Breaking News: వైకుంఠద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు..
ABN , First Publish Date - Dec 22 , 2025 | 07:56 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 22, 2025 21:37 IST
వైకుంఠద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు..
తిరుమల: వైకుంఠద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేశాం : మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి
ఈ ఏట సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నాం..
టీటీడీ అధికారులకు పలు అంశాలపై దిశా నిర్ధేశం చేశాం..
వైకుంఠద్వార దర్శనాల్లో 90 శాతం సమయం సామాన్య భక్తులకే కేటాయించాం..
ముగ్గురు మంత్రులతో సీఎం సబ్ కమిటీ వేశారు..
టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది..
క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తుల భద్రతపై సమీక్షించాం..
భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలి: మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి
-
Dec 22, 2025 21:28 IST
కృష్ణా జిల్లాలో దారుణం..
కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని గ్రామంలో దారుణం..
ఐదేళ్ల బాలికపై13ఏళ్ల బాలుడు అత్యాచారం..
బాలికకు కేక్ ఇస్తానని ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన బాలుడు..
సోమవారం ఉదయం పాప నొప్పితో ఏడుస్తుండడాన్ని గమనించి హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు..
అనుమానంతో పోలీసులకు సమాచారం అందించిన వైద్యుడు..
ప్రాథమిక విచారణ అనంతరం అత్యాచారం జరిగినట్లు గుర్తించిన పోలీసులు..
బాలుడిపై కేసులు నమోదు చేసిన కూచిపూడి పోలీసులు.
-
Dec 22, 2025 19:53 IST
ఏలూరు: ద్వారకాతిరుమల మండలంలో వైసీపీ నేతల దౌర్జన్యం
దొరసానిపాడులో జగన్ బర్త్‌డే పేరుతో శాంతిభద్రతలకు విఘాతం
సైలెన్సర్లు తీసేసి బైక్‌తో మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరుల వీరంగం
అడ్డుకోబోయిన పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం
పెట్రోల్ పోసి బైక్ అంటిస్తుండగా అడ్డుకున్న పోలీసులపై దాడి
లక్కాబత్తుల సిద్దిరాజు సహా మరో ముగ్గురిపై కేసు నమోదు
-
Dec 22, 2025 18:16 IST
GHMC డీలిమిటేషన్‌పై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
GHMC డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
-
Dec 22, 2025 17:37 IST
ఈనెల 24న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం 29కి వాయిదా
-
Dec 22, 2025 17:36 IST
మంగళగిరి: కులం కోసం నేను పార్టీ పెట్టలేదు: పవన్ కల్యాణ్
ప్రాంతీయ తత్వం, కులాల ఆధారంగా పార్టీలు నిలబడవు: పవన్
పదవి అంటే బాధ్యత... ప్రజా సేవలో చురుగ్గా ఉండాలి: పవన్
పదవి చిన్నదైనా, పెద్దదైనా బాధ్యతగా పనిచేయాలి: పవన్ కల్యాణ్
-
Dec 22, 2025 16:53 IST
హైదరాబాద్: ముగిసిన రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది
హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి
రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలికిన తెలంగాణ గవర్నర్, సీఎం
-
Dec 22, 2025 16:53 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన CRDA సమావేశం
అమరావతి క్వాంటం వ్యాలీకి ప్రత్యేక భవనం: మంత్రి నారాయణ
IAS భవనాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.109.52 కోట్లు
కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయాలకు అథారిటీ ఆమోదం
కేంద్ర ఆయుష్ ఆస్పత్రి, వర్సిటీ కోసం భూమి లీజు
అమరావతిలో వరద నివారణకు కొత్త పంపింగ్ స్టేషన్లు
జరీబ్-నాన్ జరీబ్ భూసమస్యలు పరిష్కారానికి కమిటీ: మంత్రి నారాయణ
-
Dec 22, 2025 16:23 IST
పాలమూరు- రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదు: ఉత్తమ్
ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలకు అన్యాయం చేశారు
ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయితే.. ఎందుకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు?
ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టారు: మంత్రి ఉత్తమ్
-
Dec 22, 2025 16:23 IST
విజయవాడ జైలులో చెవిరెడ్డిని విచారించిన సీబీఐ
కల్తీ నెయ్యి కేసులో చెవిరెడ్డిని విచారించిన సీబీఐ సిట్ అధికారులు
నెయ్యి కాంట్రాక్ట్ మార్పుతో పాటు పలు అంశాలపై సిట్ ప్రశ్నలు
ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
Dec 22, 2025 14:05 IST
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టుకు ఈడీ
సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు
సోనియా, రాహుల్‌పై ఈడీ దాఖలు చేసిన..
చార్జ్‌షీట్‌ను తిరస్కరించిన ట్రయల్ కోర్టు
ట్రయల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ
-
Dec 22, 2025 12:25 IST
హైదరాబాద్: రాచకొండ 2025 క్రైమ్ వార్షిక నివేదిక
2025లో 33వేల క్రైమ్ కేసులు నమోదు: సీపీ సుధీర్‌బాబు
రాచకొండలో పెరిగిన కిడ్నాప్, పోక్సో కేసులు: సీపీ సుధీర్‌బాబు
గతేడాదితో పోలిస్తే 4 శాతం పెరిగిన మహిళలపై నేరాల సంఖ్య
ఈ ఏడాది రూ.20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ కేసుల్లో 668 మంది నిందితులు అరెస్ట్: సీపీ సుధీర్‌బాబు
2వేల కిలోల గంజాయి, 35 కిలోల గంజా చాక్లెట్లు స్వాధీనం: సీపీ సుధీర్‌బాబు
ఎక్సైజ్ చట్టం కింద 656 కేసులు నమోదు, 689 మంది అరెస్ట్
గతేడాదితో పోలిస్తే 74 శాతం పెరిగిన కన్విక్షన్ రేటు: సీపీ సుధీర్‌బాబు
-
Dec 22, 2025 12:24 IST
రెండేళ్ల తర్వాత తోలు తీస్తానని కేసీఆర్ అంటున్నారు: మంత్రి జూపల్లి
BRS పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలింది: జూపల్లి
సర్పంచ్ ఎన్నికల్లో BRS, బీజేపీ కలిసి పనిచేశాయి: మంత్రి జూపల్లి
మూడింట ఒక వంతు సీట్లు కూడా BRS గెలుచుకోలేదు: జూపల్లి
కేటీఆర్, హరీష్‌రావు ఆరోపణలు తప్పని ప్రజలు తీర్పునిచ్చారు: జూపల్లి
బలహీనపడిన పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్ బయటకు వచ్చారు: జూపల్లి
పాలమూరు-రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ అని గతంలో కేసీఆర్ అన్నారు
ఇప్పుడేమో సాగునీటి ప్రాజెక్ట్ అని అసత్యాలు చెబుతున్నారు: జూపల్లి
కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్‌ను.. పదేళ్లలో ఎందుకు చేయలేదు?
299 టీఎంసీలు చాలని ఆనాడు కేసీఆర్ సంతకం ఎలా పెట్టారు?: జూపల్లి
పదేళ్లు పాలించి.. రూ.8లక్షల కోట్లు అప్పులు చేసినా ఎకరా నీళ్లు ఇవ్వలేదు
BRS హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తి చేయలేదు: జూపల్లి
2023 ఎన్నికలప్పుడు ఒక మోటార్ ఆన్‌చేసి పాలమూరు ప్రాజెక్ట్ జాతికి అంకితమన్నారు
నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ అంకితమన్నారు: జూపల్లి
-
Dec 22, 2025 11:59 IST
ప్రమాణ స్వీకారంలో ఘర్షణ
వరంగల్: చెన్నారావుపేట సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఘర్షణ
BRS, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదం, పరస్పరం కుర్చీలతో దాడి
ఒకరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Dec 22, 2025 11:59 IST
సర్పంచ్ ప్రమాణస్వీకారంలో ఘర్షణ
సిద్దిపేట: వర్గల్, జగదేవపూర్‌లో సర్పంచ్ ప్రమాణస్వీకారంలో ఘర్షణ
వర్గల్‌లో అభివృద్ధి పనులపై BRS, కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం
జగదేవపూర్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమంలో కూర్చునేందుకు..
సీటు ఇవ్వలేదని కాంగ్రెస్, BRS మధ్య వివాదం
-
Dec 22, 2025 11:58 IST
మంచిర్యాల: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిధుల కొరత
వేడుకల నిధుల్లో భారీగా కోత విధించిన సింగరేణి యాజమాన్యం
కేవల జీఎం కార్యాలయాల్లోనే వేడుకలు జరుపుకోవాలని ఆదేశం
సంస్థతో సంబంధం లేని వాటికి రూ.కోట్లు కేటాయిస్తూ..
సొంత వేడుకలకు కోత విధించడం దారుణం: కార్మిక సంఘాలు
-
Dec 22, 2025 10:07 IST
మత్స్యకారులకు ఫుడ్ పాయిజన్
కాకినాడ: ఉప్పాడలో 8 మంది మత్స్యకారులకు ఫుడ్ పాయిజన్
తాళ్లరేవు సమీపంలోని ఓ హోటల్‌లో బిర్యాని తిన్న మత్స్యకారులు
వాంతులు, విరేచనాలతో ఆస్వస్థత, పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స
-
Dec 22, 2025 09:05 IST
మంత్రులతో సీఎం సమావేశం.. ఎప్పుడంటే..
సా.4గంటలకు మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టడంపై రేవంత్ దిశానిర్దేశం
పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై చర్చ
-
Dec 22, 2025 08:26 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా విమానం ల్యాండింగ్
ప్రయాణికులను కిందకు దింపు విమానంలో తనిఖీలు
ఏడాదిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20కిపైగా బాంబు బెదిరింపులు
-
Dec 22, 2025 08:23 IST
పల్నాడు: సత్తెనపల్లి మం. పాకాలపాడులో ఘర్షణ
ఫ్లెక్సీల విషయంలో టీడీపీ శ్రేణులపై కర్రలతో వైసీపీ నేతల దాడి
ఇద్దరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Dec 22, 2025 08:23 IST
సత్యసాయి: తనకల్లు మం. ముత్యాలవారిపల్లిలో దారుణం
జగన్ బర్త్‌డే వేడుకల్లో బరితెగించిన వైసీపీ కార్యకర్తలు
వైసీపీ కార్యకర్తలు టపాసులు పేలుస్తుండగా అడ్డుచెప్పిన గర్భిణి
గర్భవతి అని చూడకుండా మహిళపై వైసీపీ కార్యకర్త విజయ్ దాడి
తీవ్రంగా గాయపడిన గర్భిణికి కదిరి ఆస్పత్రిలో చికిత్స
సత్యసాయి: పోలీసుల అదుపులో వైసీపీ కార్యకర్త విజయ్
-
Dec 22, 2025 07:57 IST
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
288 మున్సిపల్ కౌన్సిళ్లలో 117 బీజేపీ కైవసం
శివసేన 53, NCP 37, కాంగ్రెస్ 28, NCP (SP) 7, శివసేన (UBT) 9
అధికార మహాయుతి కూటమికి 207 మున్సిపల్ కౌన్సిళ్లలో విజయం
-
Dec 22, 2025 07:56 IST
విజయవాడ: బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం
స్నేహితురాలికి పంపిన మెసేజ్‌తో గుర్తించిన పోలీసులు
ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
సోషల్ మీడియాతో పరిచయంతో బాలికపై యువకుడు అత్యాచారం