Breaking News: తెలంగాణ మెడికోలకు గుడ్ న్యూస్
ABN , First Publish Date - Jun 29 , 2025 | 08:25 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 29, 2025 21:55 IST
తెలంగాణ మెడికోలకు గుడ్ న్యూస్
మెడికోల స్టైఫండ్ 15శాతం పెంపు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన జూడాలు.
జూడాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రి దామోదర.
కాసేపట్లో సంగారెడ్డిలో మంత్రితో జూడాల చర్చలు.
జూడాలతో చర్చలకు ముందే ప్రభుత్వం కీలక నిర్ణయం.
15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు.
-
Jun 29, 2025 21:50 IST
శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం
లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్
ప్రసాదంలో బొద్దింక విషయాన్ని ఖండించిన ఆలయ ఈఓ శ్రీనివాసరావు
లడ్డూ విషయంలో భక్తులు అసత్యాలు నమ్మొద్దు: ఈఓ శ్రీనివాసరావు
-
Jun 29, 2025 20:12 IST
పూర్ణ చందర్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
పూర్ణ చందర్‌ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు.
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ రిమాండ్.
పూర్ణ చందర్ కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో జోగిని పల్లి సంతోష్ రావు పేరు.
తనకు సంబందించిన అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసని చెప్పిన పూర్ణ చందర్.
-
Jun 29, 2025 18:17 IST
బీజేపీ తెలంగాణ కొత్త చీప్ నియామకంపై ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్.
కొత్త అధ్యక్షుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి.
నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే యోగి ఆదిత్య నాథ్ తరహాలో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తా.
ఎవరికి పడితే వారికి అధ్యక్షుడిగా ఛాన్స్ ఇవ్వొద్దు.
నేను అధ్యక్షుడు కాకుండా ఓ వర్గం అడ్డుకుంటుంది.
అయినప్పటికీ కార్యకర్తల అభీష్టం మేరకు రేపు నేను నామినేషన్ వేస్తాను.
-
Jun 29, 2025 17:19 IST
BRS సర్కార్ పదేళ్లలో భారీ అవినీతికి పాల్పడింది: అమిత్ షా
ధరణి, కాళేశ్వరంతో కేసీఆర్ కుటుంబం కోట్లు కొల్లగొట్టింది.
రేవంత్ సర్కార్ కూడా అవినీతిలో కూరుకునపోయింది.
యురి, పుల్వామా, పహల్గామ్ ఉగ్రదాడులకు దీటుగా బదులిచ్చాం.
పాక్ గడ్డపైకి వెళ్లి మరీ గట్టిగా బుద్ధి చెప్పాం.
2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్.
మావోయిస్టులు హత్యాకాండ విడిచి తక్షణం లొంగిపోవాలి.
-
Jun 29, 2025 16:50 IST
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి: లోకేష్
ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలి.
వైసీపీ నేతల అహంకారం వల్లే 11 సీట్లకు పడిపోయారు.
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించవద్దు.
టీడీపీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలి.
టీడీపీలో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తాం.
జులై 5 నాటికి పార్టీ సంస్థాగత కమిటీలన్నీ పూర్తిచేయాలి.
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి.
-
Jun 29, 2025 12:10 IST
ఇంకా చేయాల్సింది చాలా ఉంది: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన 75 పథకాలు పునరుద్ధరించాం: చంద్రబాబు
ప్రజలు పెట్టిన ఆకాంక్షలను మనం కాపాడుకోవాలి: చంద్రబాబు
రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకున్నాం: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో రాష్ట్రం బాగా దెబ్బతింది: చంద్రబాబు
ఐదేళ్లపాటు కేంద్రం నిధులను పక్కదారి పట్టించారు: చంద్రబాబు
-
Jun 29, 2025 12:10 IST
2014-19 మధ్య ప్రజల అనుమానాలు తొలగించాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు
ఏవి అమలు చేశామో ప్రజలకు చెప్పాలి: సీఎం చంద్రబాబు
గత పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది: చంద్రబాబు
కేంద్రం నిధులను పక్కదారి పట్టించారు: సీఎం చంద్రబాబు
ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశాం: సీఎం చంద్రబాబు
-
Jun 29, 2025 12:10 IST
ఏ ప్రభుత్వం అయినా చేసిన పనులు చెప్పుకోవాలి: సీఎం చంద్రబాబు
ప్రజల్లోకి వెళ్లడంలో నామోషీ పడకూడదు: సీఎం చంద్రబాబు
ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే అంత ఆదరిస్తారు: సీఎం చంద్రబాబు
చేసిన మంచిని పదేపదే చెప్పుకోవాలి: సీఎం చంద్రబాబు
భవిష్యత్తుపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి: సీఎం చంద్రబాబు
ప్రజల్లో విశ్వాసం వల్లే కూటమి విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
సంక్షేమం అంటేనే టీడీపీ గుర్తుకు వస్తుంది: సీఎం చంద్రబాబు
పరిపాలనకు అర్థం మార్చిన పార్టీ టీడీపీ: చంద్రబాబు
రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
-
Jun 29, 2025 12:10 IST
రాజస్థాన్: భరత్‌పూర్‌లో విషాదం
పైప్‌లైన్ పనులు చేస్తుండగా కూలిన మట్టి దిబ్బలు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Jun 29, 2025 11:56 IST
కొనసాగుతున్న వరద..
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద
పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం 1622.12 అడుగులు
ఇన్ ఫ్లో 64,500 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 202 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 67.473 టీఎంసీలు
-
Jun 29, 2025 11:16 IST
నోటిఫికేషన్ విడుదల..
ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
రేపు మధ్యాహ్నం ఒంటి వరకు నామినేషన్ల స్వీకరణ
రేపు సా. 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఎల్లుండి ఏపీ బీజేపీ అధ్యక్ష ప్రకటన
-
Jun 29, 2025 11:16 IST
హైదరాబాద్: గోల్కొండలో ఘనంగా బోనాలు
జగదాంబిక అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు
బోనాల సమర్పించేందుకు ప్రత్యేక క్యూలైన్
1500 మంది పోలీసులతో బోనాలకు బందోబస్తు
గోల్కొండ పరిధిలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
-
Jun 29, 2025 09:39 IST
చార్‌ధామ్ యాత్రకు బ్రేక్
ఉత్తరాఖండ్: చార్‌ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
భారీ వర్షాలతో యాత్ర 24 గంటలపాటు నిలిపివేసిన ప్రభుత్వం
యాత్రికుల భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం
-
Jun 29, 2025 08:29 IST
వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు..
వరంగల్: భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు
భద్రకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
కురుకుల్లా క్రమంలో దర్శనమిస్తున్న భద్రకాళిఅమ్మవారు
సాయంత్రం బేరుండా క్రమంలో దర్శనమివ్వనున్న అమ్మవారు
-
Jun 29, 2025 08:29 IST
కడప: సర్కార్ మారినా తీరుమారని పోలీసులు
ఇంకా జగన్ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో పోలీసులు
వైసీపీ నేతల కోసం సంబంధం లేని సివిల్ కేసుల్లో జోక్యం
జగన్ సన్నిహితుడి వ్యాపారంలో బెంగళూరు వాసులకు బెదిరింపులు
సంబంధం లేని కేసులో పోలీసుల సెటిల్‌మెంట్?
పోలీస్ అధికారి ఇంట్లో నడిచిన వ్యవహారం
అర్బన్ స్టేషన్‌లో కేసు.. రూరల్ సీఐ జోక్యం
నోటీసులు ఇచ్చినట్టు ఒప్పుకొన్న సీఐ రమణ
-
Jun 29, 2025 08:28 IST
ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వచ్చేవారంలోపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ: ట్రంప్
ఇరుదేశాల నేతలతో మాట్లాడినట్టు తెలిపిన ట్రంప్
-
Jun 29, 2025 08:28 IST
కోల్‌కతా: గ్యాంగ్ రేప్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
నలుగురికి అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు
విచారణకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు
గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు
ఈనెల 25న సౌత్ కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
-
Jun 29, 2025 08:28 IST
హైదరాబాద్: నేడు జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం
మంత్రి పొన్నం అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం
జులై 4న మల్లికార్జున ఖర్గే రానున్న నేపథ్యంలో భేటీ
హైదరాబాద్ సభ విజయవంతంపై నేతలకు పొన్నం దిశా నిర్దేశం
-
Jun 29, 2025 08:28 IST
సీఎం రేవంత్ సమీక్ష..
నేడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై సీఎం రేవంత్ సమీక్ష
హాజరుకానున్న మంత్రి తుమ్మల, ఉన్నతాధికారులు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం విధివిధానాలపై చర్చ
-
Jun 29, 2025 08:27 IST
విస్తృతస్థాయి సమావేశం..
అమరావతి: నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
కూటమి ఏడాది పాలనపై చంద్రబాబు అధ్యక్షతన భేటీ
నేడు ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశం
జులై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా కార్యక్రమానికి శ్రీకారం
ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు వివరించనున్న నేతలు
-
Jun 29, 2025 08:25 IST
అమిత్ షా పర్యటన..
నేడు నిజామాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
ఉ.11:25కు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు పయనం
మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్ షా
మ.1:45కు ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ కలెక్టరేట్‌కు అమిత్ షా
మ.2 గంటలకు పసుపుతబోర్డు ఆఫీసును ప్రారంభించనున్న అమిత్ షా
2:35కు నిజామాబాద్ కంఠేశ్వర్ క్రాస్‌రోడ్‌లో డీఎస్ విగ్రహావిష్కరణ
2:45కు పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో కిసాన్ మహాసభకు అమిత్ షా హాజరు
సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి అమిత్ షా తిరుగు పయనం