Breaking News: తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు
ABN , First Publish Date - Aug 08 , 2025 | 07:24 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 08, 2025 20:36 IST
తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రాఖీ పండుగ శుభాకాంక్షలు
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: సీఎం రేవంత్
మహిళా సాధికారత సహా కోటీశ్వరులను చేసే సంకల్పంతో..
ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలు, పథకాల అమలు: సీఎం రేవంత్
రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు..
ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: తెలంగాణ సీఎం రేవంత్
మహిళల రక్షణ, భద్రత, అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేదు: రేవంత్
-
Aug 08, 2025 19:24 IST
భారత్, అమెరికా రక్షణ ఒప్పందం అమలుపై రక్షణశాఖ స్పందన
అమెరికాతో రక్షణ ఒప్పందంపై రాయిటర్స్ కథనం అవాస్తవం: భారత రక్షణ శాఖ
-
Aug 08, 2025 18:39 IST
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్
భారత్‌కు రావాలని పుతిన్‌ను ఆహ్వానించిన మోదీ
23వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు ఆహ్వానం
-
Aug 08, 2025 17:29 IST
ఏపీ పోలీస్ శాఖలో 14 మందికి IPSలుగా పదోన్నతి
ఎన్నికైనవారు ఏడాదిపాటు ప్రొబేషన్‌లో ఉండాలని ఆదేశాలు
-
Aug 08, 2025 17:11 IST
తిరుపతి: వైసీపీ గూండాల చేతిలో కిడ్నాప్ అయిన పవన్ ఆచూకీ లభ్యం
వైసీపీ మూకల దాడిలో గాయపడి సోషల్ మీడియాలో వైరల్ అయిన పవన్ దృశ్యాలు
చిత్తూరులో బాధితుడు పవన్‌ను గుర్తించిన పోలీసులు
బాధితుడు పవన్ కోసం 6 బృందాలుగా గాలించిన పోలీసులు
-
Aug 08, 2025 16:49 IST
ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించిన రాహుల్
డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?: రాహుల్
సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?: రాహుల్
నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది?: రాహుల్
ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?: రాహుల్
ఎన్నికల సంఘం ఏజెంట్‌గా BJP మారిందా?: రాహుల్
-
Aug 08, 2025 16:49 IST
ABNతో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు
BRS నుంచి ఐదుగురు MLAలు మాతో టచ్‌లో ఉన్నారు: రాంచందర్‌రావు
ఆ MLAలు ఎవరు.. బీజేపీలో చేరే తేదీ త్వరలో చెబుతాం: ABNతో రాంచందర్‌రావు
BRS నాయకత్వంపై నమ్మకం లేకే BJP వైపు చూస్తున్నారు: రాంచందర్‌రావు
ఐదుగురే కాదు.. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది: రాంచందర్‌రావు
ఇది ఆరంభం మాత్రమే.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చేరికలు పెరుగుతాయి
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలి: ABNతో రాంచందర్‌రావు
ఓటమి భయంతోనే సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లట్లేదు: రాంచందర్‌రావు
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు ఆయన అసహనానికి పరాకాష్ట: ABNతో రాంచందర్‌రావు
-
Aug 08, 2025 16:31 IST
అమెరికా సుంకాలకు భారత్ దీటైన కౌంటర్
అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత
క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేసిన భారత్ ప్రభుత్వం
అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న రాజ్‌నాథ్
-
Aug 08, 2025 16:12 IST
వైసీపీకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఏం సంబంధం?: షర్మిల
వైసీపీపై కోపాన్ని వైఎస్ విగ్రహాలపై చూపిస్తారా?: షర్మిల
తొలగించిన చోట వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
లేకుంటే విగ్రహ ఏర్పాటుపై ఉద్యమం చేస్తాం: షర్మిల
-
Aug 08, 2025 16:10 IST
హన్మకొండ: కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు: మంత్రి పొంగులేటి
కాళేశ్వరం కమిషన్ నివేదిక చూసి అంతా అసహ్యించుకుంటున్నారు..
BRS నేతలు సిగ్గులేకుండా మాపై ఎదురుదాడి చేస్తున్నారు: పొంగులేటి
BC రిజర్వేషన్ల బిల్లు ఆపేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు: పొంగులేటి
-
Aug 08, 2025 12:53 IST
సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ఇద్దరు విశాఖ డాక్టర్లు అరెస్ట్
డాక్టర్ నమ్రత స్నేహితులు రమ్య, రవిని అరెస్ట్ చేసిన పోలీసులు
కేజీహెచ్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ రవి
-
Aug 08, 2025 12:53 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్
సంజయ్‌తో పాటు విచారణకు వ్యక్తిగత సిబ్బంది హాజరు
బండి సంజయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న సిట్
మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్
సిట్‌కు కీలక ఆధారాలు సమర్పించిన బండి సంజయ్
-
Aug 08, 2025 12:53 IST
విశ్వప్రసాద్‌తో వ్యక్తిగత విభేదాలు లేవు: ఫిల్మ్ ఫెడరేషన్
వేతనాల పంపు చర్చల దశలో ఉండగా లీగల్ నోటీసులు సరికాదు
నోటీసులపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు: ఫిల్మ్ ఫెడరేషన్
సమస్యను ఛాంబర్ ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం
నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులపై లీగల్‌గా వెళ్తాం: ఫిల్మ్ ఫెడరేషన్
-
Aug 08, 2025 12:36 IST
ఎక్స్‌లో రాహుల్‌గాంధీ ఏమన్నారంటే..
ఓట్ల చోరీ దొంగలకు శిక్ష తప్పదు: ఎక్స్‌లో రాహుల్‌గాంధీ
ఓట్ల చోరీ కేవలం ఎన్నికల కుంభకోణం కాదు: రాహుల్
రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహం: రాహుల్
-
Aug 08, 2025 12:36 IST
ఢిల్లీకి మాజీమంత్రి హరీష్‌రావు
ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని BRS నిర్ణయం
ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న హరీష్‌రావు
ఢిల్లీలో న్యాయనిపుణులను కలవనున్న హరీష్‌రావు
ఇప్పటికే బనకచర్ల అంశంపై కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు
బనకచర్లపై సుప్రీంకు వెళ్తామని గతంలోనే BRS ప్రకటన
-
Aug 08, 2025 12:36 IST
జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల సెర్చ్ ఆపరేషన్
కుల్గాంలో ఉగ్రవాదిని హతమార్చిన భద్రతాబలగాలు
8 రోజులుగా ఉగ్రవాదుల కోసం కొనసాగుతోన్న గాలింపు
-
Aug 08, 2025 12:36 IST
తమిళనాడులో సొంత విద్యావిధానం అమలు
జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ద్విభాషా సూత్రాన్ని అమలు చేసిన సీఎం స్టాలిన్
ఇంటర్ మార్కుల ఆధారంగా యూజీలో అడ్మిషన్లు
విద్యాకోర్సుల్లో సైన్స్, ఏఐ, ఇంగ్లీష్‌కు ప్రాధాన్యం
-
Aug 08, 2025 10:38 IST
టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావుతో గువ్వల బాలరాజు భేటీ
ఈనెల 10న బీజేపీలోకి BRS మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
గువ్వలతో పాటు మరికొందరు BRS నేతలు బీజేపీలో చేరే అవకాశం
-
Aug 08, 2025 10:38 IST
హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ కేసు
కాసేపట్లో సిట్ విచారణకు బండి సంజయ్
బండి సంజయ్‌తో పాటు సిట్ విచారణకు హాజరుకానున్న బోయినిపల్లి ప్రవీణ్‌కుమార్, పసునూర్ మదు, పోగుల తిరుపతి
కీలక ఆధారాలను సిట్‌కు సమర్పించనున్న బండి సంజయ్
-
Aug 08, 2025 10:38 IST
ఓట్ల చోరీ దొంగలకు శిక్ష తప్పదు: ఎక్స్‌లో రాహుల్‌గాంధీ
ఓట్ల చోరీ కేవలం ఎన్నికల కుంభకోణం కాదు: రాహుల్
రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి జరిగిన పెద్ద ద్రోహం: రాహుల్
-
Aug 08, 2025 08:07 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రష్యా చమురు కొనుగోళ్లపై వివాదం నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
చమురు కొనుగోళ్ల వ్యవహారం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవు: ట్రంప్
-
Aug 08, 2025 08:07 IST
హైదరాబాద్‌లో భారీ వర్షాలపై సీఎస్ వీడియోకాన్ఫరెన్స్
క్షేత్రస్థాయిలో 250 బృందాలు పనిచేస్తున్నట్టు తెలిపిన అధికారులు
NDRF, SDRF, హైడ్రా, GHMC బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడి
ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశం
నీళ్లు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎస్
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: సీఎస్
-
Aug 08, 2025 08:07 IST
ఉత్తరాఖండ్‌లో 18 NDRF బృందాల మోహరింపు
ధరాలీలో సహాయక చర్యల్లో పాల్గొన్న 4 బృందాలు
రక్షణ చర్యల కోసం ఉమ్మడి ఆపరేషన్
ఇప్పటివరకు 275 మందిని రక్షించిన NDRF
-
Aug 08, 2025 08:07 IST
హైదరాబాద్: భారీవర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన నెంబర్లు
NDRF-83330 68536, ICCC-87125 96106, హైడ్రా-91541 70992
ట్రాఫిక్-87126 60600, సైబరాబాద్-85004 11111
రాచకొండ-87126 62999, TGSPDCL-79015 30966,
GHMC-81259 71221, HMESSB-99499 30003
-
Aug 08, 2025 08:07 IST
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం సహా నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
Aug 08, 2025 07:24 IST
మూసీకి భారీ వరద..
నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద, 4 గేట్లు ఎత్తివేత
మూసీ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 4,136.66, ఔట్‌ఫ్లో 4,734.99 క్యూసెక్కులు
-
Aug 08, 2025 07:24 IST
మహబూబాబాద్: కేసముద్రం రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం
లూప్ లైన్‌లో నిలిపి ఉంచిన మొబైల్ రెస్ట్ బోగిలో మంటలు
మంటల్లో పూర్తిగా కాలిపోయిన రైలు బోగి
డోర్నకల్-కాజీపేట మధ్య కొనసాగుతోన్న నిర్మాణ పనులు
ఉద్యోగులకోసం కేసముద్రం రైల్వేస్టేషన్‌లో మొబైల్ బోగి ఏర్పాటు