Breaking News: IAMCకి కేటాయించిన భూమి రద్దు చేస్తూ టీజీ హైకోర్టు తీర్పు
ABN , First Publish Date - Jun 27 , 2025 | 07:15 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Jun 27, 2025 18:04 IST
IAMCకి కేటాయించిన భూమి రద్దు చేస్తూ టీజీ హైకోర్టు తీర్పు
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్‌కు 3.5 ఎకరాలు కేటాయింపు.
నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించినట్లు హైకోర్టులో 2 పిటిషన్లు.
-
Jun 27, 2025 16:09 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
303 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
89 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 27, 2025 13:52 IST
ఏపీ టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ 2.0లో సీఎం చంద్రబాబు
రామ్‌దేవ్ బాబా యోగాను ఓ మాస్ మూమెంట్‌గా తెచ్చారు: చంద్రబాబు
రామ్‌దేవ్ ఎక్కడికి వెళ్లినా యోగా కోసం వేలాది మంది వస్తారు: చంద్రబాబు
ఈ మధ్యనే విశాఖలో యోగాంధ్ర నిర్వహించాం: చంద్రబాబు
యోగా డేను గ్లోబల్ డేగా నిర్వహించేలా ఐరాస ప్రకటించేలా ప్రధాని మోదీ చేశారు: చంద్రబాబు
విశాఖలో యోగా డేతో రికార్డులు సృష్టించాం: చంద్రబాబు
నేను రామ్‌దేవ్ బాబా కామన్ కాజ్ కోసం పనిచేస్తున్నాం: చంద్రబాబు
నేను రాష్ట్రానికి సేవచేస్తుంటో స్పిరిచ్‌వల్ లీడర్‌గా రామ్‌దేవ్ కూడా దేశానికి సేవ చేస్తున్నారు: చంద్రబాబు
ఏపీ టూరిజం అడ్వైజర్‌గా ఉండాలని రామ్‌దేవ్‌ను కోరుతున్నా: చంద్రబాబు
-
Jun 27, 2025 13:51 IST
ఏపీకి టూరిజం ఊపిరి: సీఎం చంద్రబాబు
పర్యాటకంగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం: చంద్రబాబు
భవిష్యత్ అంతా పర్యాటకానిదే: సీఎం చంద్రబాబు
విశాఖలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం
యోగాంధ్రను ప్రధాని మోదీ ప్రశంసించారు: చంద్రబాబు
యోగాంధ్రతో గిన్నిస్ రికార్డులు సాధించాం: చంద్రబాబు
యోగాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు రామ్‌దేవ్ బాబా కృషి: చంద్రబాబు
ఏపీ టూరిజం సలహాదారుగా ఉండాలని రామ్‌దేవ్ బాబాను కోరుతున్నా: చంద్రబాబు
-
Jun 27, 2025 11:55 IST
బాంబు బెదిరింపు..
ఢిల్లీ: ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి వస్తున్న విమానం టార్గెట్‌గా బెదిరింపు
తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించిన అధికారులు
-
Jun 27, 2025 11:55 IST
జగన్ కారును తనిఖీ..
గుంటూరు: జగన్ కారును తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు
ఏపీ 40 డీహెచ్ 2349 వాహనం ఫిట్‌నెస్ తనిఖీ చేసిన రవాణాశాఖ
జగన్ కారును జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచిన పోలీసులు
జగన్ రెడ్డి రెండపాళ్ల పర్యటనలో కారు కిందపడి సింగయ్య మృతి
సింగయ్య మృతిపై కేసునమోదు చేసిన నల్లపాడు పోలీసులు
-
Jun 27, 2025 11:55 IST
గంజాయి బ్యాచ్ హల్‌చల్
పెద్దపల్లి: గోదావరిఖని విఠల్‌నగర్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్
గంజాయి సేవించి అర్ధరాత్రి రోడ్లపై యువకుల హడావుడి
గంజాయి మత్తులో కత్తులతో నడిరోడ్డుపై యువకుల సంచారం
గంజాయి బ్యాచ్ అరాచకాలతో భయాందోళనలో స్థానికులు
-
Jun 27, 2025 11:53 IST
ఎయిరిండియా విమాన ప్రమాదం...
బాధిత కుటుంబాల కోసం టాటా రూ.500 కోట్ల ట్రస్ట్
గురువారం బోర్డు భేటీలో ప్రతిపాదిత ట్రస్ట్‌పై చర్చలు
ట్రస్ట్ ప్రతిపాదనపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ హర్షం
త్వరలోనే కంపెనీ బోర్డు నుంచి ఆమోదం లభించే అవకాశం
-
Jun 27, 2025 11:52 IST
ఏఐ 2.0 సదస్సు..
విజయవాడ: జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ 2.0 సదస్సు
మురళీ ఫార్చ్యూనర్ హోటల్‌లో సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు
లక్స్ క్యారవాన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగనున్న లక్స్ క్యారవాన్
-
Jun 27, 2025 11:52 IST
ఢిల్లీ: కొనసాగుతున్న ఆపరేషన్ సింధు
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారతీయులు తరలింపు
ఇప్పటివరకు భారత్‌కు చేరిన మొత్తం 4,415 మంది
ఇరాన్ నుంచి 3,597, ఇజ్రాయెల్ నుంచి 818 మంది తరలింపు
3 ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ సహా 19 ప్రత్యేక విమానాల్లో తరలింపు
-
Jun 27, 2025 07:16 IST
అమరావతి: జూన్ 2 నుంచి జనంలోకి టీడీపీ
ఈనెల 29 నుంచి టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమంపై సమగ్ర చర్చ
ఏడాది విజయాలపై నేతలతో సీఎం చంద్రబాబు చర్చ
ప్రజలకు ఏం వివరించాలనే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం
జగన్ అరాచక పర్యటనలను ఎండగట్టాలని నిర్ణయం
-
Jun 27, 2025 07:16 IST
నేడే విచారణ..
విజయవాడ: అయేషా మీరా హత్యకేసు
సీబీఐ నివేదికపై నేడు హైకోర్టులో విచారణ
-
Jun 27, 2025 07:15 IST
లిక్కర్ కేసు విచారణ..
ఏపీ లిక్కర్ కేసులో విచారణ
రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు
-
Jun 27, 2025 07:15 IST
కైలాస-మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం
36 మంది భారత యాత్రికులు చేరుకున్నట్లు చైనా ప్రకటన
కొవిడ్ సమయంలో నిలిచిపోయిన మానససరోవర్ యాత్ర
ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన యాత్ర