గ్రూప్-2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - Nov 27 , 2025 | 08:05 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 27, 2025 20:35 IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై భేటీలో చర్చ
పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు సీఎం రేవత్ దిశా నిర్దేశం
తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా...
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలి: రేవంత్ రెడ్డి
2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా...
తెలంగాణను తీర్చిదిద్దేలా స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీలో ఉండాలి: సీఎం
తెలంగాణ ఆర్థికాభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలి: సీఎం
తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలి.
-
Nov 27, 2025 19:54 IST
హైదరాబాద్: ఐఎస్‌సదన్‌లో గాలిపటం మాంజా విషయంలో ఘర్షణ
మొహమ్మద్ రేహాన్(19)పై కత్తితో దాడిచేసిన మొహమ్మద్ జైన్
గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు రేహాన్
-
Nov 27, 2025 18:09 IST
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం
బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ 5లోపు కోర్టుకు హాజరుకాకపోతే..
నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించిన హైకోర్టు
-
Nov 27, 2025 17:33 IST
ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్ బిగ్ ఆపరేషన్
20 ప్రాంతాల్లో ఈగల్ టీమ్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దాడులు
50 మంది నైజీరియన్లు అరెస్ట్, కేజీకి పైగా డ్రగ్స్ సీజ్
డ్రగ్స్ సేల్స్ గర్ల్స్‌తో పాటు సెక్స్ వర్కర్లు అరెస్ట్
-
Nov 27, 2025 17:32 IST
IPS సంజయ్ కుమార్ సస్పెన్షన్ మరో 6నెలలు పొడిగింపు
వచ్చే ఏడాది మే వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన IPS సంజయ్
ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్
-
Nov 27, 2025 17:32 IST
అమరావతి: జాస్తి కృష్ణకిషోర్‌పై తదనంతర చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు
ఈడీబీ సీఇఓగా ఉన్న కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం
అప్పట్లో కృష్ణ కిషోర్‌పై ఉన్న సస్పెన్షన్‌ను కొట్టివేసిన క్యాట్
కృష్ణ కిషోర్‌పై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు
కృష్ణ కిషోర్‌కు అప్పట్లో క్లీన్ చిట్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
-
Nov 27, 2025 16:45 IST
రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: నాదెండ్ల
24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్
అయినా వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్
రూ.1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతలా మాట్లాడేది: నాదెండ్ల
8 లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి నాదెండ్ల మనోహర్
కృష్ణా జిల్లాలో లక్షా 7 వేల టన్నుల ధాన్యం సేకరించడం రికార్డు: మంత్రి నాదెండ్ల
గోదావరి జిల్లాల నుంచి లక్ష టన్నుల పైనే ధాన్యం సేకరించాం: మంత్రి నాదెండ్ల
-
Nov 27, 2025 16:45 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసులో సిట్ కస్టడీకి అనిల్ చోక్రా
మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కామ్ కేసులో ఏ49 నిందితుడిగా ఉన్న అనిల్ చోక్రా
-
Nov 27, 2025 16:21 IST
విజయవాడ: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్‌పై ACB కోర్టులో విచారణ
జైలులో చెవిరెడ్డికి సౌకర్యాలు కల్పించాలని ACB కోర్టు ఆదేశం
ఆనారోగ్య దృష్ట్యా జైలులో దిండు, పరుపు, ఫ్యాన్ ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్
-
Nov 27, 2025 16:10 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డిని ప్రశ్నిస్తోన్న సిట్
విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన సునీల్‌రెడ్డి
గతంలో సునీల్‌రెడ్డి నివాసంలో కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసిన అధికారులు
-
Nov 27, 2025 16:06 IST
తిరుమల: కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్
టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్
తిరుపతి రుయా ఆస్పత్రిలో సుబ్రహ్మణ్యంకు వైద్య పరీక్షలు
కల్తీ నెయ్యి కేసులో 10కి చేరిన అరెస్టుల సంఖ్య
-
Nov 27, 2025 16:06 IST
విజయవాడ: లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ
పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి
-
Nov 27, 2025 15:53 IST
సిగాచీ పేలుళ్లపై దాఖలైన పిల్ విచారణలో తెలంగాణ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం
పేలుడు సాధారణ ఘటన కాదు.. 54 మంది చనిపోయారు: సీజే
ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడమేంటి?: సీజే
237 మంది సాక్షులను ప్రశ్నించినా దర్యాప్తులో పురోగతి లేదా?: సీజే
పేలుడు ఘటనకు ఇప్పటివరకు బాధ్యులను గుర్తించలేదా?: సీజే
పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా?
ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారా?: సీజే
పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి హాజరుకావాలని హైకోర్టు ఆదేశం
-
Nov 27, 2025 14:13 IST
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్‌లో మరో పోస్ట్
మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం: డీకే శివకుమార్
జడ్జి అయినా, అధినేత అయినా.. నేను అయినా సరే..
మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి: ఎక్స్‌లో డీకే
-
Nov 27, 2025 14:12 IST
HILT పాలసీపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి ఉత్తమ్
సిటీని పొల్యూషన్ నుంచి కాపాడాలనే HILT పాలసీ: ఉత్తమ్
HILT పాలసీలో ఎటువంటి స్కామ్ లేదు: మంత్రి ఉత్తమ్
మేం తెచ్చిన పాలసీ బీజేపీ, BRS నేతలకు అర్థం కావడం లేదు
ORR లోపల పొల్యూషన్ లేకుండా చేయాలన్నదే మా ఆలోచన
BRS ప్రభుత్వంలో కూడా HILT పాలసీపై చర్చ జరిగింది: ఉత్తమ్
కొత్త ఇండస్ట్రియల్ పాలసీతో తెలంగాణకు అదనపు ఆదాయం: ఉత్తమ్
భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్ట్ పెద్ద కుంభకోణం: మంత్రి ఉత్తమ్
భద్రాద్రి ప్రాజెక్ట్‌కు అవుట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముంది?: ఉత్తమ్
-
Nov 27, 2025 14:12 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ OSD రాజశేఖర్‌రెడ్డి విచారణ
రాజశేఖర్‌రెడ్డిని 2గంటలు ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్
టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్‌రావు స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు
రాధకిషన్‌రావు స్టేట్‌మెంట్‌లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన
కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు..
తాము పనిచేశామని గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చిన రాధకిషన్‌రావు
-
Nov 27, 2025 12:31 IST
ఘోర రైలు ప్రమాదం..
చైనాలో రైలు ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి
కన్మింగ్ ప్రాంతంలో ఎక్విప్‌మెంట్ టెస్టింగ్ సమయంలో ఘటన
-
Nov 27, 2025 12:02 IST
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట
సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
2019లో సెలెక్షన్ లిస్ట్ రద్దు చేస్తూ నవంబర్ 18న సింగిల్ బెంచ్ తీర్పు
-
Nov 27, 2025 12:02 IST
విశాఖ: సుహామ్ ఫార్మసీలపై డ్రగ్ కంట్రోల్ దాడులు
దాన్ ఫౌండేషన్‌లో నడుస్తున్న సుహామ్ ఫార్మసీలపై PGRSలో ఫిర్యాదులు
సుహామ్ ఫార్మసీల్లో అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులతో తనిఖీలు
ఎంవీపీలోని సుహామ్ ఫార్మసీ సీజ్, 5 బ్రాంచ్‌లకు షోకాజ్ నోటీసులు
-
Nov 27, 2025 12:02 IST
ప.గో.: భీమవరంలో అంతర్జాతీయ డిజిటల్ ముఠా గుట్టురట్టు
రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మకు సీబీఐ అధికారులమంటూ ఫోన్
డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని శర్మకు బెదిరింపులు
13 రోజుల్లో రూ.78లక్షలు కాజేసిన కేటుగాళ్లు, పోలీసులకు ఫిర్యాదు
13 మంది అరెస్ట్, పరారీలో ప్రధాన సూత్రధారి రహతే(ముంబై)
రూ.42లక్షలు రికవరీ, వివిధ బ్యాంక్ ఖాతాల్లో రూ.19లక్షలు ఫ్రీజ్
కార్డ్ డీల్ ద్వారా భారతీయుల బ్యాంక్ ఖాతాలు సేకరించి..
కంబోడియాకు పంపుతున్న సైబర్ నేరగాళ్లు
-
Nov 27, 2025 11:14 IST
హైదరాబాద్: స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం
క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించిన మోదీ
-
Nov 27, 2025 11:14 IST
మండలి చైర్మన్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ అంశంలో..
మండలి చైర్మన్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై విచారణ జరిపి..
4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్‌కు ఆదేశం
రాజీనామాపై సుదీర్ఘ కాలం చైర్మన్ నిర్ణయం వెల్లడించకపోవడాన్ని తప్పుపట్టిన హైకోర్టు
-
Nov 27, 2025 11:14 IST
బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా: నిజామాబాద్ ఎంపీ అర్వింద్
కేంద్ర నిధుల కోసమే స్థానిక ఎన్నికలు: ఎంపీ అర్వింద్
పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి: ఎంపీ అర్వింద్
-
Nov 27, 2025 11:14 IST
తిరుపతి: వైసీపీ నేత మధుసూదన్‌రెడ్డి తల్లి జయమ్మ హత్య
శ్రీకాళహస్తి వైసీపీ నేత మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులపై కత్తులతో దుండగుల దాడి
శ్రీకాళహస్తి మం. పుల్లారెడ్డి కండ్రిగలోని ఇంట్లోకి చొరబడ్డ దుండగులు
మహదేవరెడ్డి, జయమ్మపై దుండగుల దాడి
జయమ్మ (80) మృతి, మహదేవారెడ్డిని ఆస్పత్రికి తరలింపు
చోరీ లేక హత్య చేయడానికి వచ్చారా అన్న దానిపై పోలీసుల దర్యాప్తు
-
Nov 27, 2025 10:42 IST
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు మెుదలైన నామినేషన్ల ప్రక్రియ
డిసెంబర్ 11న తొలివిడతలో 4,236 గ్రామాల్లో ఎన్నికలు
నేటి నుంచి ఈ నెల 29వరకు నామినేషన్ల స్వీకరణ
ఈనెల 30న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వరకు గడువు
-
Nov 27, 2025 09:57 IST
ఢిల్లీ పటేల్‌నగర్‌లో ఎన్‌కౌంటర్
పోలీసుల తనిఖీల్లో ఎదురుపడ్డ కరుడుగట్టిన నేరగాడు అంకిత్
పోలీసులపై కాల్పులకు తెగబడ్డ అంకిత్
గాయాలైన అంకిత్‌కి ప్రస్తుతం కొనసాగుతున్న చికిత్స
ఓ హత్య కేసులో కీలక నిందితుడు అంకిత్
-
Nov 27, 2025 09:57 IST
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
లైఫ్‌టైమ్ గరిష్ఠ సూచీని తాకిన నిఫ్టీ
26,278 పాయింట్లు దాటిన నిఫ్టీ
300 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
-
Nov 27, 2025 09:56 IST
తొలి విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
డిసెంబర్ 11న తొలివిడతలో 4,236 గ్రామాల్లో ఎన్నికలు
నేటినుంచి ఈ నెల 29వరకు నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వరకు గడువు
-
Nov 27, 2025 08:29 IST
ఉగ్ర దాడి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్ర దాడి
ముగ్గురు పాకిస్థాన్ పోలీసులు మృతి, 22 మంది ఉగ్రవాదులు హతం
-
Nov 27, 2025 08:29 IST
వచ్చే G20 సదస్సుపై దక్షిణాఫ్రికాపై నిషేధం: ట్రంప్
శ్వేతజాతి రైతులపై దాడులకు నిరసనగా ట్రంప్ నిర్ణయం
2026 G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా
-
Nov 27, 2025 08:05 IST
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
24 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
తమిళనాడు దగ్గర ఈనెల 29న తీరం దాటే అవకాశం
ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీపై ప్రభావం
ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో ఒకట్రెండుచోట్ల భారీ వర్ష సూచన
ఈనెల 29న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఈనెల 30న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
Nov 27, 2025 08:05 IST
నేటి నుంచి వైకుంఠ ఏకాదశి టికెట్ల రిజిస్ట్రేషన్
మొదటి 3 రోజులకు డిసెంబర్ 2న లక్కీడిప్
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు దర్శనాలు