Breaking News: పులివెందుల ఎన్నికపై మంత్రి లోకేష్ కీలక ట్వీట్..
ABN , First Publish Date - Aug 12 , 2025 | 07:15 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 12, 2025 20:18 IST
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: నారా లోకేష్
అమరావతి: పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: మంత్రి లోకేష్
30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు.
వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది.
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు.
ట్వి్ట్టర్‌లో మంత్రి నారా లోకేష్ పోస్ట్.
-
Aug 12, 2025 20:02 IST
ట్రంప్ చిత్రపటానికి బ్లీచింగ్ ఫౌడర్..
పశ్చిమగోదావరి: ఉండి మండలం యండగండి గ్రామంలో ఆక్వా రైతులు వినూత్న నిరసన.
ట్రంప్ చిత్రపటానికి బ్లీచింగ్ చల్లి నిరసన వ్యక్తం చేసిన ఆక్వా రైతులు.
ప్రపంచ దేశాలు బాగుండాలంటే ట్రంప్ వైరస్ పోవాలి.
కరోనా సమయంలో కరోనా వైరస్ పోవాలని బ్లీచింగ్‌తో శానిటేషన్ చేశాం.
ఇప్పుడు మరలా ట్రంప్ అనే వైరస్ పోవాలని ట్రంప్ చిత్రపటానికి బ్లీచింగ్ కొట్టి శానిటేషన్ చేస్తున్నాం.
ఆక్వా రైతులకు పట్టిన ట్రంప్ వైరస్ పోవాలి.
-
Aug 12, 2025 18:44 IST
పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయం: బీటెక్ రవి
ఓటమి భయంతోనే వైసీపీ ఆరోపణలు: బీటెక్ రవి
పులివెందులలో టీడీపీ బలపడుతోంది: బీటెక్ రవి
-
Aug 12, 2025 17:13 IST
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలకు ముగిసిన పోలింగ్
సా.5 గంటల్లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
ఎల్లుండి జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు
పులివెందులలో సా.4 గంటల వరకు 74.57% పోలింగ్
ఒంటిమిట్టలో సా.4 గంటల వరకు 66.39% పోలింగ్ నమోదు
-
Aug 12, 2025 16:04 IST
మరో పథకం అమలుకు ఏపీ సర్కార్ శ్రీకారం..
అమరావతి: ‘స్త్రీ శక్తి’ పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఈనెల 15 నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం.
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: సీఎం చంద్రబాబు
రద్దీ నిర్వహణ, మర్యాదపూర్వక ప్రవర్తన, భద్రత ముఖ్యం: సీఎం
ఆటోడ్రైవర్లకు సాయంపైనా సమగ్ర అధ్యయనం.
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశం.
-
Aug 12, 2025 15:26 IST
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీకి కొత్త సెమీకండక్టర్ యూనిట్ కేటాయింపు
నాలుగు సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
AP సహా ఒడిశా, పంజాబ్‌లో కొత్త సెమీకండక్టర్ యూనిట్లు
లక్నో మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Aug 12, 2025 14:46 IST
బయటకెళ్తున్నారా.. జాగ్రత్త.. ఇది చూడండి..
‘హైదరాబాద్ నగర వ్యాప్తంగా మంగళవారం (12/08/2025) భారీ వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోండి. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోగలరు.’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.

-
Aug 12, 2025 14:16 IST
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..
ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు.
ఫేకల్ స్లజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు.
77 FSTP ప్లాంట్ల నిర్మాణానికి రూ.115.5 కోట్లకు పరిపాలన అనుమతులు.
ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.
-
Aug 12, 2025 14:04 IST
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల దగ్గర వజ్రాల వేట
రూ.కోట్ల విలువైన వజ్రాలు దొరికినట్లు సోషల్ మీడియాలో వైరల్
-
Aug 12, 2025 12:26 IST
మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యనేత అడ్డుకుంటున్నారు: రాజగోపాల్‌రెడ్డి
కాంగ్రెస్‌లోకి తీసుకున్నప్పుడు తెలియదా అన్నదమ్ములం ఉన్నామని?
లోక్‌సభ ఎన్నిక సమయంలో కూడా ప్రామిస్ చేశారు: రాజగోపాల్‌రెడ్డి
కాంగ్రెస్ తీరు ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది: రాజగోపాల్‌రెడ్డి
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు
11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా: రాజగోపాల్‌రెడ్డి
అన్నదమ్ములకు మంత్రి పదవులుంటే తప్పేంటి?: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
-
Aug 12, 2025 11:34 IST
దరాబాద్: చందానగర్‌లో కాల్పుల కలకలం
ఖజానా జ్యువెలర్స్ షాప్‌లో దుండగుల కాల్పులు
దుండగుల కాల్పుల్లో సిబ్బందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
దుండగుల కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు
-
Aug 12, 2025 10:31 IST
శ్రీశైలం జలాశయానికి భారీ వరద, 4 గేట్లు ఎత్తివేత
ఈ సీజన్‌లో మూడోసారి గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం ఇన్‌ఫ్లో 2,02,456 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,09,199 క్యూసెక్కులు
పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి 35 వేల క్యూసెక్కులు విడుదల
కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా 1,08,076 క్యూసెక్కులు విడుదల
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 822 అడుగులు
-
Aug 12, 2025 10:31 IST
భారీ పేలుడు..
యాదాద్రి: పెద్దకందుకూరు దగ్గర ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు
ప్రీమియర్ కంపెనీలో పేలుడు, కార్మికుడు సదానందం మృతి
ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్ బయట స్టీమ్ పైప్ ఓపెన్ చేస్తుండగా ఘటన
-
Aug 12, 2025 10:31 IST
ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: దూల్‌పేట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత, ముగ్గురు అరెస్ట్
గంజాయితో పాటు LSD బోల్డ్స్, MDMA డ్రగ్స్ సీజ్ చేసిన ఎక్సైజ్
పరారీలో ఉన్న మరో ఐదుగురికి కోసం పోలీసుల గాలింపు
-
Aug 12, 2025 10:31 IST
ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాచపల్లిలో ఉద్రిక్తత
చింతరాజుపల్లె పోలింగ్ బూత్‌లో ఘర్షణ
బూత్‌లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం
-
Aug 12, 2025 10:31 IST
జడ్పీటీసీ ఎన్నికలు.. ఉద్రిక్తత..
కడప: కణంపల్లిలో పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం
బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చారని ఆరోపణ
-
Aug 12, 2025 10:31 IST
కడప: పులివెందులలో టెన్షన్ వాతావరణం
పులివెందులలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి
కానేపల్లె నుంచి అచ్చవెళ్లికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడి
ఓటు వేయడానికి వెళ్తున్నవారి కారును ధ్వంసం చేసిన వైసీపీ గూండాలు
-
Aug 12, 2025 10:31 IST
అమరావతి: నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్
ఉ.11:15కి సచివాలయం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఉ.11:30కి స్త్రీశక్తి పథకం అమలుపై సమీక్ష
మ.12:15కు సీఆర్డీఏపై సమీక్షించనున్న చంద్రబాబు
సా.4:35కు 5వ పీ4, స్వర్ణాంధ్ర విజన్ వర్క్‌షాప్
175 నియోజకవర్గాల ప్రొఫెనల్స్‌తో వర్క్‌షాప్
-
Aug 12, 2025 10:31 IST
పులివెందుల పోలింగ్ శాతం ఇదే..
పులివెందులలో 9 గంటల వరకు 20.93 శాతం పోలింగ్
ఒంటిమిట్లలో 9 గంటల వరకు 16.82 శాతం పోలింగ్
-
Aug 12, 2025 10:31 IST
గ్యాంగ్ వార్..
హైదరాబాద్: ఎల్బీనగర్‌లో అవినాష్ కాలేజీ విద్యార్థుల గ్యాంగ్ వార్
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విద్యార్థులు, సీసీ టీవీలో రికార్డు
మొత్తం 15మందిపై ఎల్బీనగర్ పోలీసులు కేసునమోదు
-
Aug 12, 2025 09:06 IST
కడప: పులివెందులలో టెన్షన్ వాతావరణం
పులివెందులలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గుండాలు దాడి
కానేపల్లె నుంచి అచ్చవెళ్లికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడి
ఓటు వేయడానికి వెళ్తున్నవారి కారును ధ్వంసం చేసిన వైసీపీ గుండాలు
-
Aug 12, 2025 08:25 IST
p4పై చంద్రబాబు సమీక్ష
అమరావతి: నేడు p4 పై సీఎం చంద్రబాబు సమీక్ష
నియోజక వర్గాల్లో p4 ప్లానింగ్‌పై అధికారులతో చర్చ
బంగారు కుటుంబాలకు చేసే ఆర్ధిక సాయంపై సమీక్ష
-
Aug 12, 2025 08:25 IST
ఉత్తర కోస్తా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచన
సహాయకచర్యల కోసం విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్స్
టోల్ ఫ్రీ నెంబర్స్: 112, 1070. 1800 425 0101
-
Aug 12, 2025 08:25 IST
మరోసారి భేటీ..
హైదరాబాద్: నేడు నిర్మాతలు, ఫిలింఫెడరేషన్ సభ్యుల సమావేశం
సినీ కార్మికుల వేతనాల పెంపు, సమస్యలపై చర్చ
టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు నేతృత్వంలో జరగనున్న సమావేశం
-
Aug 12, 2025 08:25 IST
10కిచేరిన మృతులు..
మహారాష్ట్ర: పుణె జిల్లాలో లోయలో పడిన వ్యాన్, 10కిచేరిన మృతులు
పాపల్‌వాడిలోని కుందుశ్వర్ ఆలయానికి వెళ్తుండగా ఘటన
-
Aug 12, 2025 08:25 IST
కడప: పులివెందులలో టీడీపీ, వైసీపీ నేతల హౌస్ అరెస్ట్
పులివెందుల ZPTC ఉపఎన్నిక నేపథ్యంలో ముందస్తు చర్యలు
అవినాష్‌రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
TDP ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి హౌస్ అరెస్ట్
-
Aug 12, 2025 08:25 IST
ఏపీ లిక్కర్ కేసులో సప్లిమెంటరీ చార్జిషీట్
నిందితులు ధనుంజయరెడ్టి, కృష్ణమోహనరెడ్డి,..
బాలాజీ గోవిందప్పల పాత్రపై సిట్ సప్లిమెంటరీ చార్జిషీట్
సిండికేట్ భేటీలు, ముడుపుల సేకరణ, డిస్టిలరీల యజమానులతో భేటీలు..
మద్యం విధానం మార్పు, లోకల్ బ్రాండ్ల తయారీపై జరిగిన భేటీలపై సిట్ నివేదిక
PSR ఆంజనేయులు సూచన మేరకు మద్యం నోట్ ఫైల్స్‌ను ధ్వంసం: సిట్
ప్రశ్నించిన రజిత భార్గవ్‌పై ఒత్తిడి తెచ్చారని వివరించిన సిట్ అధికారులు
రజిత్ భార్గవ్ స్టేట్‌మెంట్ కూడా చార్జిషీట్‌లో పేర్కొన్న సిట్
ముగ్గురి ఖాతాల నుంచి నగదు బదిలీని చార్జిషీట్‌లో పేర్కొన్న సిట్
ముగ్గురు బంధువులు పేరిట కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించిన సిట్
-
Aug 12, 2025 08:25 IST
ఈ నెల 13న ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై చర్చ
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై భారీగా వినతులు
వినతులపై జీవోఎం ఏర్పాటు చేసిన ప్రభుత్వం
-
Aug 12, 2025 08:25 IST
పోలీస్ స్టేషన్ కు రాంగోపాల్ వర్మ..
ప్రకాశం: నేడు ఒంగోలు రూరల్ పీఎస్‌కు డైరెక్టర్ RGV
విచారణకు హాజరుకావాలని రూరల్ పోలీసుల నోటీసులు
చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫొటోలు మార్ఫింగ్ కేసులో నోటీసులు
-
Aug 12, 2025 07:16 IST
అమెరికాలో కాల్పుల కలకలం
టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 12, 2025 07:16 IST
అవినాష్ రెడ్డి అరెస్టు..
కడప: ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసి వాహనంలో తరలింపు
-
Aug 12, 2025 07:15 IST
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలు
రెండు జడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్యర్థులు పోటీ
పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు
ఒంటిమిట్ట పరిధిలో 30 పోలింగ్ కేంద్రాలు
జడ్పీటీసీ ఉపఎన్నికలకు భారీ బందోబస్తు
సాయంత్రం ఐదు వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్