Breaking News: మూడు బిల్లులను ఆమోదించిన తెలంగాణ శాసన మండలి
ABN , First Publish Date - Sep 01 , 2025 | 07:52 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 01, 2025 20:54 IST
సాక్షి దినపత్రిక ఎడిటర్, క్రైమ్ బ్యూరో చీఫ్, సిబ్బందిపై కేసు నమోదు
డీజీపీని కించపరుస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తూ రాసిన కథనంపై చర్యలు
పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ఫిర్యాదుతో..
కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
-
Sep 01, 2025 20:31 IST
హరీష్‌రావుకు మద్దతుగా ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్
BRS ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్
డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ ట్వీట్
నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు..
కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది: కేటీఆర్
-
Sep 01, 2025 20:13 IST
భారత్‌తో సంబంధాలను ప్రశంసిస్తూ ఎక్స్‌లో అమెరికా మంత్రి పోస్ట్
భారత్ మాకు మంచి దోస్త్: ఎక్స్‌లో అమెరికా మంత్రి మార్కో రూబియో
21వ శతాబ్ధంలో ఇరుదేశాల సంబంధాలు సరికొత్త శిఖరాలను చేరాయి
ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం మన సహకారానికి పునాది
మన స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెడతాం: రూబియో
-
Sep 01, 2025 19:36 IST
పల్నాడు: వైసీపీ హయాంలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారు: మంత్రి గొట్టిపాటి
కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు: గొట్టిపాటి
వైసీపీ పాలనలో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు
వైసీపీ హయాంలో విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది: గొట్టిపాటి
వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్ష తప్ప.. అభివృద్ధి లేదు: మంత్రి గొట్టిపాటి
-
Sep 01, 2025 19:08 IST
వర్షాలు, వరద సహాయంపై సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఉత్తమ్, సీతక్క,... కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్
-
Sep 01, 2025 19:08 IST
హైదరాబాద్: పిల్లల అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు
నలుగురిని అరెస్ట్ చేసిన చందానగర్ పోలీసులు
పిల్లలను విక్రయం కోసం ఎత్తుకెళ్లారా?..
దత్తత కోసం ఎత్తుకెళ్లారా? అని దర్యాప్తు చేస్తున్నాం: మాదాపూర్ డీసీపీ వినీత్
కొన్ని ఇళ్లను రెక్కీ చేసి.. పెద్దవాళ్లు లేని ఇళ్లను ఎంచుకుని ఎత్తుకెళ్లారు
పిల్లలు అదృశ్యమైనవారు మమ్మల్ని సంప్రదించండి: డీసీపీ
-
Sep 01, 2025 19:07 IST
OMC కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ
ఐఎఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ పాత్రపై మరోసారి విచారించనున్న సీబీఐ కోర్టు
హైకోర్టు ఆదేశాలతో శ్రీ లక్ష్మీ పాత్రపై మరోసారి ట్రైల్
శ్రీ లక్ష్మీపై వేసిన సీబీఐ పిటిషన్‌కు నెంబర్ కేటాయింపు
Cc 27/2025 నెంబర్ కేటాయించిన సీబీఐ కోర్టు, రేపు విచారణ
-
Sep 01, 2025 18:24 IST
పార్టీ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను తొలగించిన BRS
ఎక్స్‌లో కవితను అన్‌ఫాలో చేస్తున్న BRS నేతలు, కార్యకర్తలు
-
Sep 01, 2025 18:06 IST
రేపు హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు మధ్యంతర పిటిషన్లపై విచారణ
చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లిస్ట్ అయిన కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లు
కేసు సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయంపై రేపు వాదనలు
కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా..
ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్న కేసీఆర్, హరీష్‌రావు
-
Sep 01, 2025 17:51 IST
BRSలో పీక్స్‌కు చేరిన కోల్డ్ వార్
కవితకు కౌంటర్‌గా BRS అధికారిక రియాక్షన్
హరీష్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ BRS ట్వీట్
-
Sep 01, 2025 17:33 IST
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు
కవిత వ్యాఖ్యలపై కేసీఆర్‌తో చర్చించనున్న నేతలు
కవితపై యాక్షన్ తీసుకునే అవకాశం
ఉదయం నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న కేటీఆర్
-
Sep 01, 2025 17:32 IST
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు
కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
సెప్టెంబర్ 9లోపు నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల కమిటీ
-
Sep 01, 2025 17:17 IST
కవిత వ్యాఖ్యలతో ఫామ్‌హౌస్‌కు క్యూ కట్టిన BRS నేతలు
కవితపై యాక్షన్ తీసుకునే అవకాశం?
ఉదయం నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న కేటీఆర్
కేసీఆర్‌తో సమావేశం తర్వాత.. BRS నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం
-
Sep 01, 2025 17:07 IST
BRS రాజకీయ రగడ కాళేశ్వరం వరకు వచ్చింది: అద్దంకి దయాకర్
కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ పాత్ర లేదనడం విడ్డూరం: అద్దంకి
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారు: అద్దంకి దయాకర్
కవిత ఎత్తుగడలో భాగంగానే రేవంత్ పేరు చెబుతున్నారు: అద్దంకి
కాళేశ్వరం కథలో హరీష్, సంతోష్ పాత్ర ఉందని స్పష్టం చేశారు: అద్దంకి
-
Sep 01, 2025 17:00 IST
ఇబ్బందులొస్తే BRSకు తెలంగాణ సెంటిమెంట్ గుర్తొస్తుంది: సీతక్క
లిక్కర్ కేసు సమయంలో కూడా తెలంగాణపై దాడి అన్నారు: సీతక్క
మళ్లీ ఇప్పుడు తెలంగాణపై దాడి అంటున్నారు: మంత్రి సీతక్క
పార్టీ పేరు మార్చుకున్న BRSకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: సీతక్క
-
Sep 01, 2025 16:59 IST
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
కుటుంబ కలహాలను మాపై రుద్దడం సరికాదు: కాంగ్రెస్ నేతలు
కవిత వెనుక రేవంత్ ఉన్నారని హరీష్, సంతోష్ ఆరోపిస్తున్నారు
ఇప్పుడు కవిత మరో డ్రామాకు తెరలేపారు: కాంగ్రెస్ నేతలు
మొత్తానికి అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారు: కాంగ్రెస్ నేతలు
నిజాలు మాట్లాడితే కవితను కూడా వదిలిపెట్టరు: కాంగ్రెస్ నేతలు
-
Sep 01, 2025 16:29 IST
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేసిన కవిత
కేసీఆర్‌పై కొందరు కుట్రలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్‌పై ఆరోపణలకు కారణం ఇద్దరు, ముగ్గురు నేతలే
అందులో హరీష్‌రావు, సంతోష్‌రావుది కీలకపాత్ర: కవిత
హరీష్‌రావు, సంతోష్‌రావు వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారు
అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారు
నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారు..
-
Sep 01, 2025 16:10 IST
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కౌంటర్
భారత్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు: కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి
రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో..
భారత్ అన్ని అంతర్జాతీయ నిబంధనలు పాటించింది: హర్దీప్‌సింగ్ పురి
-
Sep 01, 2025 16:10 IST
ఆఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఆఫ్ఘానిస్థాన్‌ను అన్ని రకాలుగా ఆదుకుంటాం: ప్రధాని మోదీ
-
Sep 01, 2025 16:09 IST
లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
555 పాయింట్ల లాభంతో 80,364 దగ్గర ముగిసిన సెన్సెక్స్
198 పాయింట్ల లాభంతో 24,625 దగ్గర ముగిసిన నిఫ్టీ
-
Sep 01, 2025 16:09 IST
బిహార్ ఓటర్ అధికార్ యాత్రలో రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తాం: రాహుల్‌గాంధీ
బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలి: రాహుల్
మోదీ ఇక దేశానికి తన మొహాన్ని చూపించలేరు: రాహుల్
ఓట్ల చోరీలో వాస్తవాలను ప్రజలు తెలుసుకోబోతున్నారు: రాహుల్
-
Sep 01, 2025 15:35 IST
రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయి: చంద్రబాబు
2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చింది: చంద్రబాబు
కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నాం: సీఎం చంద్రబాబు
మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ డ్రామాలు ఆడింది: చంద్రబాబు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలి
మహిళల ఆత్మగౌరవం దెబ్బతిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
Sep 01, 2025 15:31 IST
రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో స్వచ్చాంధ్ర ఆవార్డులు ప్రధానం చేయాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
పారిశుద్ధ్యంపై శాఖలవారీగా తీసుకున్న రిపోర్టులు ఆధారంగా అవార్డులకు ఎంపిక
రాష్ట్ర, జిల్లా స్ధాయిల్లో సమర్దవంతంగా పనిచేసిన వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం
13 కేటగిరిలలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయం
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అక్టోబర్ 2న నిర్వహించాలని నిర్ణయం
-
Sep 01, 2025 15:25 IST
అన్నమయ్య: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సవాల్
సిద్ధం.. సిద్ధం.. అని వైసీపీ నేతలు ఎగిరిపడ్డారు: సీఎం చంద్రబాబు
అసెంబ్లీకి వచ్చేందుకు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: చంద్రబాబు
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు మేం సిద్ధం?: చంద్రబాబు
వివేకా హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు మేం సిద్ధం?
రక్తం పారించిన రాయలసీమలో నీళ్లు పారించే సత్తా ఎన్డీఏకు ఉంది
మహిళలపై అఘాయిత్యాలు చేస్తే అదే వారికి చివరి రోజు: చంద్రబాబు
-
Sep 01, 2025 15:25 IST
కొంతమందికి అధికారం ఇస్తే సొంత పనులకు వినియోగించుకున్నారు
టీడీపీ ఎప్పుడూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేసింది: చంద్రబాబు
రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది
2024 ఎన్నికల్లో పవన్, బీజేపీతో కలిసి పోటీ చేశాం: చంద్రబాబు
కూటమికి ప్రజలు అద్భుత విజయం అందించారు: సీఎం చంద్రబాబు
-
Sep 01, 2025 15:24 IST
పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
మన ప్రభుత్వంలో జీతాలతో పాటు పెన్షన్లు కూడా సకాలంలో ఇస్తున్నాం
అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి: సీఎం చంద్రబాబు
ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయి: చంద్రబాబు
రాయలసీమను రతనాలసీమగా మారుస్తా: సీఎం చంద్రబాబు
అప్పు చేసి పప్పు కూడు తింటే చిప్పే మిగులుతుంది
అప్పులు చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడదు: చంద్రబాబు
ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యం: చంద్రబాబు
సంపద సృష్టించి ఆదాయం పెంచి సంక్షేమం ఇస్తున్నాం: చంద్రబాబు
-
Sep 01, 2025 15:24 IST
అన్నమయ్య: బోయినపల్లి ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే నా ఆశయం: చంద్రబాబు
రాజకీయ జీవితంలో నేను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు: సీఎం చంద్రబాబు
30 ఏళ్లుగా ఒక మిషన్‌లా పనిచేస్తున్నా: సీఎం చంద్రబాబు
కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదలను దోచుకునేవారు: చంద్రబాబు
వైసీపీ హయాంలో వాళ్ల కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చారు
గత ప్రభుత్వంలో అర్హులకు పెన్షన్ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది: చంద్రబాబు
-
Sep 01, 2025 15:24 IST
articleText
-
Sep 01, 2025 15:04 IST
అన్నమయ్య: రాజంపేటలో సీఎం చంద్రబాబు పర్యటన
మునక్కాయలవారిపల్లెలో పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
బోయినపల్లిలో దోబీ ఘాట్ పరిశీలించిన సీఎం చంద్రబాబు
ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఆరా తీసిన చంద్రబాబు
రజకులకు షెడ్లు నిర్మించాలని అధికారులకు సీఎం ఆదేశం
-
Sep 01, 2025 15:04 IST
కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: అర్వింద్
అవినీతికి పాల్పడిన ఎవరినీ వదలిపెట్టొద్దు: ఎంపీ ధర్మపురి అర్వింద్
రెండేళ్లు ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేసిందో స్పష్టం చేయాలి
వరదలతో జిల్లా వ్యాప్తంగా భారీగా పంట, ఆస్తి నష్టం: అర్వింద్
అధికారులు నష్టాన్ని తక్కువ చేసి నివేదికలు ఇస్తున్నారు: అర్వింద్
వరద నష్టంపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తా: ఎంపీ అర్వింద్
రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే.. కేంద్రం ద్వారా సహాయం చేస్తాం: అర్వింద్
-
Sep 01, 2025 15:03 IST
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న BRS నిరసనలు
కాళేశ్వరంపై సీబీఐ విచారణను నిరసిస్తూ ధర్నాలు
తెలంగాణ భవన్ ఎదుట రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన BRS
-
Sep 01, 2025 14:29 IST
నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు.. ఇకపై తీసుకోను: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఓటేసే ప్రతి పౌరుడు రాజకీయ అభిప్రాయం కలిగి ఉంటాడు
నేను గతంలో ఇచ్చిన తీర్పు గురించి చర్చ తీసుకొచ్చారు..
తీర్పుపై చర్చకు భయపడి వెనక్కి తగ్గుతాననుకున్నారు: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
సవాల్‌ను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
నేను ఇచ్చిన తీర్పును చదవండి.. చర్చించండి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
నేను సమర్థించినట్టు ఉంటే శిరస్సు వంచి మీ మాట గౌరవిస్తా: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేప్పుడు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి: సుదర్శన్‌రెడ్డి
-
Sep 01, 2025 14:29 IST
సిరిసిల్ల: వేములవాడలో యూరియా కోసం రైతులు బారులు
ఉదయం నుంచి దుకాణాల దగ్గర క్యూకట్టిన రైతులు
రైతులకు మద్దతుగా వచ్చిన BRS నేతలను పంపించిన పోలీసులు
-
Sep 01, 2025 14:28 IST
విజయవాడ: లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
సీజ్ చేసిన రూ.11కోట్లలో తన ప్రమేయం లేదని రాజ్ కసిరెడ్డి పిటిషన్
తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
-
Sep 01, 2025 14:27 IST
తెలంగాణాలో ఏసీబీ దూకుడు
8 నెలల్లో 179 కేసులు నమోదు
ఇప్పటివరకు 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్
మొత్తం రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
ఆగస్టులో 31 కేసులు నమోదు చేసిన ఏసీబీ
22 మంది ప్రభుత్వ, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు అరెస్ట్
-
Sep 01, 2025 12:40 IST
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం, 622 మంది మృతి
భూకంపం ధాటికి మరో 500 మందికి గాయాలు
6 తీవ్రతతో భూకంపం, పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం
మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంప తీవ్రత
పాకిస్తాన్ జలాలాబాద్ దగ్గర 8 కి.మీ లోతులో భూకంప కేంద్రం
-
Sep 01, 2025 10:59 IST
తెలంగాణ శాసన మండలి ఆమోదం..
మూడు బిల్లులను ఆమోదించిన తెలంగాణ శాసన మండలి
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు మండలి ఆమోదం
అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లుకు ఆమోదం
-
Sep 01, 2025 10:59 IST
కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో KCR, హరీష్ పిటిషన్
మరోసారి మెన్షన్ చేసిన పిటిషన్ తరపు న్యాయవాదులు
సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హైకోర్టుకు తెలిపిన కేసీఆర్ తరపు న్యాయవాదులు
అత్యవసరంగా విచారించాలని కోరిన న్యాయవాదులు
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
తదుపరి విచారణ రేపటికి వాయిదా
-
Sep 01, 2025 08:39 IST
సీఎం చంద్రబాబు పర్యటన..
నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
రాజంపేటలో పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
రాజంపేటలో బహిరంగసభ, ఆ తర్వాత పార్టీ క్యాడర్‌తో సమావేశం
-
Sep 01, 2025 07:52 IST
క్యాన్సర్ సెంటర్ ప్రారంభం..
విశాఖ: నేడు కేజీహెచ్‌లో కాంప్రహెన్సీవ్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం
క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించునున్న మంత్రి సత్య కుమార్ యాదవ్
-
Sep 01, 2025 07:52 IST
తెలంగాణకు నేడు, రేపు వర్షసూచన
నేడు కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికి భారీ వర్షసూచన
రేపు అన్ని జిల్లాల్లో మోస్తరువర్షాలు కురిసే అవకాశం
-
Sep 01, 2025 07:52 IST
ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
తీరం వెంబడి 40-60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు
సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన
తెలంగాణ వ్యాప్తంగా మోస్తరువర్షాలు కురిసే అవకాశం
-
Sep 01, 2025 07:52 IST
బిహార్‌లో SIRపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఆర్జేడీ పిటిషన్‌పై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు తుది గడువును పొడిగించాలని పిటిషన్ వేసిన ఆర్జేడీ