BREAKING: భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు
ABN , First Publish Date - Nov 25 , 2025 | 07:15 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 25, 2025 20:51 IST
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి అసంతృప్తి
అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌కి మంత్రి కోమటిరెడ్డి లేఖ.
తనను, తన కుటుంబాన్ని పున్నా అసభ్య పదజాలంతో దూషించాడని లేఖ.
డీసీసీ అధ్యక్ష పదవికి పున్నా కైలాష్ అర్హుడు కాదు: మంత్రి కోమటిరెడ్డి.
-
Nov 25, 2025 19:37 IST
టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల..
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్.
అహ్మదాబాద్ వేదికగా మార్చిన 8న ఫైనల్ మ్యాచ్.
పాకిస్తాన్ ఫైనల్ చేరితే ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పు.
-
Nov 25, 2025 19:35 IST
భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు
టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్న 20 దేశాల టీమ్‌లు
ఒక్కో గ్రూపులో ఐదు టీమ్‌లుగా మొత్తం 4 గ్రూపులు
ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీమ్‌లు సూపర్-8కి అర్హత
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్
-
Nov 25, 2025 16:47 IST
GHMCలో విలీనం కానున్న మున్సిపాలిటీలు ఇవే..
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం GHMCలో విలీనం అవనున్న మున్సిపాలిటీలు ఇవే. పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట.
-
Nov 25, 2025 16:38 IST
అమరావతి: కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకారం.
మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు అంగీకారం.
గిరిజన సంస్కృతికి ఇబ్బంది కలగకుండా నూతన జిల్లా ఏర్పాటు.
ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరిగే అవకాశం.
-
Nov 25, 2025 15:17 IST
ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ చిత్రం
యానిమేషన్ విభాగంలో ఆస్కార్‌కు మహావతార్ నరసింహ.
యానిమేషన్ విభాగంలో పోటీపడుతున్న మొత్తం 35 చిత్రాలు.
-
Nov 25, 2025 14:35 IST
పర్యాటక కేంద్రంగా కర్రెగుట్టలు..
ములుగు : కర్రెగుట్టలను పర్యాటక కేంద్రంగా చేసేందుకు మరో అడుగు.
వాజేడు మండలం మొరుమూరులో మరో సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రారంభించిన సీఆర్‌పీఎఫ్ ఐజి విక్రమ్, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్.
కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన పోలీసులు.
వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో రెండో సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు.
మొదటి ఆలుబాక కాగా, రెండవది మొరుమూరు.
సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ క్యాంప్‌నకు అనుసంధానంగా కర్రెగుట్టలకు రహదారి నిర్మించి మరో క్యాంప్ ఏర్పాటు చేస్తామని వెల్లడి.
-
Nov 25, 2025 14:32 IST
మలక్కా జలసంధిలో తీవ్ర అల్పపీడనం
48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం.
ఈనెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, సీమలో వర్షాలు.
రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.
-
Nov 25, 2025 12:35 IST
భారత సాంస్కృతి చైతన్యానికి సాక్షి అయోధ్య: ప్రధాని మోదీ
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి: ప్రధాని మోదీ
ధర్మ ధ్వజం కేవలం జెండా కాదు.. భారత సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం
సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం: ప్రధాని మోదీ
ధర్మ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుంది: మోదీ
ధర్మ ధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇస్తుంది: మోదీ
కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మ ధ్వజం చెప్తుంది: ప్రధాని మోదీ
పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం: ప్రధాని
ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెప్తుంది: మోదీ
-
Nov 25, 2025 12:27 IST
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం
విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండాగా భేటీ
రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై చర్చలు
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం
-
Nov 25, 2025 12:27 IST
సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో కర్రెగుట్టలు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలను...
పూర్తిగా హస్తగతం చేసుకున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు
ములుగు జిల్లా వాజేడు-మొరుమూరులో సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్
-
Nov 25, 2025 12:27 IST
39వ కొత్త బెటాలియన్‌ను ప్రారంభించిన సీఆర్‌పీఎప్ ఐజీ
కర్రెగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించాం: ఐజీ
కర్రె గుట్టలను సురక్షితంగా మారుస్తాం: ఐజీ త్రివిక్రమ్
త్వరలో కర్రెగుట్టలపైకి రోడ్ వే: ఐజీ త్రివిక్రమ్
-
Nov 25, 2025 09:38 IST
శాలిబండ అగ్నిప్రమాదంపై కేసు నమోదు
ఎలక్ట్రానిక్స్ షాపులో ప్రమాదంపై మొఘల్‌పురా పోలీసుల దర్యాప్తు
ప్రమాదంలో కుట్ర కోణంలో మొఘల్‌పురా పోలీసుల దర్యాప్తు
ప్రమాదంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వని పోలీసులు
-
Nov 25, 2025 09:37 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి దోపిడీకి యత్నం
డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి కత్తులతో దాడి చేసిన దుండగులు
దోపిడీలో వాచ్‌మన్ ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు, ఐదుగురు అరెస్ట్
కత్తులతో ఇంటి ఓనర్, డ్రైవర్‌పై దాడికి పాల్పడిన వాచ్‌మన్ ముఠా
అగర్వాల్ నివాసానికి చాలాకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నిందితుడు రాధాచంద్
ఓనర్ ఇంట్లోనే దోపిడీ చేయాలని మరో ఐదుగురితో కలిసి రాధాచంద్ ప్లాన్
జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే అజయ్ అగర్వాల్ ఇంట్లో ఘటన
-
Nov 25, 2025 09:37 IST
హైదరాబాద్: బీజేపీ కార్పొరేటర్ల నిరసన
GHMC సమావేశానికి దున్నపోతుతో బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన
చేతికి సంకెళ్లు వేసుకుని GHMCకి వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు
-
Nov 25, 2025 07:46 IST
జగ్గయ్యపేటలో ఆర్టీసీ డిపోలో ఆగిపోయిన అద్దె బస్సులు
ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడులతో నిలిచిన అద్దె బస్సులు
ఆర్టీసీ బస్టాండ్‌లో ఒకరిపై మరొకరు,..
ఆర్టీసీ డిపోలో మరొకరిపై రౌడీషీటర్, ఆటో డ్రైవర్లు దాడి
దాడికి నిరసనగా బస్సులు నిలిపివేసి అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన
అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళనతో ఆగిపోయిన 32 బస్సులు
-
Nov 25, 2025 07:17 IST
తెలంగాణ మహిళలకు నేడు వడ్డీలేని రుణాల పంపిణీ
3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు
నిన్న మహిళా సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ
నేడు అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి వడ్డీలేని రుణాల పంపిణీ
-
Nov 25, 2025 07:15 IST
అయోధ్య శ్రీరామ్‌లల్లా ఆలయంలో నేడు పవిత్ర ధ్వజారోహణం
ధ్వజారోహణం కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ
ఉదయం 10 గంటలకు సప్తరుషి మందిరానికి వెళ్లనున్న ప్రధాని
సప్తరుషి మందిర దర్శనానంతరం శేషావతర మందిరానికి వెళ్లనున్న ప్రధాని
ఉ.11 గంటలకు అన్నపూర్ణాదేవి మందిరాన్ని దర్శించుకోనున్న ప్రధాని
రామ్‌లల్లా మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధాని మోదీ
రామ్‌లల్లా మందిర శిఖరంపై ధ్వజారోహణం చేయనున్న ప్రధాని మోదీ
అభిజిత్ ముమూర్తంలో ధ్వజారోహణం చేయనున్న ప్రధాని మోదీ
కాషాయరంగు ధర్మధ్వజాన్ని ఎగరవేయనున్న ప్రధాని మోదీ
-
Nov 25, 2025 07:15 IST
దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం
అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం
రేపు బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం
శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు