Breaking News: ఎన్‌కౌంటర్ అవుతారా.. ప్రాణాలు కాపాడుకుంటారా?: అమిత్ షా
ABN , First Publish Date - Sep 04 , 2025 | 08:55 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 04, 2025 21:39 IST
తిరుపతి: చెవిరెడ్డి నివాసంలో ముగిసిన సిట్ సోదాలు
ఉదయం 9 గంటల నుంచి తనిఖీలు నిర్వహించిన సిట్
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన కంపెనీల వివరాలతో పాటు..
పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం: విజిలెన్స్ ఎస్పీ
మొత్తం 6 కంపెనీలు ఉన్నట్లు గుర్తించాం: విజిలెన్స్ ఎస్పీ
-
Sep 04, 2025 21:17 IST
articleText
-
Sep 04, 2025 21:11 IST
ఢిల్లీ: అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
ఈ నెల 6న గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్
ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకంలో భాగంగా అమిత్ షా పర్యటన రద్దు
ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఎంపీలతో అమిత్ షా అభ్యాస్ కార్యక్రమం
ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకంలో భాగంగా అమిత్ షా పర్యటన రద్దు
-
Sep 04, 2025 21:04 IST
ఢిల్లీ: ఈ నెల 13, 14న జేపీ నడ్డా ఏపీ పర్యటన
ఈ నెల 13, 14న విశాఖలో జేపీ నడ్డా పర్యటన
14న విశాఖలో బీజేపీ బహిరంగసభకు హాజరు
-
Sep 04, 2025 21:03 IST
రేపు విశాఖ, విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్న చంద్రబాబు
విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్న చంద్రబాబు
-
Sep 04, 2025 20:54 IST
SLBC పనుల పూర్తి కోసం తెలంగాణ సర్కార్ డెడ్‌లైన్
2027 డిసెంబర్ 9లోగా SLBC పనులు పూర్తిచేసి..
తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వాలి: సీఎం రేవంత్
SLBC పనులు ఆలస్యం కావడానికి వీల్లేదు: రేవంత్
తెలంగాణకు SLBC అత్యంత కీలకం: సీఎం రేవంత్
ఎలాంటి ఖర్చు లేకుండా SLBC నుంచి నీళ్లు ఇవ్వొచ్చు
శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న..
సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలి: సీఎం రేవంత్
అటవీశాఖ అనుమతులపై దృష్టి సారించాలి: సీఎం రేవంత్
SLBC పనులకు గ్రీన్‌చానల్‌లో నిధులు ఇచ్చేందుకు సిద్ధం
సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్..
అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
సింగరేణి నిపుణుల సేవలు వినియోగించుకోవాలి: రేవంత్
SLBC పనులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా: రేవంత్
-
Sep 04, 2025 19:34 IST
అనుష్క ఘాటి సినిమాపై ఈగల్ టీమ్ అభ్యంతరం
గంజాయిపై అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలన్న ఈగల్
NDPS యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని ఈగల్ హెచ్చరిక
-
Sep 04, 2025 18:57 IST
GST సంస్కరణలతో దివాళి గిఫ్ట్ ఇచ్చాం: ప్రధాని మోదీ
ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది
GST శ్లాబ్‌ల సవరణలతో అందరికీ ప్రయోజనం: మోదీ
సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరం: ప్రధాని మోదీ
దేశ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి: ప్రధాని మోదీ
GST సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది
ప్రజలకు నిత్యావసరాల ధరలు తగ్గుతాయి: ప్రధాని మోదీ
యూపీఏ హయాంలోనే అధిక పన్నులు: ప్రధాని మోదీ
గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారు: మోదీ
-
Sep 04, 2025 18:18 IST
హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి లక్షలాదిగా భక్తులు
మహాగణపతి దర్శనానికి రాత్రి 11 గంటల వరకు అనుమతి
ఇప్పటివరకు మహాగణపతిని దర్శించుకున్న 28 లక్షలమందికి పైగా భక్తులు
బడా గణేశ్ మండపం తొలగింపు పనుల కోసం రేపు దర్శనాలు నిలిపివేత
ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
-
Sep 04, 2025 17:11 IST
కామారెడ్డి: వరదలపై కలెక్టరేట్‌లో సీఎం రేవంత్ సమీక్ష
వరద నష్టం వివరాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా
వరద నష్టం అంచనా, బాధితులకు పరిహారంపై సమీక్ష
-
Sep 04, 2025 17:11 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి పెమ్మసానిని కలిసిన మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా రఘునాథపాలం మండలంలోని తండాలకు..
డ్రైనేజీ వ్యవస్థకు రూ.110 కోట్ల మంజూరు చేయాలని విజ్ఙప్తి
-
Sep 04, 2025 16:48 IST
రాజన్నసిరిసిల్ల: జోగినపల్లి సంతోష్‌రావుపై నేరెళ్ల బాధితుల ఫిర్యాదు
తంగలపల్లి పీఎస్‌లో సంతోష్‌రావుపై ఫిర్యాదు చేసిన నేరెళ్ల బాధితుల
సంతోష్‌రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్
నేరెళ్లలో దళిత కుటుంబాలపై థర్డ్ డిగ్రీకి సంతోష్‌రావు కారణం అన్న కవిత
కవిత ఆరోపణల నేపథ్యంలో మరోసారి తెరపైకి నేరెళ్ల బాధితుల అంశం
2017లో సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులను కొట్టడంపై తీవ్ర ఆరోపణలు
తాజాగా కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చేలా సంతోష్‌రావు వ్యవహరించరన్న కవిత
-
Sep 04, 2025 16:48 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ
నిర్మలా సీతారామన్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల భేటీ
తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్‌పై చర్చించాం: భట్టి విక్రమార్క
గత ప్రభుత్వం అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని కోరాం
విద్యాసంస్థలకు సంబంధించిన ఆర్థిక సహాయంపై చర్చించాం: భట్టి విక్రమార్క
తెలంగాణలో వరదల నష్టాన్ని అమిత్ షాకి వివరిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
Sep 04, 2025 16:40 IST
భారత్‌లో భారీగా తగ్గిన శిశు మరణాల రేటు
రికార్డు స్థాయిలో కనిష్ఠంగా 25కు చేరిన రేటు
2013లో 40గా ఉన్న శిశుమరణాల రేటు
-
Sep 04, 2025 16:26 IST
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది: సీఎం రేవంత్
బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: సీఎం రేవంత్
కష్టం వచ్చినపుడు అండగా ఉండేవాడే నాయకుడు: రేవంత్
వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి
పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగింపునకు ప్రత్యేక నిధులు
రోడ్లు, ప్రాజెక్టుల మరమ్మతులకు అంచనాలు రూపొందించాలి
వరద నష్టంపై అధికారులు అంచనా రూపొందించాలి: రేవంత్
-
Sep 04, 2025 15:59 IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హెల్త్ పాలసీ
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స
పీపీపీ విధానంలో ఏపీలో 10 కొత్త మెడికల్ కాలేజీలు
-
Sep 04, 2025 15:59 IST
ఏపీలోని అన్ని ప్రాంతాలకు యూరియా పంపిస్తున్నాం: సీఎం చంద్రబాబు
యూరియాపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు
అసత్య ప్రచారంపై వెంటనే స్పందించాల్సిన బాధ్యత మంత్రులు, MLAలదే
దుష్ప్రచారంపై సోషల్ మీడియా అడ్మిన్‌దే బాధ్యత: సీఎం చంద్రబాబు
కుప్పంలో కాల్వలకు నీరు రావలట్లేదని దుష్ప్రచారం చేశారు: చంద్రబాబు
ముందు జాగ్రత్తగా ఇలాంటి అసత్య ప్రచారాలను నియంత్రించాలి: చంద్రబాబు
సుగాలి ప్రీతి విషయంలో సీబీఐ విచారణ చేయించాలని..
CBI డైరెక్టర్‌కు ఇవాళే లేఖ రాయాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఈనెల 10న సూపర్ సిక్స్ - సూపర్ హిట్ కార్యక్రమం: సీఎం చంద్రబాబు
సూపర్ సిక్స్ - సూపర్ హిట్ కార్యక్రమం కోసం మంత్రుల కమిటీ: చంద్రబాబు
అందరికీ ఆరోగ్య బీమాలో జర్నలిస్టునూ కలపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
-
Sep 04, 2025 11:34 IST
అమరావతి: ఏపీలో ఆగిన 9 వేల మంది పెన్షన్లు
కాకినాడ, విశాఖ, విజయవాడ CRDA రీజియన్‌లో ఆగిన పెన్షన్లు
బిల్లులు వెనక్కు రావడంతో సరిచేసి పంపిన CFMS అధికారులు
-
Sep 04, 2025 11:25 IST
మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక
ఎన్‌కౌంటర్ అవుతారా.. ప్రాణాలు కాపాడుకుంటారా?: అమిత్ షా
మావోయిస్టులు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవడమా..
బలగాల చేతిలో హతంకావడమా వారే తేచ్చుకోవాలి: అమిత్ షా
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టును పూర్తి చేసిన దళాలను సత్కరించిన అమిత్ షా
కర్రెగుట్టల్లో మావోయిస్టుల బేస్ క్యాంప్‌ను ధ్వంసం చేశాం: అమిత్ షా
-
Sep 04, 2025 11:25 IST
సీఎం రేవంత్ సమీక్ష
SLBC సొరంగ పనుల పునరుద్ధరణపై నేడు సీఎం రేవంత్ సమీక్ష
పాల్గొననున్న నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు
సురక్షిత పద్ధతిలో సొరంగ పనులు ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం
ఫిబ్రవరి 22న టన్నెల్‌లో ప్రమాదంతో నిలిచిపోయిన పనులు
-
Sep 04, 2025 11:25 IST
4 రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కేటీఆర్
కేసీఆర్‌తో కేటీఆర్, ముఖ్యనేతలు సుదీర్ఘ మంతనాలు
కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్‌పై సమాలోచనలు
కవిత ఆరోపణలపై ఇంకా స్పందించని కేసీఆర్, కేటీఆర్
బ్రిటన్ నుంచి ఎల్లుండి హైదరాబాద్ రానున్న హరీష్‌రావు
ఈరోజు, రేపు కుటుంబసభ్యులతోనే ఉండనున్న కవిత
-
Sep 04, 2025 11:25 IST
ఢిల్లీ: క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు
కాసేపట్లో విచారణకు హాజరుకానున్న ధావన్
-
Sep 04, 2025 09:03 IST
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఢిల్లీలో ప్రమాదకరంగా యమునా నది ప్రవాహం
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Sep 04, 2025 09:03 IST
పంజాబ్‌ను ముంచెత్తిన వర్షాలు, 30 మందికిపైగా మృతి
పంజాబ్‌లో 37 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం
1.48 లక్షల హెక్టార్లలో పంట నీటమునక
మూడు రోజుల పాటు పంజాబ్‌లో విద్యాసంస్థలకు సెలవు
-
Sep 04, 2025 09:03 IST
జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు
పొంగిప్రవహిస్తున్న సట్లెజ్, బియాస్, రావి నదులు
రాజస్థాన్: వర్షాలతో పలు జిల్లాల్లో స్తంభించిన రవాణా వ్యవస్థ
జైపూర్, కోటా జిల్లాలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
-
Sep 04, 2025 09:03 IST
అమిత్‌షాను కలవనున్న మంత్రులు..
ఢిల్లీ: నేడు అమిత్‌షాను కలవనున్న మంత్రులు భట్టి, తుమ్మల
ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టంపై నివేదిక ఇవ్వనున్న మంత్రులు
-
Sep 04, 2025 08:55 IST
విమానానికి తప్పిన పెను ప్రమాదం
విజయవాడ: గన్నవరం ఎయిపోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
రన్ వే పై టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో ఢీకొన్న పక్షి
పక్షి ఢీ కొనడంతో సడన్ ఎయిర్ బ్రేక్ వేసిన పైలెట్
వెంటనే వెనక్కి తీసుకువచ్చిన పైలెట్
పార్కింగ్ లాంజ్ ప్రాంతంలోకి ఫ్లైట్‌ను తీసుకువచ్చిన పైలెట్