Breaking News: మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్
ABN , First Publish Date - Jun 16 , 2025 | 12:25 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 16, 2025 18:31 IST
ఇదో లొట్టపీసు కేసు: కేటీఆర్..
ఫార్ములా-ఈ కార్ రేసులో పైసా అవినీతి జరగలేదు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తప్పు చేయలేదు.. తలదించుకునే పరిస్థితి లేదు: కేటీఆర్
కావాలనే కుట్రతో కమిషన్ ఏర్పాటు చేశాడు: కేటీఆర్
లై డిటెక్టర్ పరీక్షకు సవాల్ విసిరితే పారిపోయాడు: కేటీఆర్
ఇదో లొట్టపీసు కేసు: కేటీఆర్
విచారణలో పనికిమాలిన ప్రశ్నలు తప్ప ఏమీ లేవు: కేటీఆర్
రేవంత్‌రెడ్డి నన్నేమీ పీకలేరు: కేటీఆర్
అయితే గీతే 15 రోజులు జైల్లో పెడతారేమో?: కేటీఆర్
-
Jun 16, 2025 18:20 IST
రైతును రాజుగా చేయడమే కాదు..వ్యవసాయాన్ని పండుగ చేస్తాం: రేవంత్‌రెడ్డి
రుణమాఫీ చేయకుండా రైతులను BRS ప్రభుత్వం మోసం చేసింది: రేవంత్‌రెడ్డి
దిగజారిన ఆర్థిక వ్యవస్థను మాకు అందించారు: రేవంత్‌రెడ్డి
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలుచేస్తున్నాం: రేవంత్‌రెడ్డి
రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారు: రేవంత్‌రెడ్డి
వరి సాగుచేస్తే ఉరివేసుకోవాల్సిందేనని గతంలో చెప్పారు: రేవంత్‌రెడ్డి
రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నాం: రేవంత్‌రెడ్డి
-
Jun 16, 2025 17:53 IST
మంత్రుల భేటీ.. ఏం నిర్ణయించారంటే..
హైదరాబాద్: మంత్రుల భేటీలో స్థానిక ఎన్నికలపై ప్రధానంగా చర్చ
మంత్రులు, ఇన్‌చార్జ్‌లతో సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశం
ఈ నెలాఖరు వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం
స్థానిక ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
రైతు భరోసా వేయగానే విస్తృత ప్రచారం కల్పించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Jun 16, 2025 17:52 IST
రేపటి నుంచే రైతు భరోసా..!
రేపటి నుంచి తెలంగాణలో రైతు భరోసా
ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
-
Jun 16, 2025 17:50 IST
నా కెరీర్‌లో ఎన్నో సంక్షోభాలు చూశా: టాటా సన్స్ చైర్మన్
ఎయిరిండియా ఉద్యోగులకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సందేశం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నా కెరీర్‌లో హృదయ విదారకమైంది
విమాన ప్రమాదంతో టాటా గ్రూప్‌లో విషాదఛాయలు: చంద్రశేఖరన్
-
Jun 16, 2025 17:50 IST
విశాఖ: పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం: సీఎం చంద్రబాబు
సెక్రటేరియట్ యూనిట్‌గా సిబ్బంది పర్యవేక్షణపై ఏర్పాట్లు: చంద్రబాబు
క్షేత్ర స్థాయిలో ఇతర సిబ్బందిని నియమిస్తే జవాబుదారీ ఉండదు
సెక్రటేరియట్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలి
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు: సీఎం చంద్రబాబు
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు: చంద్రబాబు
యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నాం: చంద్రబాబు
దాదాపు 3.4 లక్షల మందికి ఒకేచోట ఏర్పాట్లు: సీఎం చంద్రబాబు
-
Jun 16, 2025 17:48 IST
మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్
2019 నాటి కేసు విషయంలో పేర్ని నానికి అరెస్ట్ వారెంట్
2019లో టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదుచేసిన పోలీసులు
టీడీపీ కార్యకర్తల కేసులో సాక్షిగా పేర్ని నాని
వరుస వాయిదాలకు కోర్టుకు హాజరుకాని పేర్ని నాని
తదుపరి విచారణ సెప్టెంబర్ 19కి వాయిదావేసిన కోర్టు
-
Jun 16, 2025 17:48 IST
ఫార్ములా-ఈ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ
కేటీఆర్‌ను 7 గంటలు ప్రశ్నించిన ACB
నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై విచారణ
కేటీఆర్‌కు 60కి పైగా ప్రశ్నలు సంధించిన ముగ్గురు ACB అధికారులు
FEO స్టేట్‌మెంట్ ఆధారంగా ACB ప్రశ్నలు
-
Jun 16, 2025 13:37 IST
రొయ్యూరులో ఉద్రిక్తత..
ములుగు: ఏటూరునాగారం మండలం రొయ్యూరులో ఉద్రిక్తత
అటవీభూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులు
గుడిసెలు తొలగించేందుకు అటవీశాఖ, పోలీసులు యత్నం
అధికారులను అడ్డుకున్న గిరిజనులు, వాగ్వాదం
-
Jun 16, 2025 13:30 IST
హైకోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
టీజీ హైకోర్టులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిటిషన్
యెన్నం, రాజేష్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మురళినాయక్ పిల్
ఖాజాగూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ పిల్
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
-
Jun 16, 2025 13:30 IST
ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ..
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి టీజీ హైకోర్టులో ఎదురుదెబ్బ
కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
కౌశిక్‌రెడ్డిపై గ్రానైట్ వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు
రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారని ఫిర్యాదు
కేసు కొట్టివేయాలని కౌశిక్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
-
Jun 16, 2025 12:42 IST
విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు
ఈనెల 21న యోగా డేపై కాసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్ష
మంత్రుల కమిటీ, అధికారులతో సమీక్షించనున్న చంద్రబాబు
ఆర్కే బీచ్ రోడ్‌లో యోగా డే ఏర్పాట్లు పరిశీలించనున్న చంద్రబాబు
సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
ఏపీ టీడీపీ చీఫ్ పల్లా కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు
-
Jun 16, 2025 12:42 IST
పొగాకు రైతుల రాస్తారోకో..
ప్రకాశం: హనుమాన్‌జంక్షన్ కుంట దగ్గర పొగాకు రైతుల రాస్తారోకో
బర్లీ పొగాకు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన
జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
-
Jun 16, 2025 12:28 IST
హైదరాబాద్: GHMC ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత
ghmc ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళన
నగర సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు, నేతల నిరసన
ఆఫీస్ లోపలకి దూసుకెళ్లేందుకు కార్యకర్తల యత్నం
బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తల వాగ్వాదం
-
Jun 16, 2025 12:28 IST
ఫలితాలు విడుదల..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 67.4 శాతం ఉత్తీర్ణత
-
Jun 16, 2025 12:25 IST
జనగణనపై కేంద్రం గెజిట్ విడుదల
దేశంలో రెండు విడతల్లో జనగణన
34 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో జనగణన
జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం
జమ్ము, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1లోపు జనగణన
మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి
దేశంలో 15 ఏళ్ల తర్వాత జనగణన
పోర్టల్స్, యాప్స్‌లో ప్రజలు తమ వివరాల నమోదుకు అవకాశం