Breaking News: సంగారెడ్డి: అన్నారంలో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - Aug 06 , 2025 | 08:03 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 06, 2025 21:34 IST
సంగారెడ్డి: అన్నారంలో భారీ అగ్నిప్రమాదం
గుబ్బా కోల్డ్ స్టోరేజ్‌లో చెలరేగిన మంటలు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
-
Aug 06, 2025 21:05 IST
కర్ణాటక: ధర్మస్థలలో యూట్యూబర్లపై దాడి
ముగ్గురు యూట్యూబర్లపై దాడి చేసిన స్థానికులు
యూట్యూబర్ల మద్దతుదారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం
లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
ధర్మస్థల ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని స్థానికులు ఆగ్రహం
-
Aug 06, 2025 21:03 IST
లిక్కర్ కేసులో కసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
-
Aug 06, 2025 20:32 IST
ఢిల్లీ: 45 పైసల ప్రీమియంతో ప్రయాణ బీమా సదుపాయం
ఈ-టికెట్లతో రైలు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి అవకాశం
ఐదేళ్లలో 333 బీమా క్లైమ్‌ల కింద రూ.27.22 కోట్లు చెల్లింపులు: అశ్వినీ వైష్ణవ్
పార్లమెంట్‌లో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన రైల్వే మంత్రి
-
Aug 06, 2025 20:22 IST
articleText
-
Aug 06, 2025 20:22 IST
ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం
జేడీ శీలం, మస్తాన్ వలీని నియమిస్తూ AICC ప్రకటన
25 మంది పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రతినిధుల నియామకం
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రతినిధుల్లో మాణిక్కం ఠాగూర్,..
షర్మిల, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఇతర నేతలు
-
Aug 06, 2025 19:41 IST
మరోసారి టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్
భారత్‌పై 25శాతం అదనపు టారిఫ్‌లు విధించిన ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం
మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ సంతకం
-
Aug 06, 2025 19:37 IST
హైదరాబాద్: సృష్టి కేసులో వెలుగులోకి వస్తున్న అక్రమాలు
సికింద్రాబాద్‌కు చెందిన గైనకాలజిస్ట్ లెటర్‌హెడ్‌లు వాడిన నమ్రత
లెటర్‌హెడ్‌పై మందులు, ఇంజెక్షన్లు రాసి ఇచ్చిన నమ్రత
తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి ఆశ్చర్యానికి గురైన వైద్యురాలు
నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వైద్యురాలు ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 06, 2025 19:26 IST
ఢిల్లీ: కాంగ్రెస్ బీసీ ధర్నాపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణలో ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరనే..
ఢిల్లీ వచ్చి పగటివేషాలు వేస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ సభ.. గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయింది
ప్రణాళిక లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు: కిషన్‌రెడ్డి
బీసీ రిజర్వేషన్ల హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే
బట్టకాల్చి బీజేపీపై వేస్తామంటే ఊరుకోం: కిషన్‌రెడ్డి
బీసీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు ఇస్తామన్నారు.. ఏమైంది?
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా..
మజ్లిస్ చెప్పినట్టు పనిచేస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
అశాస్త్రీయ సర్వే చేసి బీసీల సంఖ్యను తగ్గించారు: కిషన్‌రెడ్డి
మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుంది: కిషన్‌రెడ్డి
-
Aug 06, 2025 18:55 IST
కాంగ్రెస్ మహాధర్నాపై ఎక్స్‌లో రాహుల్‌గాంధీ పోస్ట్
తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించాయి: రాహుల్
కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నాం: రాహుల్
బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుంది
కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నా: రాహుల్
దేశంలోని అణగారిన వర్గాలందరి కోసమే కాంగ్రెస్ పోరాటం: రాహుల్
-
Aug 06, 2025 18:54 IST
హైదరాబాద్: టాలీవుడ్‌లో స్కిల్ వర్కర్స్‌కు లోటు ఉంది: నిర్మాత విశ్వప్రసాద్
నేనైతే స్కిల్స్ ఉన్న వారితోనే సినిమాలు చేయాలనుకుంటున్నా: విశ్వప్రసాద్
ఇండస్ట్రీలో నా ఒక్కడి నిర్ణయమే నడవదు కాబట్టి కలెక్టివ్‌గానే నిర్ణయాలు
ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్‌పై కోపం లేదు: నిర్మాత విశ్వప్రసాద్
పరిశ్రమలో జరుగుతున్న వ్యవహారాన్నే బయట పెట్టా: విశ్వప్రసాద్
ఒక్కరు చేసే పనిని 20 మంది చేస్తామనటం కరెక్ట్ కాదు: విశ్వప్రసాద్
-
Aug 06, 2025 18:43 IST
GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికే మెజార్టీ స్థానాలు
9 స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం
కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్న వైసీపీ
ఎనిమిది స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ గెలుపు
-
Aug 06, 2025 18:18 IST
విజయవాడ: ఏసీబీ కోర్టులో చెవిరెడ్డికి దక్కని ఊరట
స్విమ్స్‌లో వైద్యం కోసం అనుమతి ఇవ్వాలన్న..
చెవిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
జైలులో ఇంటి భోజనం అనుమతించాలని మరో పిటిషన్
వారంలో 3రోజులు ఇంటి భోజనానికి కోర్టు అనుమతి
-
Aug 06, 2025 18:05 IST
రేపు సాయంత్రం హైదరాబాద్‌కు డీకే శివకుమార్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న డీకే శివకుమార్
జగ్గారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు కలిసి వెళ్లనున్న డీకే, రేవంత్
-
Aug 06, 2025 17:42 IST
పులివెందులలో వైసీపీ నేతలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: బొత్స
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి దారుణం: బొత్స సత్యనారాయణ
పులివెందులలో శాంతిభద్రతల పరిరక్షణకు SEC చర్యలు తీసుకోవాలి: బొత్స
-
Aug 06, 2025 17:36 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
ఈనెల 12న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు
-
Aug 06, 2025 17:32 IST
నందమూరి బాలకృష్ణ నివాసానికి టాలీవుడ్ నిర్మాతలు
ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను..
బాలకృష్ణకు వివరించనున్న నిర్మాతలు
-
Aug 06, 2025 17:31 IST
నాగర్‌కర్నూలు: BRSపై గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు
అసమర్థ నాయకత్వం కుట్రలు చేసిన నన్ను ఓడించింది: గువ్వల
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జీబీఆర్ అమ్ముడుపోలేదు
అధినేత కేసీఆర్ ఏం ఆదేశిస్తే అదే చేశా: గువ్వల బాలరాజు
అన్యాయాన్ని ఎదురించే పాత్రను ప్రతిపక్షం పోషించడం లేదు
బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాల నుంచి పిలుపు వచ్చింది: గువ్వల
-
Aug 06, 2025 16:32 IST
గుంటూరు: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా లారీ దగ్ధం
హైవేపై నిలిపి ఉన్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలిన లారీలోని సిలిండర్లు
-
Aug 06, 2025 16:12 IST
ఉత్తరాఖండ్‌లో 28 మంది కేరళ పర్యాటకులు గల్లంతు
మెరుపు వరదల కారణంగా 28 మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతు
-
Aug 06, 2025 16:12 IST
అమరావతి: కేబినెట్ ఇంటర్నల్
వచ్చే రోజుల్లో మరింత అప్రమత్తంగా పనిచేయాలి: సీఎం చంద్రబాబు
మేము నేరుగా పెట్టుబడులు పెట్టబోం: సీఎం చంద్రబాబు
సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులకు సిద్ధంగా ఉంది: సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ సంబంధాల నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిద్దాం అని చెప్పిన సీఎం
వాట్స్ అప్ ద్వారా సేవలు పూర్తిస్థాయిలో తీసుకువద్దాము అని చెప్పిన సీఎం
తప్పుడు వార్తలను నిజాలుగా, నిజమైన వార్తలను తప్పుడు వార్తలు గా చేస్తున్నారు
అందరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన సీఎం
క్రిమినల్స్ చాలా తెలివిగా ఉన్నారు... పోలీసులు, పొలిటీషియన్స్ వాళ్ళ కంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన సీఎం
ప్రభుత్వం పై ఇప్పుడు మంచి గుడ్ విల్ ఉంది ...
మనం తప్పులు చేస్తే అది న్యూట్రల్ అవుతుంది అని చెప్పిన సీఎం…
-
Aug 06, 2025 15:25 IST
ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు, నియామకాలు
వెయిటింగ్‌లో ఉన్న అధికారులను కమిషనర్లుగా నియామకం
మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో...
జాయింట్ డైరెక్టర్‌గా ఎస్ రవీంద్రబాబు నియామకం
రాయచోటి మున్సిపల్ కమిషనర్ ఎన్.వాసు బాబు బదిలీ
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టీపీఆర్వోగా ఎన్.వాసు బాబు నియామకం
రాయచోటి మున్సిపల్ కమిషనర్‌గా జి.రవి నియామకం
శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్‌గా పి.భవానీప్రసాద్ నియామకం
-
Aug 06, 2025 14:50 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్
భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు మృతి
ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Aug 06, 2025 14:44 IST
ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: రేవంత్
కేంద్రానికి బిల్లు పంపి 4 నెలలు అవుతున్నా ఆమోదించడం లేదు: రేవంత్
తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తున్నా కేంద్రానికి కనువిప్పు కలగడం లేదు
బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించి..
రాహుల్‌గాంధీని ప్రధాని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటాం: రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.. ఇది శోచనీయం: రేవంత్‌రెడ్డి
మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని మోదీ, అమిత్‌షా చెప్పి ఉండొచ్చు
బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి
రిజర్వేషన్లు ముస్లింల కోసం కాదు.. బలహీన వర్గాల కోసం: సీఎం రేవంత్‌రెడ్డి
ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది: సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 06, 2025 13:09 IST
కొనసాగుతున్న బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ
సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ఆరుగురు నిందితులు అరెస్ట్, రిమాండ్
ఢిల్లీలో కర్తవ్య్ భవన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్
హిమాచల్: కిన్నౌర్ జిల్లాలో భారీ వరదల్లో చిక్కుకున్న యాత్రికులు
-
Aug 06, 2025 13:09 IST
ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి: వెంకయ్యనాయుడు
గతంలో కారణం ఉంటేనే నేతలు పార్టీ మారేవారు: వెంకయ్యనాయుడు
ఇప్పుడు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు: వెంకయ్యనాయుడు
ఇది రాజకీయాలకు ఏ మాత్రం మంచిది కాదు: వెంకయ్యనాయుడు
ఒక పార్టీని నమ్మితే ఆ పార్టీ కోసం పనిచేసేవారే నిజమైన నాయకుడు: వెంకయ్య
-
Aug 06, 2025 13:09 IST
ఎమ్మెల్సీ కవితపై కొండా సురేఖ ఆగ్రహం
బీసీ రిజర్వేషన్లపై కవితకు మాట్లాడే అర్హత లేదు
కాంగ్రెస్ మహాధర్నాపై కవితవి అర్థం లేని విమర్శలు
బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తాం: కొండా సురేఖ
రిజర్వేషన్ల పోరాటంపై బీజేపీ తలవంచాల్సిందే: కొండా సురేఖ
-
Aug 06, 2025 13:09 IST
ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి: వెంకయ్యనాయుడు
గతంలో కారణం ఉంటేనే నేతలు పార్టీ మారేవారు: వెంకయ్యనాయుడు
ఇప్పుడు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు: వెంకయ్యనాయుడు
ఇది రాజకీయాలకు ఏ మాత్రం మంచిది కాదు: వెంకయ్యనాయుడు
ఒక పార్టీని నమ్మితే ఆ పార్టీ కోసం పనిచేసేవారే నిజమైన నాయకుడు: వెంకయ్య
-
Aug 06, 2025 12:03 IST
రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉన్నా: చిరంజీవి
కొందరు నేతలు నన్ను విమర్శిస్తూనే ఉంటారు: చిరంజీవి
అయినప్పుటికీ సోషల్ మీడియాలో నాపై విమర్శలు: చిరంజీవి
రాజకీయ విమర్శలపై నేను స్పందించను: చిరంజీవి
నేను చేసిన సేవా కార్యక్రమాలు, ప్రేమాభిమానాలే నాకు రక్షణ: చిరంజీవి
నేను మాట్లాడనక్కర్లేదు, నేను చేసిన మంచే మాట్లాడుతుంది: చిరంజీవి
నాపై చెడు రాతలు, మాటలకు నేను చేసే మంచే సమాధానం: చిరంజీవి
మంచి చేస్తూ.. మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడమే నాకు తెలుసు: చిరంజీవి
-
Aug 06, 2025 11:17 IST
సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ఆరుగురు నిందితులు అరెస్ట్, రిమాండ్
ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
గోపాలపురం పీఎస్‌లోనే నమత్రపై 8 FIRలు నమోదు
గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యుల్లత రిమాండ్‌కు తరలింపు
డాక్టర్ నమ్రతకు సంబంధించిన బ్యాంకులు, హాస్పిటల్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
రిమాండ్‌లో ఉన్నవారిలో ఎక్కువమంది మహిళలు
మరికొన్ని నమ్రత బ్యాంకు ఖాతాలను గుర్తించనున్న పోలీసులు
నమ్రత బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయినట్టు గుర్తింపు
-
Aug 06, 2025 11:17 IST
ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు ఈడీ నోటీసులు
ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు
-
Aug 06, 2025 10:10 IST
రష్యా చమురు కొనుగోళ్లు అంశంపై మాటమార్చిన ట్రంప్
అదనపు సుంకాలు లాంటివేమీ లేవని తాను చెప్పలేదన్న ట్రంప్
నేనెప్పుడూ సుంకాల శాతాల గురించి చెప్పలేదు: ట్రంప్
సుంకాలపై తక్కువ సమయంలోనే నిర్ణయం: ట్రంప్
రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తుందన్న భారత్ వాదనపై ట్రంప్ స్పందన
మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటుందన్న విషయం తనకు తెలియదన్న ట్రంప్
-
Aug 06, 2025 08:04 IST
నంద్యాలకు జగన్ రాక..
నేడు నంద్యాల జిల్లాలో జగన్ పర్యటన
డోన్‌లో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
-
Aug 06, 2025 08:04 IST
ఉత్తరాఖండ్‌కు భారీ వర్ష సూచన
9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఉత్తరకాశీ జిల్లా ధరాలీలో మెరుపు వరదలు
వరదల్లో నలుగురు మృతి, 100 మంది గల్లంతు
-
Aug 06, 2025 08:04 IST
ఢిల్లీలో నేడు కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం
కర్తవ్య భవన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాయంత్రం 6 గంటలకు కర్తవ్యపథ్‌లో మోదీ సభ
కేంద్ర సచివాలయంలో భాగంగా కర్తవ్య భవన్ నిర్మాణం
-
Aug 06, 2025 08:04 IST
దేశంలో ఎయిర్‌పోర్టులకు భద్రతా ముప్పు: ఇంటెలిజెన్స్ హెచ్చరిక
సెప్టెంబర్‌లో ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం: నిఘా వర్గాలు
నిఘా వర్గాల హెచ్చరికలతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రమత్తం
దేశంలో అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశం
ఎయిర్‌పోర్టులు, రన్‌వేలు, హెలిప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్‌కు భద్రత పెంచాలని అడ్వైజరీ జారీ
-
Aug 06, 2025 08:03 IST
ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం..
అమెరికా కూలిన విమానం, నలుగురు మృతి
నవజో నేషన్‌లో ల్యాండ్ అవుతుండగా మంటలు
ప్రమాదానికి గురైన విమానం ఎయిర్ అంబులెన్స్‌గా గుర్తింపు