Breaking News: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ABN , First Publish Date - Aug 11 , 2025 | 09:25 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 11, 2025 21:39 IST
అమరావతి: RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష
RTGSలో అవేర్ 2.0 వెర్షన్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు
నవంబరు కల్లా డేటా లేక్ పూర్తి: సీఎం చంద్రబాబు
ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు
నియోజకవర్గాల్లో సమస్యలపైనా శాస్త్రీయ విశ్లేషణ: చంద్రబాబు
డ్రోన్లను పెద్దఎత్తును వినియోగించుకోవాలి: సీఎం చంద్రబాబు
ఎరువుల వినియోగం తగ్గేలా టెక్నాలజీని వినియోగించాలి: సీఎం
-
Aug 11, 2025 21:14 IST
ఏపీ మెగా DSC ఫలితాలు విడుదల
16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ-2025 నిర్వహణ
-
Aug 11, 2025 20:55 IST
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు
రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చ
ఎంపీలందరిని అమిత్ షాకు పరిచయం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
-
Aug 11, 2025 19:52 IST
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు
జగదీష్ రెడ్డి ఇంటర్నేషనల్ లీడర్: మంత్రి కోమటి రెడ్డి
మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లు ఇచ్చేవారి వెంటే తిరిగేవారు
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఎకరం 50 లక్షలు ఉంటే...
జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఎకరం రూ.40 కోట్లు ఉంది: కోమటిరెడ్డి
80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్ ఉంది
జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం: మంత్రి కోమటి రెడ్డి
-
Aug 11, 2025 19:26 IST
కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న రాజీనామాకు ఆమోదం
కేఎన్ రాజన్న రాజీనామాకు గవర్నర్ ఆమోదం
ఈసీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టిన రాజన్న
రాజన్న తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం
-
Aug 11, 2025 19:08 IST
అమరావతి: పూర్తికావస్తున్న CRDA ప్రాజెక్ట్ కార్యాలయం నిర్మాణం
రాయపూడిలో CRDA ప్రాజెక్ట్ ఆఫీసులను పరిశీలించిన మంత్రి నారాయణ
ఆధునిక హంగులతో 2 లక్షల 42 వేల 481 చ.అ.విస్తీర్ణంలో G+7 భవనం నిర్మాణం
ప్రతి అంతస్తులో అధికారుల క్యాబిన్లు, ఉద్యోగుల వర్క్ స్టేషన్లు పరిశీలించిన మంత్రి
CRDA, ADCతో సహా మున్సిపల్ శాఖకు చెందిన...
పలు విభాగాలను ఈ భవనంలోకి తరలించనున్న ప్రభుత్వం
వీలైనంత త్వరగా CRDA ప్రాజెక్ట్ ఆఫీసు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం
-
Aug 11, 2025 18:58 IST
ఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ
ఉక్రెయిన్ తాజా పరిణామాలను ప్రధాని మోదీకి వివరించిన జెలెన్ స్కీ
శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ప్రధాని మోదీ
శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఉంటుందని తెలిపిన మోదీ
భారత్ అందించే సహకారం కొనసాగుతుందని మోదీ భరోసా
భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సమీక్ష
పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం పెంపు మార్గాలపై చర్చ
భవిష్యత్‌లోనూ సంప్రదింపులు కొనసాగించాలనే అంగీకారం
-
Aug 11, 2025 18:43 IST
డెన్మార్క్, మలేషియా వినియోగదారుల నుంచి పాకిస్ధాన్‌కు అక్రమ ఎగుమతి
13,800 కిలోల ట్రామడాల్‌ను అక్రమంగా పాకిస్థాన్‌కు ఎగుమతి
ట్రామడాల్ ఎగుమతులతో రూ.5.46కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తింపు
లుసెంట్ సంస్థకు చెందిన రూ.5.46 కోట్ల విలువైన...
భవనాలు, ఫ్యాక్టరీ ప్రాంగణాలను తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ
-
Aug 11, 2025 18:42 IST
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం
అమీర్‌పేట్, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట్‌లో వర్షం
కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్‌లో వర్షం
రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహిదీపట్నంలో వర్షం
జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, జీడిమెట్లలో వర్షం
సుచిత్ర, కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్..
దూలపల్లి, సూరారం, చింతల్, గాజులరామారంలో వర్షం
వర్షాలతో ఎక్కడికక్కడ కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మాన్సూన్ బృందాలు
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని GHMC సూచన
-
Aug 11, 2025 18:38 IST
ఎన్టీఆర్: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
చందర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు వేధింపులపై విచారణ
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సాంబశివరావు ఆధ్వర్యంలో విచారణ
ప్రభుత్వ సోషల్ ఆడిట్‌లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు
విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
25 మంది విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు
-
Aug 11, 2025 18:03 IST
విలువల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు: హోంమంత్రి అనిత
పులివెందులలో ఓటమి భయంతోనే జగన్ అసత్య ఆరోపణలు: అనిత
పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్య పద్ధతిలో...
ఎన్నికలు జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు: హోంమంత్రి
ఈసీ నిబంధనల ప్రకారం జరిగిన ప్రక్రియపై వైసీపీ నిందలు హాస్యాస్పదం
జగన్‌కు కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరం: హోంమంత్రి అనిత
వివేకా కేసులో ప్రభుత్వం తరఫున సునీతకు సాయం అందిస్తున్నాం: అనిత
తండ్రిని సొంత మనుషులే చంపారన్న సునీత బాధ అర్థం చేసుకోవాలి: అనిత
-
Aug 11, 2025 18:02 IST
పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
కార్గో హ్యాండ్లింగ్ కోసం లాజిస్టిక్స్ కార్పొరేషన్: సీఎం చంద్రబాబు
ఎకనమిక్ హబ్‌గా పోర్టులు, ఎయిర్‌పోర్టులు: సీఎం చంద్రబాబు
సరకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఏపీ: సీఎం చంద్రబాబు
షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు: ఏపీ సీఎం చంద్రబాబు
మరిన్ని పెట్టుబడుల కోసం మారిటైం పాలసీలో మార్పులు: చంద్రబాబు
-
Aug 11, 2025 17:24 IST
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రమాదం
ప్లాట్‌ఫామ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, మహిళ మృతి
పలువురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు
ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం
-
Aug 11, 2025 17:23 IST
వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో..
పోలింగ్ బూత్‌ల మార్పులో జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరణ
జడ్పీటీసీ ఎన్నికల్లో 6 పోలింగ్ బూత్‌లు మార్చారని పిటిషన్
గతంలో మాదిరి పోలింగ్ బూత్‌లు ఉంచాలని హైకోర్టును కోరిన పిటిషనర్
వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌పై కాసేపట్లో వాదనలు
-
Aug 11, 2025 16:59 IST
విజయవాడ ఏసీబీ కోర్టులో అడిషనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్
200 పేజీలతో కూడిన అడిషనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్
లిక్కర్ స్కామ్ అడిషనల్ ఛార్జ్‌షీట్ ఫైల్ బాక్సులతో కోర్టుకు సిట్ అధికారులు
భారీ భద్రత నడుమ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన సిట్ అధికారులు
ఛార్జ్‌షీట్‌లో ఏ ఏ అంశాలు ప్రస్తావించారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ
-
Aug 11, 2025 16:47 IST
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరో ట్వీట్
సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్‌రెడ్డి ట్వీట్
డిప్యూటీ సీఎం భట్టికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్
నాకు మంత్రి పదవిపై హైకమాండ్ మాట ఇచ్చిన విషయం సహా..
కొందరు అడ్డుకుంటున్నారనే వాస్తవాలను భట్టి తెలిపారు: రాజగోపాల్‌రెడ్డి
తనకు మంత్రి పదవి రాకుండా ముఖ్యనేత అడ్డుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి ట్వీట్
-
Aug 11, 2025 16:25 IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం
అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం, ఏడుగురు మృతి
పాపల్వాడీ కుందేశ్వర్‌స్వామి ఆలయానికి వెళ్తుండగా ఘటన
-
Aug 11, 2025 16:21 IST
విజయవాడ: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏసీబీ కోర్టు విచారణ
వల్లభనేని వంశీకి బెయిల్ షరతులు సడలింపుపై వాదనలు
కేసు తదుపరి విచారణ ఈనెల 14 కు వాయిదా
-
Aug 11, 2025 16:14 IST
నటుడు ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్‌కు తప్పకుండా పెళ్లి జరుగుతుంది: శ్యామలాదేవి
ఎవరితో అనేది తెలీదు కానీ.. ప్రభాస్ పెళ్లి మాత్రం జరుగుతుంది: శ్యామలాదేవి
-
Aug 11, 2025 16:12 IST
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో BRS నేతలు సమావేశం
కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌రావు భేటీ
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై చర్చ
ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం
దీంతో ఫాంహౌస్ సమావేశానికి ప్రాధాన్యత
-
Aug 11, 2025 15:47 IST
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్
అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు: కేంద్రం
అసీం మునీర్ అణుదాడి వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం
ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు: కేంద్రం
జాతీయ భద్రత కోసం కఠినచర్యలు కొనసాగుతాయి: కేంద్రం
అమెరికా మద్దతు ఇచ్చిన ప్రతిసారీ భారత్‌పై రెచ్చిపోవడం..
పాకిస్థాన్ ఆర్మీకి అలవాటుగా మారింది: భారత విదేశాంగశాఖ
-
Aug 11, 2025 15:36 IST
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
746 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
222 పాయింట్ల లాభంతో ముగిసిన నిప్టీ
-
Aug 11, 2025 15:09 IST
హైదరాబాద్: ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ
బెట్టింగ్ యాప్ కేసులో రానాను 4 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ
రానాను 30 ప్రశ్నలు అడిగి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన ఈడీ
ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలన్న ఈడీ
ఐదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్ ఈడీకి సమర్పించిన రానా
-
Aug 11, 2025 14:46 IST
బీహార్ లో 60 లక్షల ఓటర్లను తొలగించారు: రేణుక చౌదరి కాంగ్రెస్ ఎంపీ
ఫేక్ ఓట్లు నమోదు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారు
పనికిమాలిన పనులన్నీ బీజేపీ నేతలు చేస్తున్నారు
ఆ భయంతోనే ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తే అరెస్టు చేసి పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు
ఫేక్ ఓట్ల ఆధారంగానే ఎన్నికల్లో గెలుస్తున్నారు
అంతభయం ఎందుకు ఆందోళన చేస్తుంటే..
-
Aug 11, 2025 14:16 IST
కడప: 18 మంది కార్పొరేషన్ సిబ్బందిపై చర్యలు
చెత్తపన్ను అక్రమ వసూళ్ల అవినీతి కేసులో వేటు
2024 ఆగస్టు - 2025 జులై మధ్య చెత్తపన్ను అక్రమ వసూళ్లపై విచారణ
అక్రమంగా రూ.12 లక్షలు వసూలు చేసినట్లు గుర్తింపు
నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: కార్పొరేషన్ కమిషనర్
-
Aug 11, 2025 13:54 IST
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం: కేటీఆర్
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం చేసింది: కేటీఆర్
కాగ్ నివేదికతో సర్కార్ అసమర్థత మరోసారి బయటపడింది
ఒక్క సంక్షేమ పథకం కూడా అమలుచేయలేదు: కేటీఆర్
ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, విద్యార్థులకు సరైన భోజనం లేదు: కేటీఆర్
అప్పులతో ఏం చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి: కేటీఆర్
-
Aug 11, 2025 12:36 IST
సీఎం రేవంత్‌రెడ్డిపై పిటిషన్ వేసిన పెద్దిరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు
రేవంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటిషనర్ పెద్దిరాజు
హైకోర్టు న్యాయమూర్తి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలన్న CJI జస్టిస్ బీఆర్ గవాయ్
గతంలో పెద్దిరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన టీజీ హైకోర్టు
కేసును నాగ్‌పూర్ బెంచ్‌కు బదిలీ కోసం పెద్దిరాజు ట్రాన్స్‌ఫర్ పిటిషన్
హైకోర్టు న్యాయమూర్తి పైనా పిటిషనర్ పెద్దిరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు
పిటిషన్ డ్రాఫ్ట్ చేసిన ఏఓఆర్, పెద్దిరాజుపై సుప్రీంకోర్టు ధర్మాసన ఆగ్రహం
తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
-
Aug 11, 2025 12:36 IST
ఢిల్లీ: ఓట్ల చోరీ అంశంపై విపక్షాల ఉద్యమం ఉధృతం
పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్‌కు విపక్ష ఎంపీల మార్చ్
30 మందికి మాత్రమే అనుమతి ఉందన్న ఎన్నికల సంఘం
ఇండియా కూటమి నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ర్యాలీకి అనుమతి లేదంటూ సంసద్ మార్గ్‌ను బ్లాక్ చేసిన పోలీసులు
బారికేడ్లపైకి ఎక్కిన పలువురు ఎంపీలు
-
Aug 11, 2025 12:36 IST
ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీలో హైటెన్షన్
పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు చేపట్టిన ఇండియా కూటమి నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీల అరెస్టు
కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలు
గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాల నిరసన
-
Aug 11, 2025 11:26 IST
హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం
వేతనాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన మార్షల్స్
మార్షల్స్‌గా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు
మార్షల్స్ విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్‌పై ప్రభావం
హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం, నిలిచిన ప్రజావాణి సేవలు
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో సేవలు బంద్
హైడ్రాలో పూర్తిగా నిలిచిన ఎమర్జెన్సీ సేవలు
-
Aug 11, 2025 11:24 IST
ఒంగోలు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుడికి ఎదురుదెబ్బ
నిందితుడు ముప్పా సురేష్‌బాబుకు ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీం
నిందితుడికి ముందస్తు బెయిల్ దాఖలు అర్హత లేదన్న సుప్రీం ధర్మాసనం
కేసులో డబ్బు చేతులు మారడం, ఫోన్ కాల్స్ సహా..
తగినన్ని ఆధారాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటికే 9 మంది అరెస్టు
-
Aug 11, 2025 10:08 IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఘరానా మోసం
హిమాలయాల్లో దొరికే మూలికలభస్మంతో బంగారం
నాగపూర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో మోసాలు
కష్టాలు తొలగిపోయేలా 2 కేజీల బంగారం ఇస్తామంటూ బురిడీ
స్వామీజీల వేషధారణలో గోపాల్‌సింగ్ అనే వ్యక్తికి టోకరా
రూ. 10 లక్షలకు తీసుకున్న వనమూలికా భస్మం
నెలరోజుల పాటు పూజలు చేసి ఎరుపురంగు బట్టలో..
రెండు కేజీల బంగారం ఉంచాలన్న దొంగ స్వామీజీలు
వారం రోజులు ఇంట్లో పూజలు చేసిన తర్వాత తెరవాలని సూచన
ఐదురోజుల తర్వాత తెరిచి చూడగా బంగారం రంగుతో ఇనుప ముక్కలు
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్ట్, ప్రధాన నిందితుల కోసం గాలింపు
-
Aug 11, 2025 09:26 IST
తిరువనంతపురం- ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ఎంపీలు, ప్రయాణికులతో వెళ్తున్న ఏఐ2455 విమానంలో సాంకేతికలోపం
ఎయిరిండియా విమాన ప్రయాణికుల్లో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్
ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యతో విమానం చెన్నై మళ్లింపు
-
Aug 11, 2025 09:26 IST
వరద ప్రవాహం..
కర్నూలు: తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం
4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
-
Aug 11, 2025 09:26 IST
హిమాయత్ సాగర్ జలాశయానికి వరద
3 గేట్లు పైకెత్తి నీటిని మూసీలోకి వదిలిన అధికారులు
తిరిగి ORR సర్వీస్ రోడ్డును మూసివేసిన అధికారులు
రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం
మూసీ పరీవాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
Aug 11, 2025 09:25 IST
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
ఆగస్టు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం
13 నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు
పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ప్రభుత్వం సూచన
తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు
వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇవ్వాలని ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశం