచి వికాసం వైపు..
తూ.గో.: మలకపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
డప్పు కళాకారుడు పోశిబాబుకు పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు
పేదలను ఆదుకునేలా 'పేదల సేవలో' కార్యక్రమం చేపట్టాం: చంద్రబాబు
ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పెన్షన్లే ప్రధాన కారణం
గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పెన్షన్లు సరిగా ఇవ్వలేదు: చంద్రబాబు
విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పాం: సీఎం చంద్రబాబు
-
Jul 01, 2025 15:19 IST
ఆదుకున్న పవన్..
సినీ నటి శ్రీమతి వాసుకి(పాకీజా)కి పవన్‌కల్యాణ్ ఆర్థికసాయం
నటి దీనస్థితికి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
వాసుకిని జనసేన కేంద్ర కార్యాలయానికి తీసుకు వచ్చిన నేతలు
పవన్‌కల్యాణ్ తరఫున రూ.2లక్షలు ఆర్థికసాయం అందజేసిన జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
-
Jul 01, 2025 15:19 IST
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్..
అమరావతి: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
నటి వాసుకికి పవన్‌కల్యాణ్ ఆర్థికసాయం
జనసేన కేంద్ర కార్యాలయంలో రూ.2 లక్షలు అందజేత
-
Jul 01, 2025 14:49 IST
ఎగిరే రోబో..
ప్రపంచంలో తొలిసారి ఎగిరే రోబో అభివృద్ధి
ఎగిరే రోబోను అభివృద్ధి చేసిన ఇటలీ శాస్త్రవేత్తలు
విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల్లో వినియోగించేలా మేకింగ్
బేబీ ఫేస్ అమర్చడంతో అది వింతగా కనిపిస్తోదని నెటిజన్లు ట్రోల్స్
-
Jul 01, 2025 14:46 IST
భారీ పేలుడు..
తమిళనాడు: బాణసంచా కేంద్రంలో పేలుడు
విరుధ్‌నగర్ జిల్లా చిన్నక్కమన్‌పట్టిలో పేలుడు
బాణసంచా పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలు
-
Jul 01, 2025 14:46 IST
భారీ వర్షాలు..
ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు
హిమాచల్‌ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
క్లౌడ్ బరస్ట్‌తో గోహర్ ఏరియాలో 9 మంది గల్లంతు
గల్లంతైన వారికోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
గోహర్, కర్సోగ్ ప్రాంతాల్లో SDRF, NDRF సహాయక చర్యలు
కులు, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్