Breaking News: కాలిఫోర్నియాలో వర్ష బీభత్సం
ABN , First Publish Date - Dec 27 , 2025 | 07:32 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 27, 2025 07:33 IST
నేడు మహిళా కమిషన్‌తో అయేషా మీరా తల్లిదండ్రులు భేటీ
న్యాయ పోరాటంపై కీలక ప్రకటన చేసే అవకాశం
సీబీఐ రిపోర్టు వివరాలు వెల్లడించనున్న ఆయోషా తల్లిదండ్రులు
-
Dec 27, 2025 07:33 IST
గ్రేటర్ విజయవాడపై నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
చంద్రబాబు అధ్యక్షతన గ్రేటర్ విజయవాడపై కీలక సమావేశం
పంచాయతీల తీర్మానాలను కోరుతున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ
గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆర్డినెన్స్ జీఓ ఇవ్వాలని డిమాండ్
-
Dec 27, 2025 07:33 IST
ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఉ.10:30 గంటలకు ఇందిరాభవన్‌లో CWC భేటీ
ఉపాధిహామీ పథకం మార్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనకు యోచన
ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై ఆందోళనకు యోచన
ఉపాధిహమీ పథకం స్థానంలో 'వీబీ జీ రామ్ జీ' చట్టం తెచ్చిన కేంద్రం
నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం
ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై ఆందోళనకు కార్యాచరణ రూపొందించే యోచన
-
Dec 27, 2025 07:32 IST
అమెరికా: కాలిఫోర్నియాలో వర్ష బీభత్సం
పర్వత ప్రాంతాల నుంచి వరదతో అతలాకుతలం
వరదలో కొట్టుకుపోయిన హిల్ రిసార్ట్ కట్టడాలు
కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
-
Dec 27, 2025 07:32 IST
రేపు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
కార్వార్‌లో జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి
4 రోజులపాటు గోవా, జార్ఖండ్, కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన
-
Dec 27, 2025 07:32 IST
ఉత్తరాదిని వణికిస్తున్న చలి
ఉత్తరాదికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
జమ్ముకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లో హిమపాతం
కశ్మీర్‌లో మైనస్ డిగ్రీలలో నమోదవుతున్న ఉష్ణోగ్రత