Breaking News: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపుల ఈమెయిల్.
ABN , First Publish Date - Dec 23 , 2025 | 07:03 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 23, 2025 09:09 IST
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపుల ఈమెయిల్
ఫేక్ బాంబ్ బెదిరింపు మెయిల్స్ పై పోలీస్ సీరియస్..
ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్ పోర్టుకే 28 బాంబ్ బెదిరింపులు
అన్ని చెకింగ్స్ చేసాకా ఫేక్ మెయిల్స్ గా నిర్ధారించిన భద్రత సిబ్బంది
ఇప్పటికే బాంబ్ బెదిరింపుల పై ఆర్జిఐఏ పోలీస్ స్టేషన్ లో 28 కేస్లు నమోదు
ఈ కేస్ ల పై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు నిర్ణయం
వీటిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాలని యోచిస్తున్న ఆర్జీఐఏ పోలీసులు.
డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ చేస్తున్న కేటుగాళ్లు
దీంతో సైబర్ క్రైమ్ పోలీసు కు ఫేక్ బాంబ్ బెదిరింపుల కేసులు బదిలీ చేయనున్న ఎయిర్ పోర్టు పోలీసులు
-
Dec 23, 2025 08:48 IST
అమెరికన్ నేవీని బలోపేతం చేసేందుకు ట్రంప్ ప్లాన్
ట్రంప్ శ్రేణి భారీ యుద్ధ నౌకలను నిర్మిస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికన్ నేవీ కోసం గోల్డెన్ ఫ్లీట్: ట్రంప్
-
Dec 23, 2025 07:07 IST
ఏపీ కేబినెట్ సమావేశం.. ఎప్పుడంటే..
అమరావతి: ఈ నెల 29న ఉ.10:30కు ఏపీ కేబినెట్ సమావేశం
ఈనెల 24న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం 29కి వాయిదా
-
Dec 23, 2025 07:07 IST
అమరావతి: నేటి నుంచి జగన్ కడప జిల్లా పర్యటన
మూడురోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న జగన్
25న క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొని బెంగుళూరు వెళ్ళనున్న జగన్
-
Dec 23, 2025 07:07 IST
అమరావతి: నేడు సీఎం చంద్రబాబు 'క్వాంటం టాక్'
వేల మంది టెక్ విద్యార్ధులతో సీఎం చారిత్రాత్మక లెక్చర్
క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఏపీ ప్రభుత్వం క్వాంటం ప్రోగ్రామ్
-
Dec 23, 2025 07:07 IST
జన్మభూమికి సీఎం చంద్రబాబు
అమరావతి: ఈ నెల 28న అయోధ్య రామ జన్మభూమికి సీఎం చంద్రబాబు
అయోధ్య రామజన్మభూమి కాంప్లెక్స్‌లోని స్వామివారిని దర్శించుకుని...
మధ్యాహ్నం అయోధ్య నుంచి విజయవాడకు చంద్రబాబు
-
Dec 23, 2025 07:03 IST
నెల్లూరు: SHAR నుంచి రేపు భారీ అంతరిక్ష ప్రయోగం
ఉ.8:54 గంటలకు LVM3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగం
నేడు ఉ.8:54 గంటలకు కౌంట్‌డౌన్
LVM3 M6 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు, బరువు 6,400 టన్నులు
LVM3 M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూ బర్డ్-2 ప్రయోగం
LVM3 M6 బాహుబలి రాకెట్ సిరీస్‌లో ఇది 8వ ప్రయోగం