
Breaking News: సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్..
ABN , First Publish Date - Jun 26 , 2025 | 07:31 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 26, 2025 17:56 IST
మారితే మారండి.. మారకపోతే రాష్ట్రంలో ఉండే అర్హత లేదు: చంద్రబాబు
గంజాయి నిర్మూలన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు.
ప్రతిపక్షాలు కూడా ముందుకువచ్చి ప్రజల్లో చైతన్యం తేవాలి.
చైతన్యం తెచ్చి ఓట్లు కోరాలి తప్ప రాజకీయ లబ్ధి పొందుతామంటే కుదరదు.
ఈగల్ పేరుతో గంజాయిపై రాష్ట్రవ్యాప్తంగా డేగకన్ను.
26 జిల్లాల్లో నార్కొటిక్ సెల్స్ ఏర్పాటు.
ఈగల్ సెల్స్, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
స్కూళ్లలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు.
మద్యం ఆదాయంలో 2 శాతాన్ని నిర్మూలనకు ఖర్చు.
-
Jun 26, 2025 17:54 IST
సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్..
లా అండ్ ఆర్డర్‌లో చాలా సమస్యలు చూశా.
రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ.
రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదు.
మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం.
రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్ చేస్తాం.
గంజాయి సాగుతో దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
ఏపీ బ్రాండ్‌ను గత పాలకులు నాశనం చేశారు.
డ్రగ్స్, గంజాయిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నా.
అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం.. వదిలిపెట్టం.
గంజాయి ఎవరు వాడినా వదిలిపెట్టం.
-
Jun 26, 2025 11:47 IST
ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
పెండింగ్‌లో ఉన్న రూ.180.30కోట్ల మెడికల్ బకాయిలు క్లియర్
26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట
గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులనూ క్లియర్ చేసిన ప్రభుత్వం
నిధులు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన
-
Jun 26, 2025 11:38 IST
రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శ్రీకారం: పవన్ కల్యాణ్
రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం: పవన్ కల్యాణ్
పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు: పవన్
అఖండ గోదావరి ప్రాజెక్టుతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది: పవన్
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం ఒక పదం కాదు: పవన్ కల్యాణ్
డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయి: పవన్
అఖండ గోదావరి పూర్తయితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది: పవన్
2027 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి: పవన్ కల్యాణ్
అఖండ గోదావరి ప్రాజెక్టును పర్యటకంగా తీర్చిదిద్దుతాం: పవన్ కల్యాణ్
-
Jun 26, 2025 10:50 IST
వికసిత్ భారత్‌లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం: పురంధేశ్వరి
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి సాధ్యం: పురంధేశ్వరి
ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తోంది: పురంధేశ్వరి
-
Jun 26, 2025 10:49 IST
రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర అఖండ గోదావరి ప్రాజెక్టు
అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్రమంత్రి షెకావత్, పవన్ శంకుస్థాపన
పుష్కరఘాట్ దగ్గర రూ.94.44 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు
పుష్కరాల నాటికి పూర్తికానున్న అఖండ గోదావరి ప్రాజెక్టు
హాజరైన మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్, ఎంపీ పురందేశ్వరి
-
Jun 26, 2025 10:49 IST
NIA సోదాలు
మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో NIA సోదాలు
పంజాబ్, హర్యానా, యూపీలో NIA తనిఖీలు
ఉగ్రకుట్ర కేసులో NIA అధికారుల సోదాలు
-
Jun 26, 2025 10:49 IST
హైకోర్టుకు పెద్దిరెడ్డి..
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి కోర్టు అనుమతి
పెద్దారెడ్డిని తాడిపత్రికి అనుమతించని పోలీసులు
అనంతపురం SP జగదీష్, తాడిపత్రి CI సాయిప్రసాద్‌పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసిన పెద్దారెడ్డి
-
Jun 26, 2025 10:49 IST
ఖమ్మం జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు
మంత్రి పొంగులేటి సిబ్బందికి సిట్ అధికారులు ఫోన్
విచారణకు రావాలని పొంగులేటి సిబ్బందికి సిట్ పిలుపు
పొంగులేటి సహా అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తింపు
గత ఎన్నికల వేళ పొంగులేటి కదలికల కోసం ఫోన్లు ట్యాప్
పలువురు ఖమ్మం జర్నలిస్టులకూ సిట్ నోటీసులు
-
Jun 26, 2025 08:45 IST
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ముగించా: ట్రంప్
వరుస ఫోన్ కాల్స్‌తో యుద్ధం ఆపాను: ట్రంప్
భారత్-పాక్ ఒకరికొకరు పోరాడితే ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోం అని చెప్పా: ట్రంప్
భారత్, పాక్ వాణిజ్య ఒప్పందమే కోరుకున్నాయి: ట్రంప్
ప్రధాని మోదీ నాకు గొప్ప స్నేహితుడు: ట్రంప్
-
Jun 26, 2025 08:45 IST
వారాహి ఉత్సవాలు..
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి నెలపాటు వారాహి ఉత్సవాలు
జులై 8, 9, 10 తేదీల్లో శాకాంబరీ ఉత్సవాలు
తెలంగాణ నుంచి ఈనెల 29న అమ్మవారికి బంగారు బోనం సమర్పణ
-
Jun 26, 2025 08:45 IST
న్యూడ్ వీడియోల వ్యాపారం..
హైదరాబాద్: అంబర్‌పేట్‌లో దంపతుల న్యూడ్ వీడియోల వ్యాపారం
ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న దంపతులు
డబ్బు ఇచ్చిన వారికి ఆన్‌లైన్‌లో లైవ్ లింక్
-
Jun 26, 2025 07:36 IST
సీఎం పర్యటన..
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
యాంటీ నార్కోటిక్ డే ర్యాలీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Jun 26, 2025 07:36 IST
కొనసాగుతున్న విచారణ..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కొనసాగుతున్న విచారణ
చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ
నిందితుల బెయిల్ పిటిషన్ల పైనా విచారించనున్న ACB కోర్టు
-
Jun 26, 2025 07:36 IST
కేంద్రమంత్రి పర్యటన..
రాజమండ్రిలో నేడు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి అఖండ గోదావరి, సైన్స్ సెంటర్..
ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న షెకావత్
-
Jun 26, 2025 07:31 IST
ఘోరం..
మెక్సికోలో కాల్పుల కలకలం
12 మంది మృతి, 20 మందికి గాయాలు
గ్వానాజువాటోలో దుండగుల కాల్పులు