Breaking News: ఢిల్లీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - Sep 05 , 2025 | 07:52 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 05, 2025 20:36 IST
లండన్ పర్యటన నుంచి రేపు హైదరాబాద్‌కు హరీష్‌రావు
రేపు ఉ.5 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న హరీష్‌రావు
హైదరాబాద్ చేరుకోగానే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు హరీష్‌రావు
కేసీఆర్, కేటీఆర్‌తో సమావేశం కానున్న హరీష్‌రావు
కాళేశ్వరంపై CBI విచారణ, కవిత అంశాలపై చర్చించే అవకాశం
-
Sep 05, 2025 19:48 IST
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగుతోంది: నిర్మలా సీతారామన్
దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఇంధన ఎంపికలు చేసుకుంటాం: నిర్మల
-
Sep 05, 2025 19:12 IST
తెలంగాణ రాష్ట్ర సాధనలో రెవెన్యూ సిబ్బందిది కీలకపాత్ర: సీఎం రేవంత్
తెలంగాణ తొలి సీఎం మన బతుకులు మార్చుతారని నమ్మాం: రేవంత్
రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా గత ప్రభుత్వం చిత్రీకరించింది: రేవంత్
ప్రజలను దోచుకున్నది రెవెన్యూ ఉద్యోగులే అన్నట్లు చిత్రీకరించారు: రేవంత్
భూమికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం: సీఎం రేవంత్‌రెడ్డి
చరిత్రలో భూమిచుట్టూ జరిగిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి: సీఎం రేవంత్
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పంపిణీ: రేవంత్
-
Sep 05, 2025 18:58 IST
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ రూ.5 కోట్లు విరాళం
పంజాబ్ వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు విరాళం
విరాళం అనుకోను... అది ప్రజలకు చేసే సేవగా భావిస్తానని ప్రకటన
-
Sep 05, 2025 18:54 IST
హైదరాబాద్ హైటెక్స్‌లో 'కొలువుల పండుగ' కార్యక్రమం
గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ
సీఎం రేవంత్ చేతులమీదుగా GPOలకు నియామక పత్రాలు
రెవెన్యూ సేవల మెరుగు కోసం జీపీఓల నియామకం
-
Sep 05, 2025 18:16 IST
వైసీపీ హయాంలో ఎంతో దోచుకున్నారు: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
అందరినీ తిట్టిస్తే బెదిరిపోతామనుకుంటున్నారా?: బుచ్చయ్యచౌదరి
వైసీపీ నేతల దోపిడీ మొత్తం బయటపెడతాం: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
సజ్జలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎక్కడిది?: బుచ్చయ్యచౌదరి
ధైర్యం ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడించాలి: బుచ్చయ్యచౌదరి
జగన్‌తోపాటు జైలుకు వెళ్లేందుకు సజ్జల సిద్ధంగా ఉండాలి: బుచ్చయ్యచౌదరి
వైసీపీ హయాంలో రైతులకు ధాన్యం బకాయిలు ఇవ్వలేదు: బుచ్చయ్యచౌదరి
-
Sep 05, 2025 17:36 IST
కేంద్రం నుంచి తెలంగాణకు 11,181 మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
రేపు తెలంగాణకు మరో 9,039 మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
రానున్న 20 రోజులపాటు రోజుకు 10 వేల మెట్రిక్ టన్నులు చొప్పున..
తెలంగాణకు యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి తుమ్మల
-
Sep 05, 2025 17:23 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పురోగతి
జగన్ సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డి పీఏ దేవరాజులును పిలిపించిన సిట్?
లిక్కర్ కేసులో దేవరాజులుని సిట్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం
-
Sep 05, 2025 17:23 IST
ఉపాధ్యాయులు క్రమశిక్షణతో ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నేను మాట్లాడే సమయానికి సగం మంది భోజనానికి వెళ్లారు: కోమటిరెడ్డి
వెళ్లిపోదాం అనుకున్నా...కలెక్టర్ చెప్పారని ఆగాను: మంత్రి కోమటిరెడ్డి
నేను వెళ్ళిపోతే.. ఉపాధ్యాయుల గౌరవం పోయేది: మంత్రి కోమటిరెడ్డి
-
Sep 05, 2025 17:22 IST
పేదల తలరాతను మార్చేది విద్య మాత్రమే: రేవంత్ రెడ్డి
విద్యలో ప్రపంచంతో పోటీ పడాలి: సీఎం రేవంత్ రెడ్డి
విద్యారంగం సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర: సీఎం
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీకి కమిటీ వేశాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Sep 05, 2025 16:39 IST
ప్రధాని మోదీని కలిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ ట్వీట్
GST సంస్కరణలపై మోదీకి కృతజ్ఞతలు తెలిపా: మంత్రి లోకేష్
సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు
కూటమి పాలనలో అభివృద్ధి కొనసాగుతోంది: మంత్రి లోకేష్
మరింత సహకారం అందించాలని మోదీని కోరా: మంత్రి లోకేష్
ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చారు: లోకేష్
-
Sep 05, 2025 16:27 IST
వినాయక నిమజ్జనం వేళ ముంబైలో హైఅలర్ట్
ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ..
ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్
35 వాహనాలతో 14 పాక్ ఉగ్రవాదులు వచ్చారని మెసేజ్
కోటిమందిని చంపేస్తామంటూ దుండగుల బెదిరింపు
-
Sep 05, 2025 16:20 IST
భారత్‌తో సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికాకు భారత్ దూరమైందని ట్రంప్ ఆవేదన
మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఫొటో పోస్ట్ చేసిన ట్రంప్
భారత్‌తో పాటు రష్యాకు కూడా దూరమయ్యాం: ట్రంప్
కుట్రబుద్ధ ఉన్న చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయి: ట్రంప్
భారత్, రష్యా, చైనా మైత్రి చాలాకాలం కొనసాగొచ్చు: ట్రంప్
-
Sep 05, 2025 15:57 IST
ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్
తొలిరోజు సమావేశాల అనంతరం BAC భేటీ
-
Sep 05, 2025 15:56 IST
జగన్‌పై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నా: రఘురామ
ప్రతిపక్ష హోదా కోసం చిన్నపిల్లాడిలా జగన్ మారం చేస్తున్నారు
60 రోజులు సభకు రాకపోతే డిస్‌క్వాలిఫై అవుతారు: రఘురామ
పులివెందుల అసెంబ్లీకి ఉపఎన్నిక రావొచ్చు: రఘురామకృష్ణరాజు
-
Sep 05, 2025 12:44 IST
మావోయిస్టులకు మరో షాక్..
ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్‌లో భారీ ఎన్ కౌంటర్
నలుగురు మావోయిస్టులు మృతి
-
Sep 05, 2025 12:18 IST
ఢిల్లీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం
దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లకు అవార్డులు
పెన్‌పహాడ్ పాఠశాలలో టీచర్‌గా చేస్తున్న పవిత్రకు జాతీయ అవార్డు
ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్..
తెలంగాణకు చెందిన ప్రొ.గోయల్, వినీత్‌కు అవార్డులు
-
Sep 05, 2025 12:18 IST
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,050
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,980
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,26,650
-
Sep 05, 2025 12:18 IST
విజయవాడ బీజేపీ కార్యాలయంలో వర్క్‌షాప్
17న మోదీ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: డీకే అరుణ
స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రచారం చేయాలి
సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి: డీకే అరుణ
ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు బీజేపీ సేవా పక్షోత్సవాలు: డీకే అరుణ
-
Sep 05, 2025 12:18 IST
ఢిల్లీ: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమ కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న లోకేష్
విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినందుకు కృతజ్ఞతలు తెలుపనున్న లోకేష్
యోగాంధ్ర నిర్వహణపై పూర్తి నివేదికను ప్రధానికి అందించనున్న లోకేష్
జీఎస్టీలో సంస్కరణలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న లోకేష్
జీఎస్టీ వసూళ్లు పెరిగిన విధానాన్ని ప్రధానికి వివరించనున్న లోకేష్
-
Sep 05, 2025 10:55 IST
మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు: హరీశ్‌రావు
ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది
వానాకాలంలో విద్యుత్ డిమాండు ఉండదు: హరీశ్‌రావు
ఆ సమమంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చు
హైడ్రాతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది
ఎన్నారైలు పెట్టుబడులు పెట్టడం లేదు: హరీశ్‌రావు
-
Sep 05, 2025 10:55 IST
నల్లగొండ: పాతబస్తీ ఒకటో విగ్రహం దగ్గర ఉద్రిక్తత
మంత్రి కోమటిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు
గణేష్ ఉత్సవాల్లో రాజకీయ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం
కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట, చెదరగొట్టిన పోలీసులు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తల ఆందోళన
-
Sep 05, 2025 10:55 IST
ఖైరతాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
కాసేపట్లో ఖైరతాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 05, 2025 08:29 IST
అమిత్‌షా హైదరాబాద్ పర్యటన రద్దు
ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అమిత్‌షా పర్యటన రద్దు
రేపు గణేష్ నిమజ్జనానికి రావాల్సిన అమిత్‌షా
-
Sep 05, 2025 08:29 IST
బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం
సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: వాతావరణ శాఖ
తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
-
Sep 05, 2025 08:29 IST
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు
13 కంట్రోల్ రూమ్‌లు, 30 వేల మందితో పోలీసు బందోబస్తు
160 యాక్షన్ టీంలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ
నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు
134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం
శానిటేషన్ కోసం విధుల్లో 14,486 మంది GHMC సిబ్బంది
అందుబాటులో DRF బృందాలు, 200 మంది గజఈతగాళ్లు
-
Sep 05, 2025 08:29 IST
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం వరకు ఆంక్షలు
బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు గణేష్ శోభాయాత్ర
ప్రధాన రహదారులపై ఇతర వాహనాలకు అనుమతి నిరాకరణ
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచన
-
Sep 05, 2025 07:52 IST
తెలుగు యువకుడు మృతి..
అమెరికాలో ఈతకొలనులో పడి బాపట్ల జిల్లా యువకుడు మృతి
మార్టూరు గ్రానైట్ వ్యాపారి కుమారుడు పాటిబండ్ల లోకేష్ (23) మృతి
ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన పాటిబండ్ల లోకేష్
-
Sep 05, 2025 07:52 IST
మిలాద్ ఉన్ నబీ జరుపుకొంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు: చంద్రబాబు
మిలాద్ ఉన్ నబీ ముస్లింల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి: చంద్రబాబు
అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో మహమ్మద్ ప్రవక్త విశ్వాసం నింపారు
నీతి, నిజాయతీ, ప్రేమ, త్యాగానికి ప్రాధాన్యతనిస్తూ జీవితం కొనసాగించారు: చంద్రబాబు
మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలకు ప్రేరణ కల్పించేది మిలాద్ ఉన్ నబీ
సాటివారిని గౌరవిస్తూ.. వారి ఆకలి తీర్చే పవిత్ర ఆశయాలు కొనసాగాలి: సీఎం
-
Sep 05, 2025 07:52 IST
టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా: సీఎం
సర్వేపల్లి ఆదర్శాల నుంచి ఎందరో స్పూర్తి పొందుతున్నారు: చంద్రబాబు
పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ అభినందనలు: చంద్రబాబు
అంకితభావంతో పనిచేస్తూ ముందుతరాలకు మార్గదర్శులు కావాలి: చంద్రబాబు