Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు..

ABN, Publish Date - Oct 27 , 2025 | 06:51 AM

మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒక నిమిషం కూడా ఫోన్ వదిలి ఉండలేని స్థితికి జనాలు చేరుకున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఫోన్లను కొనడానికి వేలల్లో.. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కొంతమంది అయితే.. మార్కెట్‌లోకి కొత్త ఫోన్ వచ్చింది అంటే చాలు అది తమ చేతికి రావాల్సిందే అన్న తీరులో తయారయ్యారు. దాని కోసం ఎంత డబ్బు అయినా పెట్టి ఫోన్‌ను కొని వాడుతుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైనా ఫోన్‌లను మనం చూద్దాం..

Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు.. 1/6

ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ పింక్ డైమండ్: $48.5 మిలియన్ల (సుమారు ₹404 కోట్లు) విలువైన ఈ ఫోన్ 24 క్యారెట్ల బంగారంతో పూత పూయబడి ఉంటుంది. వెనుక భాగంలో ఒక పెద్ద గులాబీ రంగు వజ్రం ఉంటుంది.

Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు.. 2/6

గోల్డ్ స్ట్రైకర్ ఐఫోన్ సుప్రీం: రూ.26 కోట్ల ధరతో, ఈ ఫోన్ 271 గ్రాముల బంగారం, 222 వజ్రాలతో తయారు చేయబడింది.

Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు.. 3/6

కేవియర్ ఐఫోన్ ప్రో: దీని ధర సుమారు ₹1.1 కోట్లు. వెనుక భాగంలో ఒక రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్‌తో పాటు 8 వజ్రాలు కూడా ఉంటాయి.

Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు.. 4/6

వర్టు సిగ్నేచర్ కోబ్రా: ఫ్రెంచ్ జ్యువెలర్స్ బౌచెరాన్ రూపొందించిన ఈ ఫోన్ ధర $310,000 (సుమారు ₹2.58 కోట్లు) ఉంటుంది.

Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు.. 5/6

డియాన్ లాక్‌ఫీల్డ్ ఫోన్: ఒక బంగారు గొలుసుతో పాటు వజ్రాలతో అలంకరించబడిన ఈ ఫోన్ సుమారు $15 మిలియన్లు ఖరీదు చేస్తుంది.

Expensive Phones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు.. 6/6

ప్రస్తుతం కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు కూడా లక్షల్లో విలువ చేస్తున్న విషయం తెలిసిందే.

Updated at - Oct 27 , 2025 | 08:09 AM