Breaking News: ట్రంప్‌కు రష్యా స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - Aug 05 , 2025 | 06:56 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 05, 2025 20:41 IST
ట్రంప్‌కు రష్యా కౌంటర్
భారత్‌కు పుతిన్ కార్యాలయం మద్దతు
వాణిజ్య భాగస్వాముల ఎంపిక మా హక్కు: రష్యా
భారత్‌పై ట్రంప్ బెదిరింపులు అసమర్థమైనవి: రష్యా
అంతర్జాతీయ వేదికపై తమ ఆధిపత్యం క్షీణించడాన్ని..
అమెరికా జీర్ణించుకోలేకపోతోంది: రష్యా
దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోంది: రష్యా
-
Aug 05, 2025 18:26 IST
సృష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు...
సృష్టి కేసులో సంచలన విషయాలు.
ఐదు రోజుల కస్టడీలో సంచలన విషయాలను రాబట్టిన పోలీసులు
డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు.
పిల్లల్ని అమ్మే గ్యాంగులతో లింకులు పెట్టుకున్న డాక్టర్ నమ్రత.
మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రకు చెందిన గ్యాంగ్లతో నమ్రతకు లింకులు.
పిల్లల్ని కొని అమ్ముతున్న నందిని, హర్ష, పవన్‌లతో సంబంధాలు.
-
Aug 05, 2025 17:42 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండిసంజయ్‌కు మరోసారి నోటీసులు...
ఈనెల 8న విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు.
8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలన్న పోలీసులు.
విచారణకు హాజరవుతానన్న బండిసంజయ్.
-
Aug 05, 2025 15:53 IST
మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు
ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ: రాజగోపాల్‌రెడ్డి
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా: రాజగోపాల్‌రెడ్డి
జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారు
పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం నాది కాదు: రాజగోపాల్‌రెడ్డి
వేల కోట్లు దోచుకునేవాడికి పదవులు కావాలి: రాజగోపాల్‌రెడ్డి
-
Aug 05, 2025 15:45 IST
మెగాస్టార్ చిరంజీవిని కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు.
సినీ కార్మికుల బంద్ పై చిరంజీవితో చర్చించనున్న నిర్మాతలు.
సాయంత్రం 4 గంటలకి జూబ్లీహిల్స్ చిరంజీవి ఇంట్లో సమావేశం.
వేతనాల పెంపు వివాదం, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను వివరించనున్న నిర్మాతలు.
-
Aug 05, 2025 13:20 IST
అమరావతి: వర్రే శ్రీవిద్య సూసైడ్‌పై స్పందించిన ఏపీ మహిళా కమిషన్
శ్రీవిద్య సూసైడ్‌పై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్మన్ శైలజ రాయపాటి
పెళ్లైన 4 నెలలకే కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్య ఆత్మహత్య
భర్త, అత్తింటివారి వేధింపులు తట్టుకోలేకే శ్రీవిద్య ఆత్మహత్యని ఆరోపణలు
శ్రీవిద్య ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న శైలజ
కేసును రాష్ట్ర మహిళ కమిషన్ సుమోటోగా తీసుకుంటుందని తెలిపిన శైలజ
-
Aug 05, 2025 13:20 IST
గుంటూరు: కొరిటెపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి అనగాని
అర్బన్ మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తున్న విధానంపై మంత్రి ఆరా
ప్రయోగాత్మకంగా 4 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
క్షేత్రస్థాయిలో ఈ రెండు విధానాలు అమలు చేస్తున్న అంశాన్ని పరిశీలించిన మంత్రి
-
Aug 05, 2025 13:20 IST
విశాఖ: అవంతి కాలేజ్ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
తగరపువలస బ్రిడ్జి నుంచి గోస్తని నదిలోకి దూకిన బీటెక్ విద్యార్థిని
లెక్చరర్ మందలించారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
గజ ఈతగాళ్లను రప్పించి ప్రాణాలు కాపాడిన భీమిలి పోలీసులు
-
Aug 05, 2025 13:20 IST
విజయవాడ: గోవిందప్ప బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు
లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో ఇవాళ ఇరువర్గాల వాదనలు పూర్తి
ఈ నెల 12 న తీర్పు వెలువరించనున్నట్లు తెలిపిన న్యాయాధికారి
-
Aug 05, 2025 13:20 IST
విజయవాడ: ధనుంజయరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
లిక్కర్ కేసులో ధనుంజయరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
ఇదే కేసులో A33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ఈనెల 12న గోవిందప్ప బెయిల్ పిటిషన్‌పై ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై లంచ్ బ్రేక్ తర్వాత జరగనున్న వాదనలు
-
Aug 05, 2025 12:36 IST
తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ
పదోతరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న ఉత్తర్వులపై విచారణ
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన పలువురు విద్యార్థులు
నియమ నిబంధనలు రూపొందించాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
స్థానికత నిర్వచనం, పరిధి, పరిమితులపై మార్గదర్శకాలు ఇవ్వాలన్న హైకోర్టు
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విద్యార్థులు
CJI జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ
తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ సింఘ్వీ
రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవటానికి వెళ్తే తప్పేంటన్న CJI
పదేళ్లు స్థానికంగా ఉండి.. రెండేళ్లు బయటికెళ్తే స్థానికత ఎలా కోల్పోతారన్న CJI
-
Aug 05, 2025 12:06 IST
విజయవాడ: గత పాలకుల తప్పులు సరిదిద్దడం అంటే జనాలను బాదడమా?: షర్మిల
ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు ఏంటి?: APCC చీఫ్ షర్మిల
రూ.12 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడండి: షర్మిల
భారాన్ని ఏపీ ప్రభుత్వమే భరించాలి.. చంద్రబాబు APERCకి లేఖ రాయాలి: షర్మిల
గతంలో విధించిన రూ.17 వేల కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలి: షర్మిల
-
Aug 05, 2025 12:06 IST
ఏసీబీ కోర్టులో విచారణ
విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
లిక్కర్ కేసులో A4 మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు
-
Aug 05, 2025 12:06 IST
విజయవాడ కోర్టుకు హాజరైన వైసీపీ నేత పోతిన మహేష్
దుర్గగుడిలో 3 సింహాల మాయం ఘటనపై నాడు మహేష్ ఆరోపణలు
ఆనాటి మంత్రి వెల్లంపల్లి ఇంటి ముట్టడికి వెళ్లిన పోతిన మహేష్, ఇతర నేతలు
అప్పటి వైసీపీ ప్రభుత్వంలో పోతిన మహేష్‌తో పాటు 42 మంది పై కేసునమోదు
ఈ కేసు విచారణకు నేడు కోర్టుకు హాజరైన మహేష్ విచారణ వాయిదా వేసిన కోర్టు
-
Aug 05, 2025 11:39 IST
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్
ఫ్లకార్డులతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నినాదాలు
-
Aug 05, 2025 10:31 IST
విశాఖ: రేపు GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు
టీడీపీ నుంచి 9మంది, బీజేపీ నుంచి ఒకరు పోటీ
వైసీపీ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ
స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన
-
Aug 05, 2025 10:18 IST
నల్లగొండ: తిప్పర్తిలో వివాదాస్పదంగా ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం
సరైన పత్రాలు లేని, గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకులు అమ్మకం
బైక్ కొనుగోలు చేసి సగం డబ్బులే ఇచ్చిన వ్యక్తిపై కానిస్టేబుళ్ల ఒత్తిడి
బాధితుడు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన విషయం
పత్రాలు లేకుండా బైక్ అమ్మి ఇబ్బంది పెడుతున్నారని బాధితుడి ఫిర్యాదు
ఇద్దరు కానిస్టేబుళ్ల తీరుపై కొనసాగుతున్న అంతర్గత విచారణ
-
Aug 05, 2025 10:18 IST
అమెరికాతో అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చే యోచనలో మాస్కో
అమెరికా చర్యలు మా దేశానికి ముప్పుగా మారుతున్నాయి: రష్యా
1987 నాటి ఒప్పందానికి మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు: రష్యా
-
Aug 05, 2025 10:18 IST
గుంటూరులో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటన
ఛాయ్ పే చర్చ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం: మాధవ్
ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాం: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,444 కోట్లు నిధులు ఇచ్చింది: మాధవ్
స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసే యత్నం కేంద్రం చేస్తుంది
కార్మికులతో కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటాం: మాధవ్
-
Aug 05, 2025 10:18 IST
నేడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ.. మోదీ కీలక ప్రసంగం
పార్లమెంట్‌లో ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రభుత్వం కీలక సమావేశం
ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశా నిర్దేశం
-
Aug 05, 2025 10:17 IST
అమరావతి: రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన
నెక్కలులో గ్రావిటీ కెనాల్ పనులు పరిశీలించిన నారాయణ
రాజధానిలో అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు
పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు
-
Aug 05, 2025 06:56 IST
కర్ణాటక: ధర్మస్థలలో నేత్రావతి నది దగ్గర తవ్వకాలు
ఏడోరోజు 11, 12వ పాయింట్ దగ్గర కొనసాగుతున్న తవ్వకాలు
పెద్దమొత్తంలో అస్థిపంజర అవశేషాలు గుర్తించిన సిట్ బృందం
కొత్త స్థలంలో మానవ అవశేషాలను గుర్తించిన అధికారులు
డీజీపీ మొహంతి పర్యవేక్షణలో బంగ్లేగుడ్డే ఏరియాలో తవ్వకాలు
అవశేషాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు
-
Aug 05, 2025 06:56 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన
నేడు, రేపు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు
పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
తెలంగాణలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ