Monsoon Tips: వర్షాకాలంలో చీటికిమాటికీ జ్వరం వస్తోందా.. అయితే ఇలా చేయండి..
ABN, Publish Date - Aug 12 , 2025 | 09:46 PM
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతుంటారు. కొందరైతే పదే పదే జ్వరంతో అవస్థలు పడుతుంటారు. అయితే..
1/7
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతుంటారు. కొందరైతే పదే పదే జ్వరంతో అవస్థలు పడుతుంటారు. అయితే కొన్ని పండ్లు, కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/7
వర్షాకాలంలో హెర్బల్ టీలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
3/7
పెరుగు, మజ్జిగ, వెన్న వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రొటీన్ అందుతుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే పాల ఉత్పత్తులు, చిక్‌పీస్, కాయధాన్యాలు, బీన్స్ వంటివి విరివిగా తీసుకోవాలి.
4/7
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచడంలో సిట్రస్ పండ్లు బాగా పని చేస్తాయి. నారింజ, బొప్పాయి, నిమ్మకాయలు, చెర్రీస్, జామ, దానిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
5/7
పసుపులోని కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయం చేస్తాయి.
6/7
బొప్పాయిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన విటమిన్లు A, C, E ఉన్నాయి. అలాగే కడుపు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్లన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
7/7
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Aug 12 , 2025 | 09:46 PM